తార

తార

పాలపుంత క్షేత్రంలో అది
కాంతులు విరజిమ్మే  ఒక తార
కనుచూపు మేరలో కబడని
అందమైన వీక్షణమే తార
అచ్చెరు వందే ఆకాశంలో
అద్భుతం  ఒక తార
నిశీధి ఆకాశంలో తలుక్కుమనే మెరుపు
ఒక తార
వెన్నలే చిలికే పున్నమిలో
దాగిన దావలి ఒక తార
అరుణారుణ  కాంతులతో
అందని ఒక అందం
ఒక తార
అందరికీ ఆదర్శమైన తార ఒకటి  అరుంధతి
తారలకు తార సితార.
– జి.జయ

Related Posts