సుగుణ
రాఘవ రావుకి నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడం, అతని చెల్లెల్లు నలుగురు కావడం వల్ల ఇల్లంతా సందడిగా ఉండేది రాఘవరావుది. అతను చేసే చిన్న ఉద్యోగంతో అందరికి అవసరమైనవి సమకూరుస్తూ ఉన్నాడు ఉన్నదాంట్లో తృప్తిగా ఉండేవారు.
తనకు తగిన వాళ్ళు అనిపించిన వాళ్ళతోనే తన నలుగురి చెల్లెలు పెళ్లిళ్లు జరిపించాడు. అప్పటికే రాఘవరావుకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ తప్పుగా భావించే వారిలో రాఘవరావు ఒకడు దానితో నియంత్రణ లేకుండా పోయింది. ఇంకా కనే వాడు ఏమో కాని సంవత్సరం తిరిగే సరిగి ఇద్దరూ చెల్లెల్లు పురిటికి రావడంతో ఆ పని మానుకున్నాడు ఇక రాఘవ రావు భార్య భర్త తెచ్చిన వాటి తోనే ఏమి తక్కువ చేయకుండా ఎలాగో చేసి అందరికి వండి, వడ్డించేది.
ఆ కట్టెల పొయ్యి వల్ల ఆమెకి కూడా ఆరోగ్యం బాగా లేక అంతటితో ఆపేసి, పురిటికి వచ్చిన చెల్లెళ్లకు పురూళ్ళ ఖర్చులు పెడ్తూ, బారసాలలు చేస్తూ ఉన్న జీతం అంతా వాళ్ళకి పెడ్తూ తన పిల్లలకి మాత్రం చదువు చెప్పించాలని లేకపోయేది, తనకోసం, తనపిల్లల కోసం, కాస్త అయినా దాచుకోవలని ఉండేది కాదు, చెల్లెళ్ళు, బావలు ఉన్నారు. నా కూతుర్లని వాళ్ళ కొడుకులకి చేసుకుంటారని భావిస్తూ ఉండేవాడు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తమ కోరికలన్నీ పుట్టింట్లో తీర్చుకుని, ఇక అన్నయ్య ఏమి పెట్టలేడని తెలుసుకొని ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకుంటూ రాకపోకలు తగ్గించారు.
ఇదేమి తెలియని రాఘవరావు పెద్ద చెల్లి కొడుక్కి తన కూతుర్ని అడగాలని అనుకున్నాడు, అతని పెద్ద కూతురు ఇంటర్ చదివి ఎదో స్కూల్ లో జాబ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాడిదుగా ఉంది. తన కూతుర్ని చేసుకుంటారు అనే నమ్మకం తో అడగడానికి వెళ్ళాడు, రాఘవరావు చెల్లి అత్త,మామలు పోవడంతో పలకరించి అలాగే పిల్ల విషయం అడగాలని వెళ్ళాడు. బావని ఈ విషయం కదపగానే ఏం ఉందయ్యా నీ దగ్గర మాకు ఇవ్వడానికి? కట్నం ఎంత ఇస్తావు? అని సూటిగా ఆడిగేసాడు.
దాంతో రాఘవ రావు నివ్వెర పోయాడు ఫ్రీగా చేసుకోడానికి మాకు పిల్లలు దొరక్కనా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడేసరికి వాస్తవం లోకి వచ్చాడు రాఘవరావు ఇక ఏ చెల్లిని ఏమి అడగవద్దు అని గట్టిగా అనుకోని, వెళ్ళొస్తానని వాళ్ళకి మర్యాదగానే చెప్పి అదే రోజు ఇంటికి వచ్చాడు ఇన్ని రోజులు తనకి బావలు ఉన్నారని అనుకుంటూ తన పిల్లలకి ఎం పెట్టలేకపోయినా వాళ్లే ఊర్లో ఉన్న బడి లొనే వాళ్ళంతగా వాళ్ళు వెళ్లి చదువుకున్నారు బుద్ది మంతులు అని పేరు తెచ్చుకున్నారు అని పిల్లలగురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు, ఏమైంది పిల్లని చేసుకుంటాము అన్నారా వాళ్ళు అంటూ లోపల్నుంచి వచ్చి అడిగింది అనిత భర్తకి నీళ్ల గ్లాసు ఇస్తూ..లేదు అనిత వాళ్లకి కట్నం కావాలంట చేసుకొము అని చెప్పారు అన్నారు బాధగా..
