మాధవి కాళ్ల

శొంఠి శ్రీనివాసమూర్తి

శొంఠి శ్రీనివాసమూర్తి

శొంఠి శ్రీనివాసమూర్తి శొంఠి శ్రీనివాసమూర్తి (జ. 1914, ఆగస్టు 8 - 1979) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి.శొంఠి శ్రీనివాసమూర్తి 1914, ఆగస్టు 8న శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జన్మించాడు. తల్లి వెంకమాంబ, తండ్రి గుండప్ప.శ్రీనివాసమూర్తి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణ పొంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1964లో పదవీ విరమణ పొందాడు.శ్రీనివాసమూర్తి కి బాల్యం నుండే భారత, భాగవత, రామాయణ పద్య కావ్యాలను చదవడంలో ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనే ఇతడు పద్యాలు రాయడం ప్రారంభించాడు. శ్రీశైల యాత్ర, శతక రచనశ్రీనివాసమూర్తి అనుకోకుండా శ్రీశైలం వెళ్లడం జరిగింది. అక్కడ ముఖ్యమైన క్షేత్రాలను, తీర్థాలను సందర్శించి, శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునులను దర్శించాడు. అప్పుడే అతనికి "శ్రీశైల మల్లేశ్వరా" అనే మకుటంతో ఒక శతకం రాయాలనే సంకల్పం కలిగింది. కొన్ని రోజులలోనే శతకాన్ని పూర్తి చేసి, భక్తుల ఆర్థిక సహాయంతో దానిని ముద్రించాడు. శ్రీనివాసమూర్తి కుమారుడు…
Read More
ఆ!!వె!!💐 పొడుపు కథ

ఆ!!వె!!💐 పొడుపు కథ

ఆ!!వె!!💐 పొడుపు కథ వరముకాని వరము వనిత మెచ్చు వరముజడన నొప్పి నదియు పొడవుబెంచుమూడు పాయలుండు ముదిత కొప్పున జేరుదీనిభావమేమి తెలుపుకృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
లిఖిత జీవితం

లిఖిత జీవితం

లిఖిత జీవితం లిఖిత , కిషోర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూనే ఉన్నాయి? అప్పుడే ఆ ఊరికి కొత్తగా ఒక స్వామీజీ వచ్చారని తెలిసింది లిఖితకి పక్కింటి పద్మ ద్వారా."ఏంటో అక్క! ఇంట్లో అసలు మనశ్శాంతియే లేదు?" అని బాధగా చెప్తూ ఉంటే…"అయ్యో లిఖిత! నీకు విషయం తెలియదా! మన ఊరికి కొత్త స్వామీజీ వచ్చారు. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని. ఒకసారి నేను వెళ్తే నాకు మా ఆయనకి గొడవలు కూడా తగ్గిపోయాయి" అని చెప్పగానే…"సరే అక్క! మనం రేపు వెళ్దాం" అని చెప్పింది లిఖిత.ఉదయమే లేచి భర్తను ఆఫీస్ కి పంపించి , అత్తగారు గుడికి వెళ్ళగానే…"పద్మక్క! నేను రెడీ వెళ్దామా..!" అని అడిగింది లిఖిత."సరే వెళ్దాం! పద…" అని చెప్పి ఇద్దరూ ఊరి చివర ఉన్న ఆశ్రమానికి వెళ్లారు.అక్కడికి వెళ్ళగానే రెండు రోజుల్లోనే తన భర్తలో మార్పు…
Read More
మనిషి మనిషికి తోడు

మనిషి మనిషికి తోడు

మనిషి మనిషికి తోడు అంతస్తులు అనగా మనకు ఎత్తైన భవనాలు గుర్తుకు వస్తాయి. కానీ నిజమైన అంతస్తులు కేవలం భవనాలకే కాదు, సమాజంలోని ఆర్థిక, సామాజిక స్థితిగతులకూ ఉంటాయి. ఈ చిత్రం అలాంటి రెండు ప్రపంచాలను ఒకే చోట చూపిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒకవైపు ఖరీదైన కారులో సౌకర్యాల మధ్య నవ్వుతూ ఆడుకుంటున్న చిన్నారి కనిపిస్తోంది. మరోవైపు చిరిగిన బట్టలతో, అలసిన ముఖంతో తన బిడ్డను ఒడిలో మోసుకుంటూ జీవన పోరాటం చేస్తున్న ఒక తండ్రి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో చిన్న పాలపొడి ప్యాకెట్ మాత్రమే ఉంది.తన బిడ్డకు ఆకలి తీర్చాలనే తపన అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో కారులోని చిన్నారి చేతిలో బొమ్మలు, చిరుతిండి, సౌకర్యాలు ఉన్నాయి. ఈ దృశ్యం సమాజంలోని అంతస్తుల మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసాన్ని మన ముందుంచుతుంది. ధనం మనిషికి సౌకర్యాలను కొనివ్వగలదు. కానీ మానవత్వాన్ని కొనలేదు. పేదరికం ఒక…
Read More
స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని

