శ్వేత

శ్వేత

A school girl concentrating on reading an English song in … | Flickr

శ్వేత అని నేను పనిచేసే బళ్ళో అరో తరగతి చదివే అమ్మాయి. చాలా చురుకైన చలాకి అమ్మాయి చాలా బాగా చదువుతుంది టీచర్స్ చెప్పేటప్పుడు వింటూ వారి కంటే ముందు ఆ పాఠాలను చదివి మరీ నోట్స్ కూడా తయారు గా పెట్టుకుని వాటికి సంబంధించిన అన్ని విషయాలు చేర్చుకుని రెడీ గా ఉండేది.

అందుకే ఆ అమ్మాయి అంటే మా అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు మాకంటే కూడా తెలివైన వాళ్ళు అయితే మాకు సంతోషమే కదా! ఇక శ్వేత వాళ్ళ అమ్మ సుజాత, నాన్న గారు రామరాజు గారు అని గుర్తు వాళ్ళ నాన్న గారు డాక్టర్ గా పని చేసేవారు.

శ్వేత చాలా చురుకుగా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉండేది వాళ్ళ ఇంట్లో తనకు చాలా ఫ్రీడమ్ ఉండేది హైపర్ ఆక్టివ్ అన్నమాట. చాలా బాగా చదివేది. కాబట్టి, వాళ్ళ నాన్నగారు కూడా ఏమీ అనేవారు కాదు వాళ్ళ అమ్మగారు కూడా ఆ పాపను చాలా బాగా చూసుకునేది ఒక బాబు కూడా ఉన్నాడు అంటే శ్వేత తమ్ముడు నాలుగో తరగతి, శ్వేత ఆరో తరగతి చదువుతూ ఉన్నారు. వాళ్లకు నేను క్లాస్ టీచర్ ను అలాగే తెలుగు టీచర్ ను ఆ అమ్మాయి అంటే నాకు చాలా అభిమానం చాలా తెలివి కలది. అన్నిట్లో ముందు ఉండడం వల్ల అందరూ అభిమానించే వాళ్ళు నేను క్లాస్ టీచర్ ను కాబట్టి నాకు ఇంకొంచం ఎక్కువ ప్రేమ, పైగా నాకు అమ్మాయిలు లేరు కాబట్టి ఇంకా ప్రేమ ఎక్కువ.

శ్వేత చాలా అందంగా ఉండేది తెల్లని గుండ్రని మొహం, నొక్కులు జుట్టు , సంపెంగలాంటి ముక్కు, చిన్ని ఎర్రని పెదవులు, బుల్లి మూతి, బారెడు జడను రెండు జడలు వేసుకుని పైకి కట్టేది. తెల్లగా ఉండడం వల్ల నల్లని కళ్ళు, నల్లని జుట్టు వంటివి శ్వేత అందాన్ని ద్విగుణీకృతం చేసేది. ఆ అమ్మాయికి ఆరో తరగతిలోనే పెద్దమనిషి అయ్యిందని తెలిసి సంతోష పడ్డాను.

ఎందుకంటే బాల్యం నుండి యవ్వనంలోకి రాబోతున్న తనను చూసి అనందపడాలో లేదా మగవాళ్ళు చూసే చూపులకు ఎక్కడ బెదిరిపోతుందో అని బాధ పడాలో అర్ధం కాలేదు నాకు అయినా జరిగేది జరగక మానదు అది ప్రకృతి ధర్మం కదా , అందుకే దాని ధర్మాన్ని అది నిర్వహించింది.

శ్వేత

School Indian Dress - Free photo on Pixabayఅలా శ్వేత కొన్ని రోజులు ఇంట్లో ఉండిపోయింది నాకైతే అసలు స్కూల్ అంతా బోసిపోయినట్లు వెన్నెల వెళ్లిపోయినట్లు అనిపించింది, ఆ కొన్ని రోజులే భారంగా గడిచాయి శ్వేత ఫంక్షన్ చేశారు కానీ అందరికీ తెలిసేలా కాదు కొందరిని మాత్రమే పిలిచారు అందులో నేను కూడా ఉన్నాను, వెళ్ళాను తనకు ఉపయోగపడేలా రిస్ట్ వాచీ గిఫ్ట్ ఇచ్చాను, చూసి పొంగి పోయింది ఆ అమ్మాయి టైం చాలా విలువైంది కదా ఫంక్షన్ అయిన కొన్ని రోజులకు మళ్లీ మా బళ్ళో వెలుగు వచ్చింది అంటే శ్వేత వచ్చేసింది.