హ నేను అనుకుంటూనే ఉన్న ఈ మధ్య అసలు రావడం తగ్గించినపుడే నాకు కొంచెం అర్థం అయ్యింది. మనల్ని దూరం పెడుతున్నారని. మీకు చెప్తే బాధ పడతారని నేను ఏమి అనలేదు, పోనిలెండి అమ్మాయికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడే అవుతుంది, మీరు మాత్రం ఏం చేస్తారంటూ అనునాయయించి లోనికి వెళ్ళింది. లోపల ఆమెకి బాధ గా ఉన్న బయట పడితే ఇంకా ఆయన బాధ పడతారని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుని, పిల్లలని అన్నానికి రమ్మని పిలిచింది.
ఆరోజు కాకున్నా ప్రతిరోజు బాధ పడ్డం అలవాటు అయ్యింది వాళ్ళకి ఇక్కడ రాఘవరావు పిల్లల గురించి చెప్పుకోవాలి. అయిదుగురు మంచి వారు ఇంటి పరిస్థితి తెలుసుకొని మసలుకొనే వారు . పెద్దది అరుణ, రెండోది సుగుణ, మూడోవాడు మురళి, లలిత నాలుగోది , చిన్నది అయిన సరస్వతి, వాళ్ళ నలుగురి ఆడపిల్లల మధ్య ఒక్కే ఒక్క నలుసు మొగ పిల్లవాడు కావడంతో గారాబంగా చూసుకున్న అతను కూడా కుటుంబ భాద్యతలు తీసుకొని ఒక హోటల్ కి లెక్కలు రాసే వాడు అది రాత్రి పూట, ప్రొద్దున కాలేజీకి వెళ్లి చదువుకోవడం.
రాత్రి పని ఇలా సాగేది, రెండో అమ్మాయి 7వ తరగతి తర్వాత చదవడం ఇష్టం లేక ఇంట్లో తల్లికి సహాయం చేసేది, 3,4, అమ్మాయిలు చిన్నవాళ్లు కావడంతో అనిత పెద్దగా సుగుణ చదువు గురించి పట్టించుకోలేదు, ఇది ఇలా సాగుతుండగా ……
ఒకరోజు రాఘవరావు పెద్ద అమ్మాయి అరుణ ని పిలిచి పెళ్లి చేసుకుంటావా అమ్మ అని అడిగాడు, లేదు నాన్న ముందు చెల్లికి చేయండి తర్వాత నేను చేసుకుంటా అన్నది భయపడకుండా, అదేంటీ అలా చేస్తే నీకు మళ్ళీ పెళ్లి అవుతుందా? అక్కకి కాకుండా చెల్లికి చేస్తే నలుగురు నవ్వి పోతారు, హవ్వా ఇదేమి చోద్యమే అన్నది అక్కడే ఉన్న తల్లి , అది కాదమ్మ నేను జాబ్ చేస్తున్న కదా నేను కొన్ని డబ్బులు ఇస్తాను చెల్లి పెళ్లికి నేను వెళ్ళిపోతే నాన్నకి చేయదగిన సహాయం ఇదేనమ్మ అన్నది అరుణ.
నా కూతురు ఇంతా బాగా ఆలోచిస్తుందా అని ఆశ్చర్యం కలిగిస్తోంది అతనికి, సరే చూద్దాం ముందు సుగుణకే చేద్దామంటూ అనిత కి సర్ది చెప్పి, సుగుణకి సంభంధం చూసారు, చివరికి ఒక సంబంధం కుదిరినట్టు అనిపించింది, వాళ్ళు మూడు వేలు కట్నం అడిగారు, ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఒక పది రోజుల గడువు అడిగాడు రాఘవరావు. సరేనన్నరు వాళ్ళు,..