స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని

స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని నేను బానిసనీ కానునా శ్వాసకు నేనే అధిపతినినా అడుగులకు నేనే దిక్సూచినినా ఆశయాలకు నేనే వెలుగునిభయాల గొలుసులు నన్ను బంధించలేవు బెదిరింపుల సంకెళ్లు నన్ను ఆపలేవుతలవంచి బ్రతకడం నా తత్వం కాదుతలెత్తి నిలవడమే నా జీవన గీతంఆత్మగౌరవమే నా అసలైన ఆభరణంఆత్మవిశ్వాసమే నా ఆయుధం నన్ను అణచే ప్రతి అడుగుకూనా ధైర్యమే సమాధానంవెలుగు కోసం చీకటిని దాటుతానువిజయం కోసం శ్రమను ఆలింగనం చేసుకుంటానుఅవమానాల అగ్నిలో కాలినా అనుభవంగా మారి మళ్లీ లేస్తానుబలవంతుడి బూటు కింద నలిగేది శరీరమేనా సంకల్పం మాత్రం కాదుబానిసత్వం ఒప్పుకునే మనసు నాలో లేదుస్వేచ్ఛే నా శాశ్వత శ్వాస నిజం కోసం నిలబడతానున్యాయం కోసం నడుస్తానునా మాటకు నేనే సాక్షినినా విలువకు నేనే ప్రమాణంఒక్క అడుగు వెనుకడుగు వేయను ఒక్క క్షణం ఆత్మను అమ్ముకోనుఎన్ని తుఫాన్లు ఎదురైనాఎన్ని అడ్డంకులు నిలిచినానేను విరిగిపోను వంగిపోనుఎందుకంటే నేను బానిసనీ కాను స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని… మాధవి కాళ్ల
Read More
నిజమైన సంపద

నిజమైన సంపద

నిజమైన సంపద ఉదయం సూర్యుడు తన బంగారు కిరణాలతో... ప్రకృతిని పలకరిస్తుండగా, ఐదుగురు స్నేహితులు , అనూ, దీప్తి, సాయి, మధు, రాహుల్. ప్రతి సంవత్సరం లాగే స్నేహితుల దినోత్సవాన్ని కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఒక అందమైన ప్రకృతి ప్రాంతానికి వెళ్లారు. పచ్చని పొలాలు, నీలిరంగు సరస్సు, పక్షుల కిలకిలరావాలు వారి మనసులను ఆనందంతో నింపాయి.నడుస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు.మధ్యలో ఒక వంతెన దగ్గర చిన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. అతని కాలు జారి గాయమైంది. స్నేహితులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనికి ప్రథమ చికిత్స చేశారు.తమ దగ్గర ఉన్న నీరు, ఆహారం ఇచ్చి ధైర్యం చెప్పారు. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి క్షేమంగా అప్పగించారు.ఆ సంఘటన తర్వాత అనూ ,"స్నేహం అంటే కేవలం కలిసి నవ్వుకోవడం కాదు. అవసరంలో ఒకరికి ఒకరు అండగా నిలబడటమే నిజమైన స్నేహం" అని చెప్పింది.అందరూ ఆమె మాటకు…
Read More
చెరగని సంతకం

చెరగని సంతకం

చెరగని సంతకం అమ్మ పరిచయం చేయని అనుబంధం స్నేహంనాన్న నేర్పించని అందమైన పాఠం స్నేహంరక్త సంబంధం లేకున్నా ప్రాణంగా నిలిచే బంధంకష్ట సుఖాలలో సగపాలు పంచుకునే ఆనందంజన్మజన్మలకు చెరిగిపోని మధురమైన కావ్యమీ స్నేహం పలక బలపంతో మొదలైన మన బాల్యపు తీపి గురుతులుకలసి ఆడుకున్న ఆటలు, పంచుకున్న చిరుతిళ్ళుఅల్లరి పనులకు ఒకరికొకరు తోడుగా నిలిచిన క్షణాలుకోపాలు వచ్చినా క్షణంలో మాయమయ్యే అలకలుకాలం మారినా కరిగిపోని పచ్చటి జ్ఞాపకాలు మనసులోని మాటను మౌనంగానే చదివేసే నేస్తంకన్నీరు జారితే కన్నతల్లిలా తుడిచేసే హస్తంగెలుపులో చప్పట్లు కొడుతూ వెన్నుతట్టే ధైర్యంఓటమిలో నీడలా నిలబడి భరోసానిచ్చే సైన్యంనిజమైన స్నేహితుడుంటే ప్రతి అడుగు ఒక విజయం దూరం మన దేహాలను వేరు చేసినాబ్రతుకు పోరాటం ఉరుకులు పరుగులు పెట్టినామనసుల మధ్య ఉన్న ఆత్మీయత దూరం కాదుగాగుండెలో దాచుకున్న ప్రేమ ఎన్నటికీ తరగదుగాచిరునవ్వుల చిరునామాగా మన మైత్రి నిలిచిపోనుగా తప్పు చేస్తే నిలదీసే హక్కు ఉన్న ఒకేఒక్కడునిజం చెప్పే ధైర్యం…
Read More
మత్తు పదార్ధాలు