రోజులు గడుస్తున్నాయి ఆరో తరగతి ఆరు నెలల పరీక్షలు స్టార్ట్ అయ్యాయి, నేను పరీక్షలు పెట్టడంలో చాలా బిజీ అయ్యాను దాదాపు అన్ని క్లాస్ లకు నేను సబ్జెక్ట్స్ చెప్తాను కాబట్టి ఆ పేపర్స్ చూసుకోవడం, ఎవరు ఆబ్సెంట్ అయ్యారో రాసుకోవడం వంటి వాటిల్లో అలాగే స్కూల్ అసిస్టెంట్ కాబట్టి మిగిలిన పేపర్స్ అందరికీ ఇవ్వడం వాటి లెక్క చూసుకోవడంలో బిజీ గా ఉండే దాన్ని అలా పరీక్షల తర్వాత శ్వేత కొంచం డల్ గా ఉండడం మొదలు పెట్టింది దాంతో దగ్గరకు పిలిచి ఏమైందని అడిగాను పరీక్ష సరిగ్గా రాయలేదు అని చెప్పింది దానికెందుకు అంత బెంగ ఆరోతరగతే కదా డోంట్ వర్రీ అని చెప్పాను అప్పటికి ఊరుకుంది.

కానీ తను చాలా రోజులుగా దిగులుగా ఉండడం చూస్తూనే ఉన్నా కానీ ఎంత అడిగినా తను సమాధానం చెప్పలేదు సరేలే మెల్లిగా అడగవచ్చు తనంతట తానే చెప్తుంది అని నేను గమ్ముగా ఉన్నాను కానీ ఇంతలోనే మా మామగారు చనిపోయారు అని తెలియడం వల్ల మేము అర్జెంట్ గా మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది..

అక్కడ మా మామగారి ఖర్మ అంతా అయ్యాక అత్తగారిని తీసుకుని మళ్ళీ వచ్చేసాము, ఇక మా ఇంటికి వచ్చాక సెలవు అయిపోయి చాలా రోజులు అయ్యింది కాబట్టి ఆ రోజు స్కూల్ కు వెళ్ళాను అయితే ఎప్పుడూ సందడిగా ఉండే స్కూల్ ఏదో గంభీరత సంతరించుకుం.ది ప్రేయర్ కి సమయం అవడం తో బ్యాగ్ స్టాఫ్  రూమ్ లో పారేసి గబగబా వెళ్ళాను అందరూ నిలబడి ఉన్నారు ప్రిన్సిపాల్ గారు నిలబడిన చోట ఒక టేబుల్ వేసి దాని పై ఏదో పెట్టడం చూసి కాస్త వంగి చూశాను ఎంటా అని అక్కడ అక్కడ శ్వేత ఫోటో కి దండేసి ఉంది అది చూశాక నాకు సృహా తప్పింది.

కళ్ళు తెరిచి చుట్టూ చూశాను నేను స్టాఫ్ రూమ్ లో ఉన్నాను గబుక్కున లేచి కూర్చున్నా, అయోమయంగా చూస్తున్న నాతో శశి టీచర్ ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టింది. శ్వేత వాళ్ళ చుట్టం ఒక అబ్బాయి అదే ఊర్లో ఉండేవాడు ఒక రోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు అంట ఆ సమయంలో ఎలా తీశాడో కానీ శ్వేత స్నానం చేస్తున్న వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అంట అది శ్వేత ఎవరికీ చెప్పలేదు అదే వాడికి అలుసుగా మారింది దాంతో ఫంక్షన్ అవ్వగానే వాడు కొత్త కోరిక కోరడం జరిగింది శ్వేత ఆ వీడియో డిలీట్ చేయమని అడిగితే తన కోరిక తీర్చమని అడిగాడు అంట శ్వేత ఆ పని కూడా చేసింది.

 

Indian School Girl Stock Illustrations – 666 Indian School Girl Stock Illustrations, Vectors & Clipart - Dreamstime

కానీ వాడి స్నేహితుల కోరిక కూడా తీర్చమని అడగడంతో ఇక శ్వేత భరించలేక పోయింది, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు చెప్తే ఏమంటారో, తననే తిడతారు ఏమో అని లోలోపల భాధపడుతూ, నిరాశ నిస్పృహలకు లోనైన శ్వేత తనకు చావే పరిష్కారం అనుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో లెటర్ లో మొత్తం రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది, విషయం తెలిసిన వాళ్ళ అమ్మ గుండెలు పగిలేలా ఏడ్చింది అంట, లెటర్ సహాయంతో వాడిని అరెస్ట్ చేశారు అని చెప్తూ తను కూడా ఏడవడం మొదలు పెట్టింది శశి టీచర్.

విన్న మాకే ఇలా ఉంటే ఇక ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఆ నరకం పగ వారికి కూడా రాకూడదు.. ఇంకా లోకం అంటే ఏమిటో తెలియని ఒక సుకుమార కుసుమం కామ పిశాచికి బలి అయిపోయింది.. నేల రాలి పోయింది.

       (కథలో పేర్కొన్న పాత్రలు అన్నీ కల్పితాలు , సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు ఏమీ తెలియని వారు బలి అయిపోతున్న పక్షంలో ఇలా రాయడం జరిగింది.)

                                                                                                                                                                                  – వెంకట కస్తూరి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *