కనుమరుగవుతున్న బంధాలు
కనుమరుగవుతున్న బంధాలు శృతి అయ్యగారింటికి చేరి పద్దెనిమిది సంవత్సరాలయింది…అందరూ తనని అయ్యగారింటి అమ్మాయి అంటారు.. ఒకరోజు అయ్యగారు వేణు శర్మ గుడిలో పూజ ముగించిఇంటికి వస్తుంటె రోడ్డు పక్కన పిల్ల ఏడుపు వినిపించిందిబండి ఆపి ఎవరా అని చూస్తె అప్పుడే పుట్టిన పసికందుఅయ్యెా!!అయ్యెా!!!ఎంతపచారం???ఏ వెధవలు ఇలా చేసారో!ఏమిటో!!అని చుట్టుపక్కలంతా చూసాడు..ఎవరూ లేరు…ఏం చేయాలో అర్థం కాలేదా పూజారికి….అపచారం అపచారం ఎలా ముట్టుకోవడం???అంతారక్తమయం అసలే మడి…కాని పసిపాప చూస్తూ ఊరుకోలేనే!!!ఎలాగోలా తన పై పంచ తీసి పసికందుకు చుట్టి ఇంటికితీసుకొచ్చాడు…..వస్తూనె తులసీ ఇలా రావే??అని ఇంట్లోకి కేకేసాడు…తులసి ఏమిటండీ అని పరుగున వచ్చింది…అయ్యగారి చేతిలో ఉన్న బిడ్డను చూడగానె..ఎవరండి?? ఈ పసిపాప??అంది.తెలియదే రోడ్డుపక్కన దొరికింది. అన్నాడు…అయ్యెా!!రోడ్డుపక్క దరిద్రాన్ని మనింటికి తెచ్చారేమిటండి???వాల్లవాల్లెవరో తెలుసుకోక పోయారా???అక్కడెవరూ లేరే!!పిలిచాను అరిచాను కూడ….అలా వదిలేసి రాబుద్ది కాలేదే!!!పాపం కళ్లుకూడ తెరవనిపసిగుడ్డు చూస్తూ చూస్తూ వదిలేయలేను కదా!!కాస్త శుభ్రం చేసి పాలుపట్టవే!!!హ….మీది మరీ చోద్యం ఈ వయసులో నాకేమిటండిఈ తిప్పలు…