తాపీ మేస్త్రి

తాపీ మేస్త్రి

తాపీ మేస్త్రి

శ్రీను ఒక కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాడు.  ఆ పనిలో ఎంతో నైపుణ్యం కలవాడు. కొన్ని డిజైన్స్ శ్రీనునే చేసేవాడు. ఒక కాంట్రాక్టర్ గా ఎదగాలని శ్రీను ప్రయత్నిస్తున్నాడు. శ్రీనుకి దూర బంధువైన రామయ్య తన ఇంటిని కట్టమని చెప్పాడు. కాంట్రాక్టర్ దగ్గర పని మానేసి రామయ్య ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు.

అది ఎండాకాలం వల్ల అలికి పనివాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు మధ్య మధ్యలో మజ్జిగ చేసి ఇచ్చేవారు. సాయంత్రం పూట టీ చేసి ఇచ్చేవారు.
ఇలా రెండు నెలల తర్వాత ఇల్లు కట్టడం పూర్తయింది. రామయ్య ఇల్లు చూసి “నేను చెప్పిన ప్రకారమే వాస్తుగా అన్ని వచ్చేటట్టు కట్టారు” శీను ని మెచ్చుకున్నాడు. రామయ్య కి తెలిసిన వాళ్ళందరికీ శ్రీను గురించి చెప్పేవాడు.

వాళ్లు కూడా రామయ్య వాళ్ళ ఇల్లు చూసి మాకు ఇలాంటి ఇల్లే కావాలి అని అడిగారు. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న శీను ని చూసి ఆ కాంట్రాక్టర్ అసూయ పెంచుకున్నాడు. నా దగ్గర పని చేసినోడు, నాకంటే ఎత్తుకు ఎదుగుతుంటే నాకది నచ్చట్లేదు. వాడెప్పుడూ నాకంటే కింది స్థాయిలోనే ఉండాలి. నా దగ్గరే పని చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నాడు.

రామయ్య మాటలు విని ప్రెసిడెంట్ తన ఇల్లు కట్టమని శీను కి చెప్పాడు. కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ మంచి ఫ్రెండ్స్. “నిర్మాణ క్వాలిటీ, ఇంటికి కావలసిన మెటీరియల్ అన్ని నేను చూసుకుంటాను” అని చెప్పాడు కాంట్రాక్టర్. “సరే నీ ఇష్టం” అని చెప్పి ఒప్పుకున్నాడు ప్రెసిడెంట్. భావించిన కాంట్రాక్టర్ ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్ నాసిరకపు మెటీరియల్ వేసి ఇల్లు కట్టమని చెప్పేవాడు శ్రీనుకి.

ఏమని అడిగితే మాత్రం “ఈ పనిని వదిలేసి వెళ్లిపోండి” పొగరుగా చెప్పేవాడు కాంట్రాక్టర్. వీడు మాటలు భరించలేక  ప్రెసిడెంట్ ని కలవాలని నిర్ణయించుకున్నాడు శీను. తను కలిసిన ప్రతిసారి చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరూ స్నేహితులు చెప్తే వీళ్ళ స్నేహం పాడైపోద్ది అని ఆలోచించి ఊరుకునే వాడు శీను. ఒకరోజు బాగా వర్షం వచ్చే ఒక సైడ్ గోడ కూలిపోయింది.

ఆ కాంట్రాక్టర్ ఉన్నవి లేనివి అన్ని కల్పించేసి శీను పైన చెప్పాడు. ఆ మాటలు నిజమా అబద్దమా ఆలోచించకుండా శీను ని కొట్టడానికి వెళ్ళాడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ శ్రీను ఇంటికి వచ్చి ఆవేశంగా మాట్లాడితే ఆ మాటలు పట్టించుకోకుండా, “మీరు ఒక రోజు పెద్ద వాళ్ళు అందరూ పిలిపించి నేను దోషిని అని నిరూపించండి” సవాల్ విసిరాడు. “తప్పు చేసిన వాళ్ళని ఊరికే విడిచి పెట్టను. రేపే సమావేశం నువ్వు రావాలి” అని శ్రీనుకి బెదిరిస్తూ చెప్పి వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్.

బాగా ఆలోచించి రామయ్య దగ్గరికి వెళ్ళాడు శీను జరిగిన విషయం మొత్తం చెప్పాడు. సమావేశానికి అందరూ పెద్దవాళ్ళు వచ్చారు రామయ్య కూడా. శీను తనతో పాటు చేసిన పని వాళ్లు కూడా వచ్చారు. “ప్రెసిడెంట్ ఇల్లు నాసిరకపు మెటీరియల్ తో కట్టేవని చెప్తున్నారు. అది నిజమేనా?” అని అడిగాడు ప్రెసిడెంట్ పక్కనున్న పెద్దాయన.

“లేదండి అది అంతా అబద్ధం” అని చెప్పాడు శ్రీను. “మరి ఆ గోడ ఎలా కూలిపోయింది” అని అడిగారు కాంట్రాక్టర్. “దానికి కారణం మీరే” అని శ్రీను చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యమయ్యారు. కొంచం తడబడుతూ ఆ కాంట్రాక్టర్ “నేను ఏం చేశాను. నా మీద నింద వేస్తున్నారు” అని అడిగాడు. నారాయణ రావు గారు రండి అని శ్రీను పిలిచాడు షాప్ అతన్ని.

నారాయణరావుని చూసి కాంట్రాక్టర్ షాక్ అయ్యి ఉన్నాడు. “ఈ కాంట్రాక్టర్ నా షాప్ కి వచ్చి నాసిరకపు మెటీరియల్ తీసుకొని వెళ్ళేవారు” అని చెప్పాడు నారాయణరావు. “ఒక కూలివాడు, తాపీ మేస్త్రిగా నుండి కాంట్రాక్టర్ గా ఎదగడం తప్ప,  ఇలాంటి వాళ్ళు ఉంటే మేము ఎదగడం ఎలా అండి. ఇలా మా మీద అసూయ పెంచుకుంటే మేము ఎలా బ్రతుకుతాము” అని కోపంగా అడిగాడు శీను.

“మమ్మల్ని క్షమించండి…  నా స్నేహితుడిని నమ్మి పని అప్పచెప్పాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు” అని చెప్పాడు ప్రెసిడెంట్.” ఒక తాపీ మేస్త్రి గా చేస్తున్న నేను కాంట్రాక్ట్ గా ఎదగడం చూసి ఓర్చుకోకపోతే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతాను” చెప్పాడు శీను. “అంత మాట అనకు శీను నీలాంటి నైపుణ్యం గల తాపీ మేస్త్రిని ఎలా వదులుకుంటాం” అని అన్నాడు రామయ్య.

ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళు కూడా రామయ్య మాటకి వస్తారు. ఇంకెప్పుడూ ఇలా జరగదు శ్రీను అని చెప్పాడు కాంట్రాక్టర్. ఇలా కాంట్రాక్టర్లే కాదు కూలీ చేసుకున్న వాళ్లు కూడా తాపీ మేస్త్రి చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్ళ మీద అసూయ పెంచుకొని నాకంటే ఎక్కువ ఎదిగిపోతారు అని అనుకొని వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించకుండా పగలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకోవాలి అనుకుంటారు.

– మాధవి కాళ్ల

పండితుడు పామరుడు వృత్తి Previous post పండితుడు / పామరుడు / వృత్తి
అమృత వల్లీ Next post అమృత వల్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close