స్వేదము!!

స్వేదము!!

పరుగులు లెడితిని ఎందుకో……….?
ప్రత్యర్ధులు లేని,
ఈ పందెం లో నేను
ఏకాకి అభ్యర్ది నైతిని!!

చెంతన ఉన్న చలమ ను వదిలి,
ఎండమావి ని చెలి యని యెంచి,
పరుగు లెడితిని ఎందుకో………….?

భానుడి భగభగ లకి,
చెరువుల గుండెలు చెరువు లాయె,
ఆవిరైన వాటి స్వేదము,
పై, పైకి ఎగబ్రాకె ………………………..!
ఎండమావి ని చెలి అని యెంచి
పరుగు లెడి తిని ఎందుకో…,……….?

అలసిపోతిని నేను,
వర్షమై కురిసే నా స్వేదము .
మడుగు చూడ దల్చగా……………..!
అది ఎండమావితో చేరె ……………..!

– వాసు

 

Related Posts