సరిహద్దు నీడల్లో సేవ
సరిహద్దు నీడల్లో సేవ ఉదయం పొద్దుపొడవక ముందే అడవి అంచుల్లో నిశ్శబ్దం పరుచుకుంది. గాలిలో ఆకుల చప్పుడు తప్ప మరేమీ వినిపించలేదు? ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ కొందరు భద్రతా సిబ్బంది తమ విధుల్లో భాగంగా ముందుకు సాగుతున్నారు. వారి కళ్లలో అప్రమత్తత, మనసులో దేశం పట్ల బాధ్యత కనిపిస్తోంది.ఆ బృందానికి నాయకుడు అర్జున్. అతను తన సహచరులతో కలిసి ఎన్నో రోజులుగా ఆ ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తున్నాడు."మన పని కాపలా కాదు! ప్రజల ప్రశాంత నిద్రకు భరోసా ఇవ్వడం" అని అతను తరచూ చెప్పేవాడు.ఆ రోజు అడవి దారిలో వెళ్తుండగా… దూరంగా ఒక చిన్న బాలుడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అర్జున్ అతని దగ్గరకు వెళ్లి ,"ఏమైంది బాబు? ఎందుకు ఒంటరిగా ఉన్నావు?" అని మృదువుగా అడిగాడు.బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ,"నేను మా ఊరినుంచి దారి తప్పిపోయాను అన్నయ్య..!" అన్నాడు.వెంటనే సిబ్బంది బాలుడికి నీళ్లు…