స్నేహితురాలి కథ

అమ్మ అమ్మ ఆకలి వేస్తోంది అన్నం పెట్టమ్మా అంది సిరి. ఛీ ఛీ ఎప్పుడూ తిండి గోలేనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవా అని విసుక్కుంది వాణి. అబ్బా అమ్మా చాలా ఆకలిగా ఉంది అమ్మ తినడానికి ఏదైనా పెట్టు అంటూ ఏడుస్తుంది సిరి. అబ్బా ఆగవే కాస్త ఫోన్ మాట్లాడుతున్నా కొద్దిసేపు ఆగు పెడతాను అని కసిరింది. అన్నం కావాలి అని ఏడవసాగింది సిరి.
రెండు దెబ్బలు వేసి, తిరిగి ఫోన్లో మాట్లాడసాగింది వాణి. సిరి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి కింద నే పడుకుండి పోయింది అలాగే నిద్ర పోయింది. వాణి ఫోన్ మాట్లాడడం రెండు గంటలు సాగింది. ఇంతలో భర్త రావడంతో ఫోన్ ఆపేసి సిరిని జాగ్రత్తగా సోఫాలో పడుకోబెట్టింది.
అదేంటి సిరి సోఫాలో పడుకుంది ఏంటి అడిగాడు రాజేష్ ఏం లేదండి నూడుల్స్ కావాలని ఏడ్చింది నూడుల్స్ తింటే హెల్త్ పాడవుతుంది అని చెప్పినా వినకుండా ఏడుస్తూ పడుకుంది అని అతికినట్లు అబద్ధం చెప్పింది వాణి. అది నమ్మిన రాజేష్ సరేలే పడుకోని ఒకపూట తినకపోతే దానికి బుద్ధి వస్తుంది అని ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోయాడు.
హమ్మయ్య అని నిట్టూర్చింది వాణి తన తప్పు తెలియకుండా జాగ్రత్త పడింది. భర్తకి ప్రేమగా భోజనం వడ్డించింది. భర్త పడుకున్నాక, తిరిగి హాల్ లోకి వచ్చి మళ్లీ ఫోన్ లో చాటింగ్ చేయ సాగింది. అలా తెల్లవారుజాము 5 గంటల వరకు చాటింగ్ చేసి అలాగే సోఫాలో పడుకుంది.
తెల్లారింది, రాజేష్ ఎప్పటిలా లేచి వారిని చూసి జాలిపడి అయ్యో పాపం రాత్రంతా సిరితో బాధ పడిందేమో అని అనుకొని తానే ఇంటి పనులు అన్నీ చేసి కాఫీ కలిపి వాణిని లేపాడు. అయ్యో అదేమిటండీ నన్ను లేపలేకపోయారా… నేను చేసే దాన్ని కదా అంది ప్రేమగా లేదులే నువ్వు రాత్రంతా కష్ట పడ్డావు కదా పర్లేదు మధ్యాహ్నానికి నీకు భోజనం రెడీ చేశాను. నేను ఆఫీస్ కి వెళ్తున్న జాగ్రత్తగా ఉండు సిరిని నేను స్కూల్ లో డ్రాప్ చేస్తాలే అన్నాడు రాజేష్.
హమ్మయ్య స్కూల్లో దింపే పని తగ్గింది నాకు అని అనుకుంటూ బాత్రూం లో దూరింది. స్నానం కానిచ్చి రెడీ అయ్యి ఫోన్ పట్టుకుంది. అప్పటికే ఫోన్ లో 10 మెసేజ్ లు వచ్చి ఉన్నాయి.. వాటన్నిటినీ చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ రిప్లై ఇవ్వ సాగింది. భోజనం టైం వరకు చాటింగ్ సాగింది తిరిగి భోజనం అయ్యాక మళ్ళీ చాటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతలో సిరి వచ్చింది స్కూల్ నుంచి… సిరికి తినడానికి ఏమీ పెట్టకుండా చాటింగ్ లో మునిగిపోయింది. అమ్మా ఆకలి వేస్తుంది ఏదైనా పెట్టు అంది సిరి ఇంట్లో పెట్టడానికి ఏమి లేవు వెళ్లి పాలు తాగు వంటింట్లో ఉన్నాయి అని నిర్దయగా చెప్పి తిరిగి ఫోన్ లో మునిగిపోయింది.
వాణి, రాజేష్ లది ప్రేమ మరియు పెద్దలు కుదిర్చిన పెళ్లి. వాణికి రాజేష్ బావ వరస అవుతాడు. కానీ పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బయటకి వచ్చి స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అలా మూడు సంవత్సరాలు గడిచాయి. వారి ప్రేమకు ప్రతిఫలంగా ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయికి సిరి అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకోసాగారు….

