సామాజిక మార్పుకై అక్షర జ్ఞాన ఋషీ……..!!
సామాజిక మార్పుకై అక్షర జ్ఞాన ఋషీ........!! పఠనాసక్తితో పుస్తకం పుటలు తెరుస్తూ.......రచనా వ్యాసంగంలో మునిగి పోయిన జీవితం......ఆర్థిక వెసులుబాటు లేని దైనందినంవెలిసిపోయిన బ్రతుకు సమాజం దృష్టిలో........ ఉద్గ్రంధాలు పఠిస్తూ జీవితం లోతుపాతులను తరచిచూస్తూ........జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే నేర్పరివి.........అజ్ఞాన అంధకారం రూపుమాపేందుకు సూచనలు చేసే సూత్రధారివి.........కష్టజీవుల ఆకలి కేకల విముక్తికై అక్షరీకరించే జ్ఞాని........చాయ్ చప్పరిస్తూ ఆకలి దిగమింగుకుని చదువే యావగా బ్రతుకు పోరాటంలో జ్ఞాన జిజ్ఞాసీ............డబ్బులు కూడబెట్టాలని,ఆస్తులు సంపాదించాలనే కోరిక లేని మానవతామూర్తి............. విలువల విజ్ఞానం, సామాజిక లొసుగులను ఎత్తిచూపే రచనా జిజ్ఞాసీ..........ఆకలి దప్పికలు మరచి సామాజిక మార్పుకోసం నిరంతరం రచనా శ్రమలుచేసే సూత్రధారివి..........ఉద్యమాలకు ఊపిర్లుపోస్తూ అవి సాఫల్య మయ్యేందుకు అక్షరాల సేద్యం చేసే ప్రజ్వలిత యాత్ర కొనసాగించే మానవత్వం చిరునామా నీవే కదా..........నీకు పెళ్ళి పిల్లలు ,సంసారం, సరియైన సంపాదన లేని అక్షరాల పొడుస్తున్న పొద్దువి......నీ జీవన ప్రస్థానం బహుదూరం, ప్రతినిత్యం పఠనంతో తొలిపోద్దే........నిరుపేదల కష్టాలను నీ…