ఆమె ఆమె అంటేనే ఆడపిల్లఅమ్మ గర్బగుహ లోఉన్నప్పుడే ఆమె గుండెబద్దలైంది! ఆడపిల్లనా ?తీసేయ్ అన్న మాట విని! పెరుగుతూ ఉంటే ఇంకోసారి బద్దలైంది! ఆడపిల్లదాని కెందుకు?అన్న మాటవిని! మరోసారి మళ్లీ బద్దలైంది! ప్రియుడి మెాసానికి! పెళ్లై అత్తారింటికి వెళ్లాకఅక్కడైనా బాగుంటుందనిఆశ పడితే అక్కడా నిరాశే!మిషను లాంటి జీవితం అనుభవించి పిల్లలతో నైనా !బాగుంటుందని ఆశ! కానీ మళ్లీ అదే తంతు గుండెబద్దలే! కట్టె కాలే వరకూ ఇంతేఆడపిల్ల జీవితం! ఎన్ని సార్లుబద్దలవుతూ బ్రతకాలి?పుట్టి గిట్టే వరకూ అంతేనా! ఉమాదేవి ఎర్రం