సోయగం
మయూరపు సోయగం..
చేస్తుంది కనుల విందు..
మగ నెమలి నాట్యం..
పురి విప్పి ఆడుతుంది..
తమకంతో..
అది ఆడ నెమలికి ఇస్తుంది..పరవశం..
రెండూ కలిపి వర్షం పడినప్పుడు.
చేసే నాట్యం…
చూపరులకు కనువిందు..
కలిగిస్తుంది..
మగ నెమలి ఏడ్చినపుడు వచ్చే..
కన్నీళ్లు..
ఆడ నెమలి ఆనందంగా స్వీకరిస్తుంది..
అవే వాటి పిల్లలు పుట్టడానికి..
కారణమౌతాయి..
నెమళ్ల జంట..
చూడ ముచ్చటైన ఆనందపు పంట…
ప్రకృతి ప్రసాదించినఆ జంట..
మన జాతీయ చిహ్నపు గుర్తంట..
-ఉమాదేవి ఎర్రం