రాఘవరావు ఇంటి ముందు బాలయ్య అనే కాపు వాళ్ళు కిరాయికి వుండేవారు. రాఘవరావు అప్పుడప్పుడు పదో పరకో అప్పు ఇచ్చేవాడు, దాన్ని అతను మళ్ళీ అడిగేవారు కాదు, ఎందుకంటే వీళ్ళ పెద్ద కుటుంబాన్ని చూసి అడగలేకపోయేవారు. అతనికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరూ కొడుకులు, కుతుర్ల పెళ్లిళ్లు అయ్యాయి, కొడుకు కృష్ణ జీప్ డ్రైవర్ గా పని చేసేవాడు. చిన్నోడు చదువుకువాడు, పిల్లలంతా కలిసే ఆడుకునేవారు, ఒక్కోసారి వెళ్ళింట్లోనే తిని మళ్ళీ నాన్నకి చెప్పొద్దు అని అనేవారు.
సరే వాళ్ళ ఇంటి పరిస్థితి తెలిసిన వాళ్ళు ఏమి చెప్పకపోయే వారు, కృష్ణ కి వయసు వచ్చినప్పటి నుంచి అతను సుగుణ ని ఇష్టపడేవాడు, చెప్పాలని ఉన్నా, తన కులం గుర్తొచ్చి మూగగా ప్రేమించేవాడు. సుగుణ నెమ్మది కలది, సుగుణాల రాశి, కొంచం చామన ఛాయా గా ఉన్నా, పెద్ద కళ్లు, పెద్ద గా ఉన్న జడని చూసి ఆమె ఓపిక, సహనం నచ్చి కృష్ణ ఇష్టపడ్డాడు, అది ఆమె చూసినా, తండ్రి పరువు గుర్తొచ్చి ఎం మాట్లాడకుండా ఉండేది. సుగుణకి సంబంధం కుదిరిందని తెలుసుకున్న కృష్ణ ఇక ఆగలేకపోయాడు, వెళ్లి సుగుణకి తన ప్రేమ విషయం చెప్పాడు.
సుగుణ నిన్ను నేను ప్రేమిస్తున్న, నువు లేకుండా ఉండలేను, ఇన్ని రోజులు చెప్పకపోవడం నా తప్పే కానీ ఇప్పుడు నువ్వు వేరొకరి భార్యవి కావడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నా. నీకు కూడా నేనంటే ఇష్టమే అని నీ కళ్లు చెప్తున్నాయి, మీ వాళ్ళు ఒప్పుకోకుంటే బయటకి వెళ్లి పెళ్లిచేసుకుందాం అని అడిగాడు. అప్పుడు సుగుణ ఆవును కృష్ణ నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ నేను నా కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. ఫలానా వారి అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంది అది వేరే కులం వాడిని అని తెలిస్తే మా అక్కకి చెల్లెళ్ళకి పెళ్లిళ్లు అవుతాయా?
మా నాన్నగారు పరువుగా బ్రతుకుతారా? చెప్పు కృష్ణ నా ఒక్కదాని స్వార్ధం కోసం నీతో వస్తే వీళ్లందరు భాధ పడతారు, ఒక్కసారి ఆలోచించు, ఇదే పరిస్థితి మీ ఇంట్లో వస్తే నువ్వు ఎం చేస్తావో చెప్పు అని నిలదీసింది. అతను విస్మయానికి గురయ్యి సుగుణని చూస్తూ ఉండి పోయాడు. తన వయసుకన్న ఎక్కువగా ఆలోచించే అమ్మాయిని చూడడం నిజంగా ఎంతో అద్భుతం అని అనుకుంటూ చూస్తూ ఉండి పోయాడు.
చివరిగా ఒక్క మాట కృష్ణ నీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే నన్ను మర్చిపో. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని అంటారు. నాకైతే తెలీదు కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే నువ్వు బాగుండాలి. మనం అందరం బాగుండాలి అని చివరికి చూపు చూస్తున్నట్టుగా ఒక్కసారి దీర్ఘంగా అతని చూసి మౌనంగా వెళ్ళిపోయింది సుగుణ…..