రాజేష్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తాడు అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి వాణిని ఇంట్లోనే ఉండి పాప ని చూసుకోమని అన్నాడు పాప పుట్టింది కాబట్టి పెద్దవాళ్లు కూడా వీళ్ళని క్షమించి రాకపోకలు సాగించారు. అలా రెండు సంవత్సరాలు గడిచాయి పాపని ప్లే స్కూల్ లో వేశారు. ప్రొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్కూల్ ఉంటుంది రెండు తర్వాత ఇంటికి వచ్చి తిని పడుకుంటుంది..

వాణి కూడా పాపని ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేది వారి తల్లిదండ్రులు రాజేష్ తల్లిదండ్రులు ఆంధ్ర లో ఉంటారు. వీళ్ళిద్దరూ హైదరాబాదులో అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారు. ఇలా రెండు సంవత్సరాలు పాప పుట్టాక కూడా సంతోషంగా ఉన్నారు దంపతులిద్దరూ… పాప స్కూలుకు వెళ్లడం మొదలయ్యాక వాణి లో మార్పు రావడం మొదలయింది. 24 గంటలూ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పాపని అసలు పట్టించుకోదు. అదే అపార్ట్మెంట్లో వాణి కి క్లోజ్ ఫ్రెండ్ పావని ఉంది.

పావని వేరే స్కూల్లో జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే వారు ఎంత క్లోజ్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరికీ ఓకే ప్లేట్ లో అన్నం కలిపి తినిపించేది. అలాంటిది దాదాపు సంవత్సరంగా వాణి పావనిని పలకరించడమే మానివేసింది. పావని కూడా అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే పాప ఉంది కదా బిజీగా ఉందేమో అని సర్దిచెప్పుకుంది..

అంతకుముందు ఎంత బిజీగా ఉన్నా ఒక మెసేజ్ అయిన పెట్టె వాణి ఈమధ్య అది కూడా పెట్టడం లేదు. రోజూ ఆరు గంటలకి క్రింద ఉన్న గ్రౌండ్ లోకి వచ్చి కూర్చునేది… ఎందుకంటే పాపని ఆడించడానికి తీసుకువెళ్తున్నా అన్న నెపంతో వచ్చి ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేది పావని కూడా రమ్మని పిలిచేది.

సరే ఫ్రెండ్ కదా పిలుస్తుంది కదా వెళ్దామని పావని వెళ్తే తనని అసలు పట్టించుకునేది కాదు. ఫోన్ పట్టుకుని మెసేజ్ లు చూసుకుంటూ తనలో తానే నవ్వుతూ ఉండేది. ఇక పావనికి అనుమానం స్టార్ట్ అయింది. భర్త ఫోన్ అయితే 2 నిమిషాల్లో మాట్లాడి పెట్టేసి వాణి ఎవరితో ఇంతలా మాట్లాడుతుంది మెసేజ్ లు చేస్తుంది అని అనుమానంతో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి వాణి వంట చేస్తూ ఉండగా దొంగతనంగా ఫోన్ తీసుకొని నంబర్ చూసింది.

