స్వేచ్ఛ

స్వేచ్ఛ

ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ వేరే దేశంలో కూడా ఉండదు
ఈ మట్టిలో ఉన్న ప్రతి అణువులో ఉంది స్వేచ్ఛ
దర్జాగా అవినీతి చేసుకోవటంలో ఉంది స్వేచ్ఛ
ప్రేశ్నించే వారి గొంతుకను నొక్కడంలో ఉంది స్వేచ్ఛ
మహిళల ఫై అఘాయిత్యాలు చేయడంలో ఉంది స్వేచ్ఛ
అర్హత కలిగిన వారిని నిరుద్యోగులుగా మార్చటంలో ఉంది స్వేచ్ఛ
ఇలా చెప్పుకుంటూ పోతే నా దేశంలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడా ఉండదు

– ప్రసాద్

Related Posts