నేల తల్లి

నేల తల్లి

నేల తల్లి

నేల తల్లి నేల తల్లినై మానవులకుఆహారం ఇస్తున్నా!రక రకాల రుచులతో కనీవినీ ఎరుగని పండ్లు, ఫలాలనుఇస్తున్నా!సస్య శ్యామలమైన పంటపొలాలలతో వరి ధాన్యం అందిస్తున్నా!పచ్చని ఆకు కూరలు, కూరగాయలునిత్యం నా నుండే తీసుకుంటారు!స్వఛ్చమైన తీయని నీటిని కూడాఇస్తున్నా!కమ్మటి రుచికరమైన అన్నం తింటూతియ్యని నీటిని తాగుతూ…లొట్టలు వేసుకుంటూ…చల్లని తల్లినైన నన్ను బాధిస్తున్నారుఈ కృతజ్ఞత లేని మానవులు!వెన్నుపోటు పొడుస్తున్నారు!ఎన్నో బాధలకు నేనోర్చుకుని వారికిఅన్నీ అందిస్తుంటే నాకిచ్చే ఫలం ఇదా?అని నేల తల్లి ఏడుస్తుంది! ఉమాదేవి ఎర్రం
Read More