సుడిగుండం
నేనొక పడవ ప్రయాణం..
చేయాలనుకున్నా!
దానికి మా వారి సహాయం..
అడిగా!
సీత బంగారు లేడిని అడిగినట్టు..
రాముడు ఓహ్ అదెంత పని అన్నట్టు..
మా వారు కూడా అదెంత పని అని..
పడవ తనే నడుపుతూ..
నన్ను పడవలో కూర్చోబెట్టారు..
కానీ..
అక్కడ రావణాసురుడు సీతను..
ఎత్తుకు పోతే..
ఇక్కడ సుడిగుండం మా వారిని..
ఎత్తుకు పోయింది..
నన్ను నట్టేట్లో ముంచేసి..
ఇక నేను ఈదుతూ ఉన్న ఆ..
సముద్రాన్ని..
తీరం ఎప్పుడు చేరుతానో!!
– ఉమాదేవి ఎర్రం