ఆ నెంబర్ తన ఫోన్లో ఫీడ్ చేసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత పావని వాళ్ళ బ్రదర్ కు ఆ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ ఎవరిది కనుక్కోమని చెప్పింది. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఆ నెంబర్ ఎవరితో కనుక్కున్నాడు. అది అపార్ట్మెంట్లో ఉండే ఒక అతనిది అని అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అని తెలిసింది.. దాంతో ఇతనికి ఏం పని ఎందుకు అతనితో మాట్లాడుతుంది? అది కూడా భర్తకు తెలియకుండా పిల్లని పట్టించుకోకుండా మెసేజ్ లు చేస్తుంది….

ఎందుకు చేస్తుంది? అసలేం మాట్లాడుతుంది? అతనికి దానికి ఏమి సంబంధం అని పావని బాధ పడ సాగింది. ఈ విషయం తన ఫ్రెండ్ భర్తకు తెలిస్తే వాళ్ల కాపురం పాడవుతుందని గ్రహించి ఊరుకుంది. అయినా కూడా వాణిలో మార్పు రాలేదు. ఒకరోజు ఇక భరించలేక వాణిని కూర్చుండబెట్టి ఏంటి మీ కథ? ఎవరితో మాట్లాడుతున్నావ్? ఫోన్లో ఎవరతను? ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు భర్త పిల్లలు ఉన్నారు కదా మళ్లీ రిలేషన్ ఏంటి అని గట్టిగా ప్రశ్నించింది.

దానికి వాణి ఏం లేదు ఊరికే జస్ట్ ఫ్రెండ్ షిప్ అని చెప్పింది సరేలే ఫ్రెండ్ షిప్ ఏ కదా అని అనుకొని ఊరుకుంది అప్పటికి. ఇంతలో వాళ్ళ భర్త క్యాంప్ కి వెళ్ళవలసి వచ్చింది. పావని క్లోజ్ కాబట్టి అతను ఆ విషయం తనకి చెప్పాడు. పావని తనని అన్నయ్య అని పిలిచేది. నేను క్యాంపుకు వెళ్లినన్ని రోజులు అన్ని నువ్వు మా ఇంట్లో పడుకో లేదా వాణిని మీ ఇంటికి తీసుకు వెళ్ళు అని అన్నాడు అన్నయ్య సరే అన్నయ్య అని పావని అన్నది.

ఆ రోజు అతను క్యాంపుకు వెళ్లి పోయాడు పావని సాయంత్రం వెళ్లి రావే వాణి నువ్వు వంటెం చేయకు మా ఇంట్లోనే తిని పడుకుందాం అని అంది. లేదు లేదు నేను మా ఇంట్లోనే ఉంటాను వంట ఆల్రెడీ చేశాను నేను రాను నువ్వు వెళ్ళు అని పావనిని గెంటేసినంత పనిచేసింది వాణి. దాంతో పావనికి అనుమానం మొదలయ్యింది. సరే ఇది ఏం చేస్తుందో చూద్దామని వెళ్లినట్లే వెళ్లి ఒక చోట దాక్కుంది.

రాత్రి పది గంటలకి ఆ ఫ్రెండ్ అని చెప్పినతను మెల్లిగా వాళ్ళ ఇంట్లో దూరాడు. 10:00 కి వెళ్ళిన తను మరుసటి రోజు సాయంత్రం వరకూ వాళ్ళ ఇంట్లోనే ఉండి రాత్రి 7 గంటలకు బయటకి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత పావని వాళ్ళ ఇంట్లో కి సడన్ గా వెళ్లి చూసింది. ఇంకేముంది అక్కడ మందు బాటిల్స్, చికెన్, చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఖాళీ బాటిల్స్ పావనికి కనిపించాయి.