ఇది జరిగిన కొన్ని రోజులకే సుగుణకి రమణ అనే వ్యక్తి తో పెళ్లి అయ్యి, వెళ్ళిపోయింది. ఆ తర్వాత తెలిసింది అతని మొదటి భార్య వెళ్ళిపోయింది అని. ఆ విషయం దాచి పెళ్లి చేసారని. అయినా ఎవరు ఏమి అనకుండా తల్లి వెళ్లి కాపురం చేసుకో అని తల్లి చెప్తే విని, ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయి, అతను కొట్టినా, తిట్టినా ఇక తల్లిగారి ఇంటికి వెళ్లకుండా అత్త గారింట్లోనే ఉండిపోయియింది సుగుణ….
ఇక్కడ రాఘవరావు పరిస్థితి బాగాలేదు, పెద్ద కూతురు స్కూల్ లో ఎవరితోనో ప్రేమ అంటూ తిరుగుతుంది అని తెలిసింది, వాళ్ళ పేర్లు కూడా గోడలకు ఎక్కాయని తెలిసి, బాధతో తాగుడుకి బానిస అయ్యాడు, తాగి రోడ్ మీద పడిపోతే ఎవరెవరో తెచ్చి ఇంట్లో దింపివేళ్లే వారు, ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంపాదించే వాడు తాగుడుకి బానిస కావడం, జీతం రాకపోవడం తో మురళి తెచ్చే డబ్బులు సరిపోక తిండి తినే అదృష్టం కూడా లేకుండా పోయింది.
ఓ పూట తింటూ, ఓ పూట తినక ఉండేవారు, పెద్ద అమ్మాయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ అబ్బాయి ని పెళ్లి చేసుకొని వచ్చింది, అది చూసి ఏమి అనలేక ఇంటికి పిలిచి కొంతమంది బంధువులను పిలిచి డబ్బు అప్పు తెచ్చి రిసెప్షన్ లాగా చేశారు. కొంతలో కొంత నయం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ కులం ఒక్కటే అవ్వడంతో ఎవరు ఏమి అనలేదు, అలా జరిగాక వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు, ఆ తర్వాత కూడా ఒక్కసారికుడా ఆమె ఆ ఇంటికి రాలేదు,…
ఇక మిగిలింది నాలుగోది లలిత. తను కూడా వయస్సు వచ్చింది. పదోతరగతి మూడో సారి కూడా పాస్ అవ్వకుండా ఇంట్లోనే ఉండేది. చిన్నది సరస్వతి మాత్రం స్కూల్ కి వెళ్ళేది. వాళ్ళు ఇద్దరూ ఒకే మాట మీద ఉండేవారు, ఒకరోజు సుగుణ అనుకోకుండా తల్లిగారి ఇంటికి పిల్లలతో వచ్చింది. చూసి పోదాం అని. సుగుణ తల్లిగారింటికి రావడం అది రెండోసారి మాత్రమే, అప్పటికి సుగుణకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుగుణ వచ్చి రాగానే కృష్ణ ని కలవాలని అనుకొంది.
పుట్టింటి విషయాలు తన భర్త ద్వారా తెలుసుకుంటూనే ఉంది, అయితే ఇప్పుడు వచ్చిన విషయం వేరు కాబట్టి కృష్ణ కోసం కబురు పంపింది రహస్యంగా కలుసుకోమని. తెల్లారి ఉదయం గుడికి అని చెప్పి, పిల్లల్ని తల్లి వద్ద ఉంచి, గుడికి వెళ్ళింది, అప్పటికే కృష్ణ అక్కడ ఉండడంతో దర్శనం చేసుకొని ఓ పక్కాగా కూర్చుని ఎలా ఉన్నావ్ కృష్ణ అని అడిగింది సుగుణ.
