అరుణోదయ రామారావు
అరుణోదయ రామారావు అరుణోదయ రామారావు (విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి) అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అతను వామపక్ష గీతాలను పాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అరుణోదయ సంస్థ పేరునే రామారావు తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. 40 ఏళ్లుగా వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించాడు. ప్రజా సమస్యలను పాటల రూపంలో జనాల్లోకి తీసుకెళ్లేవాడు. అరుణోదయ రామారావుగా సుపరిచితుడైన కళాకారుడు రామారావు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలోని దళిత కుటుంబంలో జూలై 1, 1955న జన్మించాడు. బియస్సీ వరకు విద్యాభ్యాసం చేసాడు. అతను ఐ.ఎఫ్.టిఉ.యు రాష్ట్ర నాయకురాలైన అరుణను వివాహమాడాడు. వారికి చైతన్య, రాహుల్ అనే కుమారులున్నారు. అతను అఖిల భారత సాంస్కృతిక కళాకారుల సంఘం కన్వీనర్‌గా, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా…