స్వేచ్ఛకు విహంగమై
విజయం నేర్చుకోవాలనే విజ్ఞానం కాదు…
శారీరక శ్రమతో గెలిచిన నినాదమని
మరిచిన శ్వాసల ఊడిగాలతో ఓటమి
ఒంకరలను మనస్సుకు తుదేకంగా
పూసగుచ్ఛకు…రేపటికి సూర్యోదయం
ఎన్నో వెలుగుల ప్రయత్నమని…కర్తవ్యం
దీక్షగా తానొక విజయాన్ని సాధించాననే
విజయ గర్వంతో ఆ రోజుతోనే ఆగిపోదు…
ప్రావిణ్యం చెందిన బలాలతో లోకం
యాతనని ప్రగతికి చిహ్నమని…
సంశయాలను సోధకాలుగా పంపుతు
క్షణమాగని ప్రపంచాన్ని నీ ప్రాధేయపు
ప్రార్థనలతో ఆపలేవు పడినచోటే ఫలితాన్ని
ఆశించు…చీకటి భాగోతాలను వెలుగుల
సొరలతో కోయి… కొలవని కోణాలను
రచ్చబండ తీర్పులతో నిలుపుతు…
విడ్డురాలను వినమ్రలతో మౌనపు
అంగీకారంగా స్వీకరిస్తు శూన్యపు
సమీకరణాలతో నిలబడకు….
చూపుల తీక్షణలకు దొరికిన
సమయాన్ని రోజుగా ఆనందించుటకు
నిశ్చయించుకోకు…క్షణాలను ఆచరించే
సర్ధబాటు నీవై తాపసపు హృదిలో పగలని
ప్రతిబింబమై తపన చేసిన జ్ఞానవికాసాలతో
వికసించబడుతు… కఠోర పరిశ్రమల
కారుణ్యాన్ని శ్రమలకు ఫలితమని
నివ్వెరబోకు సృజనతో స్వచ్ఛత స్వేచ్ఛకు
విహంగమై స్వప్నం సాదృశ్యమై అడుగే
పరుగై లక్ష్యం పరమావది కావాలి…
నిలబడు దినదినాన అభివృద్ధి ప్రగతికి
విరబూసిన పూలవనం కావాలని…
వెతకడం లోపం కాదని తలచిన
కల్పనలతో తార్చుడు కావద్దు పాడవుతున్న
మానవత్వాన్ని కాపాడు…తొలికిరణం
సందేశాత్మకతలను నైతికతలు నేర్పనవిగా
వింటు…తెలిసి బతకడంలో కష్టాన్ని సాధించే
సుదీర్ఘ ప్రయాణమని ప్రతి సందర్భముతో
పరిచయం ఒక సాహసమని తెలుసుకో….
-దేరంగుల భైరవ