నిజానికి, అతను చాలా చిక్కిపోయాడు, గడ్డం పెరిగింది, కళ్లు లోతుకు పోయి ఉన్నాయి, ఢీలా పడ్డట్లు కనిపిస్తున్న అతన్ని చూసి లోపల భాద అనుచుకుంటు ఆడిగేసరికి, కృష్ణ చిన్న పిల్లడిలా
ఏడుస్తూ మోకాళ్ళలో తల పెట్టుకున్నాడు. అది చూసి కంగారు పడి చుట్టూ చూస్తూ, ఏంటిది కృష్ణ ఇన్ని రోజుల తర్వాత నేను వస్తే ఇదేనా నువ్వే నాకు ఇచ్చే బహుమతి? ఎందుకు ఆ ఏడుపు? ఆపు. నేను చాలా సంతోషంగా ఉన్నా చూడు అన్నది, ఆ అవును నువెంత సంతోషంగా ఉన్నవో నీ చేతుల మీద ఉన్న కాలిన గాయాలే చెప్తున్నాయి అన్నాడు కృష్ణ. కొంగు చుట్టూ కప్పుకొని నన్ను ఇంతా బాగా నువ్వు గమనిస్తున్నా వా అని అడిగి, అయినా ఇవి అప్పుడప్పుడు జరిగేవి కృష్ణ నాకు లేని భాద నీకెందుకు?
నువ్వు సంతోషంగా ఉండాలనే నా కోరిక, నేను నీ నుంచి ఒక సహాయం కోరి వచ్చాను. నువ్వు ఏడుస్తుంటే అది నేనెలా చెప్పాలి? అన్నది సుగుణ. అవునా ఏంటదీ సుగుణ నీకే సహాయం కావాలని అడిగినా నేను చేస్తాను ఆఖరికి నీ పిల్లలతో సహా నిన్ను పెళ్లి చేసుకోమన్న చేసుకుంటా అన్నాడు సీరియస్ గా. అబ్బా అంత పని నువ్వు చేస్తావని నాకు తెలుసు. కానీ అదేమి వద్దు నన్ను మా ఆయన బాగానే చూసుకుంటున్నారు.
నాకు అంత ధైర్యం కూడా లేదులే కానీ, నేను చెప్పిన పని చేస్తావా మరి అని అడిగింది. చేస్తాను అని కృష్ణ అనడం తో సరే చెప్పక కాదంటే మాత్రం నా మీద ఒట్టే అని అన్నది సరే ముందు ఏంటో అది చెప్పు అనగానే నువ్వు మా లలిత ని పెళ్లి చేసుకో కృష్ణ అన్నది సుగుణ. ఏంటి సుగుణ నువ్వు మాట్లాడేది నిన్ను ప్రేమించిన నేను నీ చెల్లి ని పెళ్లి చేసుకోవాలా?
అసలు బుద్ధి ఉండే మాట్లాడ్తున్నవా? ఒకర్ని ప్రేమించి, ఇంకొకరికి భర్తగా ఉండలేను నేను, నీకున్న తెలివితేటలు నాకు లేవు, ఒక్కసారి నన్ను కాదన్నావు తట్టుకున్న ఇక జీవితంలో పెళ్లి అనేది లేదని నిర్ణయం తీసుకున్న కాబట్టీ నేను మీ చెల్లినే కాదు, ఎవర్నీ పెళ్లి చేసుకొను. నా జీవితంలో నువ్వు తప్ప వేరే వ్యక్తి లేదు అన్నాడు కోపంగా… నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావని తెలిసే నిన్ను ఈ సహాయం అడిగాను, నువ్వు ఒప్పుకోవని తెలుసు, కానీ నువ్వు నాకూ మాట ఇచ్చావ్, ఒట్టు కూడా పెట్టుకున్నావ్!
ఇప్పుడు మాట తప్పుతావా? అంటూ ఆవేశంగా అని, అన్ని ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నా కృష్ణ, మా నాన్నగారి పరిస్థితి ఎం బాగాలేదు ఇంకా చిన్నది ఉంది పెళ్లికి, నువ్వు లలితని పెళ్లి చేసుకుంటే నాలా రెండో పెళ్లి వాడిని చేసుకునే బాధ తప్పుతుంది. అర్థం చేసుకో కృష్ణ నాలాగా అది కూడా బాధ పడకూడదని నేను నిన్ను అడుగుతున్న… నీలాంటి మంచి వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అయితే బాగుంటుంది, అని సుగుణ అనగానే నిన్ను చేసుకుంటా అని అడిగినప్పుడు కులం అని అన్నావు, మరి ఇప్పుడు గుర్తుకు రాలేదా ఆ కులము అన్నాడు. అవును అన్నాను అప్పుడు నా వెనక ముగ్గురి జీవితాలు ఉన్నాయి. అప్పుడు నాన్నా బాగున్నారు.