ఇక పావని గట్టిగా ఏంటిది వాణి ఇది? నీ భర్త నిన్ను నాకు అప్పచెప్పి వెళ్లారు నేను తనకి ఏం సమాధానం చెప్పాలి అని అడిగింది. వాణి బాగా మందు తాగిన మత్తులో ఉంది ఏదేదో మాట్లాడుతుంది. సిరిని చూస్తే తను కూడా మత్తుగా కనిపించింది ఏం జరిగిందో పావనికి అర్థం అయింది.

మెల్లిగా వాణిని లేపి బాత్ రూం లోకి తీసుకు వెళ్లి మొహం కడిగింది పావని. సిరిని కూడా ఫ్రెష్ గా రెడీ చేసింది. బాటిల్స్ అన్ని తీసి దాచి పెట్టి తర్వాత కూల్ గా ఉన్నప్పుడు విషయమంతా అడిగింది పావని. అప్పుడు వాణి, ఏం లేదు పావని, అతను నాకు నచ్చాడు నేను తనని లవ్ చేస్తున్నా…

ఈరోజు మేము దావత్ చేసుకున్నాము నాకు నచ్చినట్టు మందు, చికెన్ తెచ్చి పెట్టాడు పిల్ల అల్లరి చేస్తుందని రాత్రిపూట లేస్తుందని దానికి కూడా కొంచెం పోసాము అది నిద్ర పోయింది మేము నైట్ అంతా అంటే ఒక రాత్రి ఒక పగలు బాగా ఎంజాయ్ చేశాం.

నాకు అతనంటే చాలా ఇష్టం నేను అతన్ని లవ్ చేస్తున్నా అతన్నే పెళ్లి చేసుకుంటా నేను మా ఆయన్ని వదిలి పెడతా అని అన్నది. ఇక పావని షాక్ అయ్యి, ఏంటి మీ ఆయనని వదిలి పెడతావా ఇతను నీకు ముఖ్యమా? మీ ఆయన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు అన్ని వదిలేసి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాడిని ఎలా చేసుకుంటావు? నీకేమైనా బుద్ధుందా ఏం చేస్తావు మరి అని అడిగింది.

లేదు లేదు అతనికి పుట్టిన పిల్లలను అతనికే వదిలేసి నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అని మత్తులో ఉండి మాట్లాడింది. ఆ రోజంతా తన దగ్గరే ఉండి మొత్తం తగ్గాక కొంచెం అన్నం వండి పెట్టి నిద్రపోమని చెప్పింది పావని. నిద్ర నుంచి లేచాక నాకేం జరిగింది నువ్వెందుకు ఇక్కడున్నావు నా కూతురు ఎక్కడ అని పావని ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.

దానికి పావని, నువ్వేం చేశావో నీకు గుర్తు లేదా? ఏం మాట్లాడావో గుర్తులేదా? అని సీరియస్ గా అడిగింది. అప్పుడు వాణి, లేదే నాకేం గుర్తు లేదు అని అన్నది. అవునా అయితే విను నువ్వే మాట్లాడవు అని పావని తన ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టింది. అందులో వాణి మాట్లాడిన మాటలు అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ విన్న తర్వాత వాణి మొహం దుఃఖం తో నిండి పోయింది నేను అలా ఎలా మాట్లాడాను ఏదో ఎవరో వస్తారని మీ ఇంట్లో పార్టీ చేసుకుందాం అంటే ఆ బాటిల్స్ ఇక్కడ పెట్టాను. కానీ వాడు నాకే తాగించి నన్ను దోచుకున్నాడు అని ఏడవసాగింది.

వాడితో పాటు వాచ్ మెన్ కూడా వచ్చి వాణి శీలాన్ని దోచుకున్నాడు అంట ఆ విషయం వాచ్మెన్ ద్వారా అందరికీ తెలిసింది అని పావనికి చెప్పింది వాణి. ఒక్క భర్తకి తప్ప అందరికీ ఆ విషయం తెలిసి వాణిని చాలా చీప్ గా చూడసాగారు. పావని వాణికి అన్ని విధాలా నచ్చజేప్పింది. ఫోన్ లో ఉన్న సిమ్ము తీసి వేరే తీసుకో మళ్ళీ వాడికి నెంబరు ఇవ్వకు వాడితో మాట్లాడకు అని ఎంతగానో చెప్పింది పావని.