మత్తు పదార్ధాలు

మత్తు పదార్ధాలు గంజాయి మొక్క అనేది ఔషధ, పారిశ్రామిక మరియు మత్తు పదార్థాల తయారీలో ఉపయోగించే ఒక మొక్క. దీని ఆకులు, పువ్వులు, రెసిన్‌లో ఉండే కొన్ని రసాయన పదార్థాలు మానవ మెదడుపై ప్రభావం చూపుతాయి. అందులో ముఖ్యమైనది టెట్రాహైడ్రోకానాబినాల్. ఈ పదార్థం మత్తును కలిగిస్తుంది. ప్రాచీన కాలం నుంచే గంజాయిని కొన్ని వైద్య అవసరాలకు ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా కొన్ని దేశాల్లో వైద్యుల పర్యవేక్షణలో దీర్ఘకాలిక నొప్పి, కీమోథెరపీ వల్ల కలిగే వాంతులు, కొన్ని నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో పరిమితంగా వినియోగిస్తున్నారు. అయితే దీనిని వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే, చట్టబద్ధంగా మరియు వైద్యుల సూచనల మేరకు ఉపయోగించాలి. మరోవైపు, గంజాయిని మత్తు కోసం దుర్వినియోగం చేయడం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తరచుగా వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చదువు లేదా ఉద్యోగంపై ప్రభావం పడటం, మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే…
Read More
ఆశ మొలకెత్తుతుంది…

ఆశ మొలకెత్తుతుంది…

ఆశ మొలకెత్తుతుంది… నరికిన అడవుల నొప్పితో నేల నిట్టూర్చుతోంది…కాలుష్యపు మేఘాలతో ఆకాశం కన్నీరు కారుస్తోంది…పచ్చని చీర చినిగిపోయి భూమాత విలవిలలాడుతోంది…స్వార్థపు అడుగులతో ప్రకృతి గుండె పగులుతోంది…నదుల నుదుటిపై విషపు ముద్రలు మిగిలాయి… గాలి గుండెలో పొగల గాయాలు పేరుకున్నాయి…పక్షుల పాటలు నిశ్శబ్దంలో కలిసిపోయాయి…చెట్ల నీడలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి…ఎండల ఎర్రజ్వాలలు జీవాన్ని దహిస్తున్నాయి…వానలు దారి తప్పి భూమిని మరచిపోయాయి… మంచు కొండలు కన్నీటి బిందువులై కరుగుతున్నాయి…సముద్రాలు ఆవేదనతో ఒడ్డులు దాటుతున్నాయి…పుట్టిన ప్రతి ప్రాణికి తల్లినే ఈ భూమి…తల్లినే గాయపరచడం ఎంతటి క్రూరత్వం…లోభం కోసం ప్రకృతిని లూటీ చేస్తున్నాం… భవిష్యత్తు తరాలకు శూన్యాన్ని మిగులుస్తున్నాం…ఒక మొక్క నాటితే ఆశ మొలకెత్తుతుంది…ఒక చెట్టు పెరిగితే జీవం పరిమళిస్తుంది…నీటి ప్రతి చుక్కను ప్రాణంలా కాపాడుదాం…పచ్చని అడవులను ప్రేమతో పెంచుదాం… కాలుష్యానికి కళ్లెం వేయాలని సంకల్పిద్దాం…ప్రకృతితో స్నేహమే నిజమైన సంపదని గ్రహిద్దాం…భూమాత నవ్వే రోజే మన పండుగ కావాలి…పచ్చదనం పరిమళమే మన అలంకారం కావాలి…ప్రతి హృదయం ప్రకృతి గీతం…
Read More
బూతు మాటలు

బూతు మాటలు

బూతు మాటలు లలిత , సురేష్ భార్య భర్తలు ఒక ఫంక్షన్ కి ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ లలిత , సురేష్ జంట చూసి , "ఆహా! ఎంతగా అన్యోన్యంగా ఉన్నారే? లలిత కి ఏం కావాలన్నా తెచ్చి పెడతాడంట? ఎంత మంచి వాడో సురేష్?" అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న లలిత ,ఒక క్షణం గతంలోకి వెళ్లిపోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి వాళ్లది. అయినా ఆనందంగా ఉంటుందని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది లలిత. అత్త మామ ఊర్లో ఉంటారు.సురేష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. సురేష్ చదువుకున్నవాడే మంచివాడే. కానీ , కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం సైకోగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ ప్రవర్తన చూసి పాపము లలిత మొదటిసారి భయపడింది.తర్వాత మార్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ , ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఒకసారి లలిత ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కి ఫీజు కట్టమని అడిగింది…
Read More