నేను లేచిపోతే వాళ్ళకి పెళ్లి కాదని భయపడ్డా, అప్పుడు అక్క ఉద్యోగం చేస్తుంది కాబట్టి అన్నాను. అది తప్పా, ఇప్పుడు ఒక్క చిన్న చెల్లి ఉంది, నాన్న ఎలాగూ రిటైర్మెంట్ అవుతారు డబ్బుతో కట్నం ఎక్కువ ఇచ్చి అయిన దాని పెళ్లి చేస్తారు, కానీ ఇద్దరివి అంటే మళ్ళీ ఏ మూడో పెల్లి వాడినో తెచ్చి కట్టబెట్టే అవకాశం ఎందుకు ఇవ్వాలని. ఇంకోటి ఏంటంటే నువ్వు జీవితాన్ని సంతోషంగా గడపాలని ఇప్పుడు ఈ మాట చెప్తున్నా, నిన్ను చూసి మీ అమ్మ, నాన్న ఎంత బాధ పడుతున్నారో చూసావా?
నువ్వు అసలు ఇంట్లో తిని ఎన్ని రోజులు అయ్యింది? పెద్ద వాడివి నువ్వు ఇలా ఉంటే మీ తమ్ముడు నిన్ను చూసి నేర్చుకుంటాడు. మనం ఏది చేసినా మన కుటుంబ సభ్యులు హర్షించాలి, కానీ మన వల్ల వాళ్ళు ఎడవకూడదు, ఇప్పుడు చెప్పు కృష్ణ నువ్వు నలుగురికి మంచి చేస్తావా, అందరిని ఎడిపిస్తావా?
మా లలిత అమయకురాలు, ఏమి తెలియనిది. మీ ఇంట్లో చెప్పి చేసుకో, నేనేమి చెప్పకుండా చేసుకో అని అనడం లేదు, అందరి అనుమతి తీసుకున్నకే నీ నిర్ణయం లలితకి చెప్పు అని అన్నది. సుగుణ ఇది నా వల్ల కాదు. నిన్ను ప్రేమించి ఎలా ని చెల్లి తో కాపురం చేస్తాను అని అనుకున్నావు, అనగానే దానిదేముంది కృష్ణ ఇప్పుడు లలితని ప్రేమించి, పెళ్లి చేసుకో, కాదు, కుదరదు అని అన్నావా, నేను చచ్చినట్టే.
నువ్వు నా మీద ఒట్టు కూడా పెట్టావ్, అది గుర్తుపెట్టుకొని, బాగా ఆలోచించి నీ నిర్ణయం నాకు రేపు ఉదయం చెప్పు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక ఈ సుగుణ నీకు జీవితంలో కనిపించదు, అది గుర్తుపెట్టుకొని నీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నేను వెళ్తున్నా, అని గబగబా వెళ్ళిపోయింది. కృష్ణ నిశ్శబ్దంగా ఉండిపోయాడు, కాదు ఆలోచిస్తున్నాడు. ముందుగా తల్లికి చెప్పాలని తన నిర్ణయం తెలుసుకొని ఆ తర్వాత తండ్రి సలహా తీసుకోవాలని అనుకున్నాడు.
అలా అనుకోని వెళ్లి తల్లికి చెప్పాడు కృష్ణ, తల్లికి అభ్యంతరం ఏమి కనిపించలేదు, కానీ కులం గురించి తర్వాత వచ్చే ఇబ్బందులు గురించి కొంత ఆందోళన పడింది. కృష్ణ నేను చేసుకుంటా అని అనగానే సరేనన్నది.
తర్వాత తండ్రిని తల్లిని కూర్చోబెట్టి ఉన్న విషయం చెప్పాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. తండ్రి వాళ్ళ కుటుంభాన్ని ఆదుకున్నట్టు అవుతుందని సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని సుగుణతో కూడా మాట్లాడారు, మరి లలితని ఎలా ఒప్పించాలి, అన్నది ఇప్పుడు ఉన్న సమస్య.
సుగుణ అన్నది నువ్వు నన్నుఎలా ప్రేమించాలి అనుకున్నావో, అలాగే లలితని కూడా ప్రేమించు అని సలహా ఇచ్చింది. కానీ దానికి టైమ్ పడుతుంది. అయినా పర్వాలేదు. నేను రేపు వెళ్లిపోతున్నా ఒక 2 నెలల్లో మీరు ఇంట్లోనుంచి వెళ్లి అయినా పెళ్లి చేసుకోండి నాకు ఉత్తరం అయినా రావాలి, లేదా తెలియాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కృష్ణ లలితని చూసాడు, బాగానే ఉందని అనిపించింది.
అయినా సుగుణ ని ప్రేమించిన మనసుతో ఈ అమ్మాయిని ప్రేమించాలా, అయినా సుగుణ కి బుద్ధి లేదు, ఒట్టు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతుంది, నా సుగుణ చాలా మంచిది కాబట్టే నేను జీవితాంతం ఒంటరిగా ఎక్కడ ఉంటానో అని నా గురించి ఆలోచించింది.
ప్రేమ ఎప్పుడు త్యాగన్నే కోరుతుందన్నట్టు, తనకి ప్రేమించిన వాడు దూరం అయిన తన చెల్లికి కట్టబెట్టాలని చూస్తుంది, అని లలితని కలుసుకోవలని ఉందని, రహస్యంగా రమ్మని తన తమ్ముడితో కబురు పంపించాడు, ఇవ్వన్నీ ఏమి తెలియని లలిత తనని కృష్ణ ఎందుకు రమ్మన్నాడు అని బయపడుతూనే వెళ్ళింది.
నిజంగా ఎత్తుకు తగ్గ లావుతో చామన ఛాయా రంగులో ఉన్న కృష్ణ అంటే సాధారణంగా భయం ఉంది. అందుకే భయపడుతూ వెళ్ళింది. లలిత రాగానే దగ్గరికి వెళ్లి లలిత నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటా నీకు ఇష్టం అయితే చెప్పు అన్నాడు, లలిత నివేరపోయింది, ఏంటి పిలిచి ఎదో మొక్కుబడిగా చెప్పినట్లు చెప్తున్నాడు, అది ప్రేమ విషయం, ప్రేమగా చెప్పొచ్చుగా అబ్బా, ఈ మనిషికి ప్రేమగా మాట్లాడ్డం కూడా తెలీదు, అని మనసులో అనుకుంది.
అదే విషయాన్ని భయపడకుండా తనతోనే అన్నది, ఆ కంఠం వినగానే కృష్ణ షాక్ అయ్యి, తనని చూడసాగాడు, అది అచ్చు సుగుణ కంఠం లాగే ఉంది. సుగుణ తనని లలితని చేసుకోమని ఎందుకు అన్నాదో అప్పుడు అర్థం అయ్యింది కృష్ణకి. మెల్లిగా లలిత దగ్గరగా వెళ్లి, చేతిలో చెయ్యేసి, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ లలిత నన్ను పెళ్లిచేసుకుంటావా, అని అడిగాడు, లలితకి ఎం చెప్పాలో అర్థం కాలేదు, ఇప్పుడే చెప్పాలా అన్నట్లు చూసింది.
ఇప్పుడు కాదు గాని బాగా ఆలోచించుకొని చెప్పు లలిత అన్నాడు ప్రేమగా. సరే నువ్వు ఇక వెళ్ళు నాకు ఏ విషయం ఎప్పుడూ చెప్తావో ఆలోచించి చెప్పు అన్నాడు, లలిత వెళ్ళిపోయాక ఆ క్షణం నుంచి లలిత ని ప్రేమించడం మొదలుపెట్టాడు…. లలిత ఇంటికి వెళ్లి ఆలోచించడం మొదలు పెట్టింది.
కృష్ణ ని కాదు అని అనడానికి ఏమి కారణం కనిపించలేదు. కానీ అన్నయ్య, తండ్రి, తల్లి ఏమంటారో అని భయపడింది. కృష్ణ మంచివాడే, చూడ్డానికి అలా ఉన్నా మనసు మంచిది. తాను 10వ తరగతి నుంచి అతన్ని చూస్తుంది, తన పనేంటో, తానేంటో అదే చూసుకుంటాడు.
ఎలాంటి అలవాట్లు లేవు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. చెల్లి లతో మంచిగానే మాట్లాడతాడు, తాను చిన్నగా ఉన్నపుడు వాళ్ళకి, చాక్లెట్స్, డ్రెస్ లు తెచ్చి ఇచ్చేవాడు, తల్లి మందలించిన పర్లేదమ్మ, మేము పరాయివాళ్ళమా అంటూ అతని తల్లి సర్ది చెప్పేది, ఎలా అన్ని మంచి విషయాలు కనిపించాయి. కానీ అన్నయ్యకి తెలుస్తే కొడతాడు, తిడతాడు, తండ్రి పరువు పోతుంది అని భయం ఉన్నా మనసు కృష్ణ వైపు మొగ్గు చూపింది, దానితో అతనికి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకోని నిద్రపోయింది…
ఆ తర్వాత విషయాలూ అన్ని తొందరగానే జరిగిపోయాయి, లలిత కృష్ణకి తన అంగీకారం చెప్పగానే, మీ ఇంట్లో ఎలాగైనా ఒప్పుకోరు, నాతో రావడానికి ఇప్పటినుంచే సిద్ధం అయ్యి ఉండు, నేను ఇప్పటినుంచి కొన్ని డబ్బులు మన పెళ్లి కోసం దాస్తాను, అని చెప్పగానే తనపై ఉన్న ప్రేమకి లలిత మురిసిపోయింది. ఇది ఇలా జరుగుతుండగానే సుగుణ ఒకసారి వచ్చింది. తనకి విషయం అర్థం అయ్యింది, ఒక రెండు రోజులు ఉండి, వెళ్ళిపోయింది.
ఒక ఆరునెలల్లో కృష్ణ అన్ని రకాలుగా డబ్బు దాచాడు, ఒక జీప్ రెడి గా పెట్టుకున్నాడు, ఫ్రెండ్స్ ని కూడా తయారు చేసాడు. ఒక మంచి ముహూర్తనా తల్లీ ఇంట్లో లేని సమయం చూసుకొని లలిత మబ్బున్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, దేవుని దగ్గర దీపం పెట్టి, తండ్రి, అన్నయ్య కాళ్ళ కి మొక్కి, చేతిలో ఏమి లేకుండా బయటకి వెళ్ళిపోయింది, అదే రోజు కృష్ణ వల్ల సొంత ఊర్లో ఉదయం 11:00 గంటలకు వివాహం జరిగిపోయింది…..
ప్రేమ ఎవరిదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, త్యాగన్నే కోరుతుంది అని ఈ కథ చదివిన వారికి అర్థం అవుతుంది…
తన ప్రేమని త్యాగం చేసిన సుగుణ ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటూ బ్రతుకుతుంది, మనుమడితో ఆడుకుంటూ ఉంది, లలిత ఇద్దరు కూతుర్లలకి పెళ్లి చేసింది, అమ్మమ్మ కూడా అయ్యింది, కొడుకు జాబ్ చేస్తున్నాడు, కృష్ణ కూడా జాబ్ లో రిటైర్డు స్టేజికి వచ్చాడు. సుగుణ భర్త చనిపోయారు, కొడుక్కి జాబ్, తనకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అందరూ కలుసుకున్నప్పుడు మర్యాదగా మాట్లాడుకుంటారు, మరిది అని కృష్ణ కి గౌరవిస్తుంది సుగుణ. వదిన అని కృష్ణ కూడా బాగానే మాట్లాడతారు, ఇప్పటికీ లలితకి వాళ్ల ప్రేమ విషయం తెలియదు, ఎప్పటికి తెలియకూడదని కోరుకుందాం… మరి సుగుణ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అంటారా? వాళ్ళు ఆ దేవుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. సుగుణ తమ్ముడికి కూడా పెళ్ళై ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. ఆ కుటుంబం మొత్తం ఏ చీకూ చింతా లేకుండా సంతోషంగా ఉన్నారు. (ఇది నిజమైన కథ ఇప్పుడు వాళ్ళ అందరూ ఉన్నారు.)
ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమతో ప్రేమగా చెబుతుంది ప్రేమించానని….
-భవ్యచారు
Nice story andi
Nice story andi
A great story bhavya gaaru.really nice andi