మౌనంలో ప్రేమ

మౌనంలో ప్రేమ

మౌనంలో ప్రేమ

మౌనంలో ప్రేమ నా ప్రాణానికి ప్రాణమైన నీకు… నువ్వు నిప్పువైతే… నేను మంచును. మనమిద్దరం కలిస్తే ఒకరు కరిగిపోవాలని లేదా ఒకరు ఆరిపోవాలని లోకం అంటుంది. కానీ, ఆ నిప్పులోనూ ఒక వెచ్చని తోడుని, ఈ మంచులోనూ ఒక స్వచ్ఛమైన ప్రేమని మనం వెతుక్కున్నాం. కానీ కాలం మన వేళ్లను విడదీస్తోంది. నీ చేయి నా చేయిని వీడుతున్న ఆ క్షణం. నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తోంది.నీ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇంకా నా వేలిపై మెరుస్తున్న ఆ ఉంగరంలాగే నా మనసులో నిలిచిపోయింది. విడివడి వెళ్తున్నావు కానీ, నీ జ్ఞాపకాల లిపి నా గుండె గోడల మీద పచ్చబొట్టులా ఉంది.నీ వాలు చూపులు నాపై పడినప్పుడు వికసించిన విరులు , నేడు కన్నీటి ధారలతో తడిసిపోతున్నాయి.కాలంతో వడిగా పరుగెత్తుతూ నిన్ను నా నుండి దూరం చేస్తున్నా, నీపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ వాడిపోని పరువంలా నిలిచి ఉంటుంది. నువ్వు…
Read More