అయినా కుక్క తోక వంకర అన్నట్లు కొత్త సిమ్ము తీసుకున్నా కూడా వాణి మళ్ళీ వాడికి ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకో ఏమో వాడు ఏం చేసాడో ఏమో, ఏం మాయ చేశాడో, ఏం మాయ మాటలు చెప్పాడో తెలియలేదు పావనికి. కానీ తను మాత్రం వాడిని వదిలి ఉండలేకపోయింది. ఇంతలో దానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ఎవరివల్ల వచ్చిందో తనకే తెలీదు. అలా మళ్ళీ ట్విన్స్ పుట్టారు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు.

అబ్బాయిలు పుట్టాక అయినా వాణి మనసు మార్చుకుంటుందేమోనని ఆశించింది పావని. కానీ, అది మళ్ళీ వాడితో మాటలు కొనసాగించింది. ఈ విషయాలేవీ నేను వాళ్ళ భర్తకు చెప్పలేకపోయాను. ఎందుకంటే చెప్తే వాళ్ళ సంసారం నాశనం అవుతుందని ఆలోచించి పావని చాలా బాధ పడింది. తన విషయం అంతా ఇంట్లో పావని వాళ్ళ అమ్మకు, తమ్ముల్లకు అందరికీ తెలిసి పావని వాళ్ళ ఇంటికి రాకుండా కట్టడి చేశారు.

వాణితో మాట్లాడవద్దని నాకు ఆర్డర్ వేశారు. ఇలా కొన్ని రోజులు గడిచాక పావని వాళ్ళకి వేసవి సెలవులు వచ్చాయి వాళ్ళు వేసవి సెలవులకు ఊరికి వెళ్లి వచ్చారు. వాళ్ళు ఊరి నుంచి వచ్చిన తర్వాత వాణి గురించి ఆరా తీస్తే తను ఇల్లు ఖాళీచేసి పోయిందని తెలిసింది. తర్వాత దాని నెంబర్ వెతికి మరీ ఫోన్ చేసి ఏమయింది ఏంటి ఎందుకు ఇలా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అడిగింది పావని….

అప్పుడు తను చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వీళ్ళ విషయం తెలిసి వాళ్ళు వాణి జుట్టు పట్టి బయటకు లాగి పెద్ద గొడవ పెట్టారు. అందుకని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పకుండా… మాకు అక్కడ కలిసి రాలేదు అందుకే మేము మా ఊరికి వెళ్లి పోయాము అని చెప్పింది. కానీ అసలు సంగతి పావనికి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు.

వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగి వాళ్ళ ఆవిడ దీన్నిబట్టి బయటకు లాగి పెద్ద గొడవ చేసింది. వాళ్ళ ఆయన కూడా విషయం తెలిసింది అని చెప్పారు. కొన్ని రోజులు ఊర్లో ఉన్న తర్వాత వాళ్ళు ఆ ఊర్లో బేకరీ పెట్టి లాస్ అయ్యారు. అయినా కూడా వాణికి బుద్ధి రాకుండా మళ్ళీ వాడి తో ఫోన్లో మాట్లాడటం స్టార్ట్ చేసింది.

పావని ఎంత వద్దని చెప్పిన వినలేదు. వాడు ఏం చేశాడంటే తనకి తల్లి గారు ఇచ్చిన నగలు, ఆస్తి పత్రాలు, అన్నీ రాయించుకొని దాన్ని కాలితో తన్ని నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వే నా వెంట పడ్డాడు అని అన్నాడట. అది తాగిన మత్తులో ఉన్నప్పటి న్యూడ్ ఫొటోస్ చూపించి దాన్ని అందరి దగ్గర అంటే వాచ్మెన్ బంధువులు ఇంకా మిగతా కంపెనీ వాళ్ళ అందరి దగ్గర దాన్ని పడుకోబెట్టి డబ్బులు రాబట్టుకున్నాడని, వాడి వల్ల అది చాలా మోసపోయింది. వాళ్ళ వాళ్లు  అందరూ వచ్చి వాడిని వేరే చోటు కు తీసుకొని వెళ్ళారు అని పావనికి తెలిసింది.

వాళ్ళ ఊర్లో వాళ్ళ బేకరీ పెట్టి లాస్ అయిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చి వాడి తో మళ్ళి కనెక్షన్ పెట్టుకొని అప్పుడప్పుడు ఫోన్ లు మాట్లాడుతుంది. పావని వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ బంధువుల ఒక ముసలామె చనిపోయినప్పుడు కూడా అది వచ్చి వాడి తో మాట్లాడింది.

ఇవన్నీ చూసి పావని తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంది. నేను మాట్లాడకపోయేసరికి, నా ఫ్రెండ్షిప్ కట్ చేసుకునే సరికి తను పావని కాళ్ళబేరానికి వచ్చి నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, అందుకే నాకు ఇలా శాస్తి జరిగింది నాకు అలా జరగాల్సిందే, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నాకు ఇప్పుడు ఎవరు వద్దు అని సిమ్ములు మొత్తం చేంజ్ చేసి ఇప్పుడు బుద్ధిగా ఇద్దరు కొడుకులతో కూతురుతో, భర్త తో సంసారం చేసుకుంటూ హాయిగా ఉంది.

అలా అని పావని అనుకుంటుంది. కానీ మధ్య మధ్యలో అతను ఫోన్ చేస్తున్నట్లు వాళ్ళిద్దరు కలుస్తున్నట్లు మళ్ళీ తన దృష్టికి వచ్చింది. కుక్క తోక ఎప్పటికైనా వంకర కదా? ఎందుకు ఇలా చేశావు ఎందుకు వేరే అతనితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అని అడిగిన పావని ప్రశ్నకు తను చెప్పిన సమాధానం విని పావనికే కాదు మనకి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది.

భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దున్నే వెళ్లి పని చేస్తాడు, రాత్రికి వచ్చి అలసిపోయి, పడుకుంటాడు. కాబట్టి నాకు ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను అతన్ని పట్టుకున్నాను. అతని లవ్ చేశాను అని పావనికి చెప్పింది. ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను! ఎంతమంది ఇలా లేరు. ఎంత మంది భర్తలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉండి, పిల్లలను సంధానించుకునే ఆడవాళ్లు లేరా? ఎందుకు వాడితో రిలేషన్ పెట్టుకుంది. ఈ రోజు వాడి తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. రేపు ఇంకో వాడితో ఫ్రెండ్ షిప్ చేయదని అని నేను అనుకోను. ఇప్పుడు దానితో మాట్లాడడం తగ్గించుకున్నాను ఇది నా స్నేహితురాలి కథ.

మగవారు ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటారు. వాళ్ల గాలానికి చిక్కితే ఇక అంతే. అందుకే మగవారి జోలికి వెళ్ళకండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. ఫ్రెండ్షిప్ చేసినా. వాళ్లతో పిచ్చి పనులు చేయకండి. పెళ్లి కాని వాళ్లతో కూడా ఇలా చేయకండి. ఒక్కసారి పెళ్లి అయ్యాక భర్తే దైవంలా భావించాలి, ఇలాంటి వాళ్ళు రెండూ వైపులా ఉంటారు. కాబట్టి పెళ్లయి, పిల్లలు ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండండి. ఇది నా విన్నపం. 

– భవ్యచారు 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress