సోషల్ మీడియా పరిచయాలు

సోషల్ మీడియా పరిచయాలు

ఒకరోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. చాలా కాలం తర్వాత కలిసాం అని ఎంతో ఆనందపడ్డాము. తను చూస్తే చాలా బాధగా అనిపించింది. “ఏంటే అలా ఉన్నావు? కొంచెం నీరసంగా కనిపిస్తున్నావ్ ఏమైంది?” అని అడిగాను. “తను మాత్రం ఏం కాలేదే మొన్నటి వరకు ఒంట్లో బాలేదు అందుకని నీరసంగా ఉన్నా అంతే” అని కవర్ చేసింది. “సరే ఇక నేను వెళతాను” అని కోపంతో చెప్పాను. అంతే తను కన్నీళ్లు పెట్టుకుంది. “ఏంటే ఏం అయింది” అని నేను కంగారుగా అడిగాను.

“నాకు సోషల్ మీడియాలో ఒకతను పరిచయం అయ్యాడు. మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న తరువాత మా మధ్య ప్రేమ ఏర్పడింది. ఆరునెలలు గడిచిపోయాయి. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఒక రోజు మా ఇంటి పక్కన అబ్బాయి కలిస్తే మాట్లాడుతున్నాను అది చూసి నన్ను అనుమానించడం ప్రారంభించాడు. అతను నాకు తమ్ముడు లాంటివాడు అని చెప్పినా వినకుండా అతని పిలిచి ఏం మాట్లాడుకున్నారు అని అడిగాడు. అప్పుడు తన అనుమానం తీరుపోయింది. 

నేను కోపంతో రెండు రోజులు మాట్లాడలేదు. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను అని బుజ్జగించడం వల్ల కలిసిపోయాము. ఇలా గొడవలు జరుగుతున్నే ఉన్నాయి. ఒక్కొక్క సారి సైకోలా ప్రవర్తిస్తున్నాడు. వాడితో బ్రేక్ అప్ అయినా కానీ ప్రతి రోజూ ఫోన్ చేసి నీకు పెళ్లి కుదిరింది అంటగా మన ప్రేమ విషయం పెళ్లి వాళ్ళకి చెపుతాను అని బెదిరిస్తున్నాడు నాకు మాత్రం నరకయాతనంగా ఉంది అని చెప్పి ఏడుస్తుంది.”

“నువ్వు బాధ పడ్డాకు ఇక నుంచి వాడి సంగతి నేను చూసుకుంటాను” అని చెప్పాను.” వాడి నంబర్ తీసుకొని ప్రేమ పేరు చెప్పి వాడి చేత అన్ని నిజాలు ఒప్పుకొనేలా” చేసి పోలీసులకు అప్పగించాను. నా ధైర్యం చూసి ప్రతి ఆడపిల్ల నీలాగే ధైర్యంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. నా ఫ్రెండ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తను ఇప్పుడు ఎంతో హ్యాపీ గా ఉంది. సోషల్ మీడియా పరిచయాలు అసలు నమ్మకూడదు.

ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. తను కూడా నా మాట గౌరవించి సరే జాగ్రత్తగా ఉంటాను అని మాట ఇచ్చింది.

⁠- మాధవి కాళ్ల

Related Posts