aadapilla aksharalipi

ఆడపిల్ల

ఆడపిల్ల ఆడపిల్ల అంటే అడవిలో మాను కాదు ఆడపిల్ల అంటే అద్వితీయమైన శక్తి అన్నారు ఆడపిల్ల అంటే అపురూపం ఆడపిల్ల ఉంటే అదృష్టం ఆడపిల్ల అంటే అందం ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి ఆడపిల్ల ఉంటే ప్రేమాభిమానాలపెన్నిధి మమతల నిండిన మనసు ఇవన్నీ ఇంటి వరకు సహజమే కానీ....? మారుతున్న సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో చిట్టి తల్లులకు చిన్నచూపే ఆంక్షలు అంతరాలు సమానత్వం లేని స్వేచ్ఛ ఎన్నో ఎదురు సవాళ్లు అవరోధాల మార్గం కరువైన రక్షణ అర్థం లేని అపోహలు అన్నీ కలిపి ప్రశ్నార్ధకమవుతున్న ఆడపిల్లల జీవితం నేటి సమాజపు మార్పునకనుగుణంగా ఆడపిల్లలను తీర్చిదిద్దాలి అది అందరి బాధ్యత అసమానతలకు తావు లేకుండా బాలికలకు భరోసానిచ్చి సమానత్వపు సౌధాన్ని ఎక్కించాలి బేటి బచావో బేటి పడావో అనే నినాదం సమిష్టికృషితో సాధ్యం మరి.... - జి జయ
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల.. ఆడపిల్లే అంటే ఇంకో ఇంటి పిల్లే... పుట్టింట్లో అందరితో సరదాగ ఉండే ఆడపిల్ల... రేపు అత్తింట్లో బాధ్యతలతో భారం మోసే తల్లి.. ఈ ఆడపిల్లని అందరూ ఆడపిల్ల లాగా కాకుండా ఆటబొమ్మలా చూస్తున్నారు.. ఈ ఆడపిల్లే ఇంకో జీవికి ఊపిరి పోసేది.. ఆడపిల్ల లేని ఇల్లు అమ్మలేని ఇల్లు లాంటిది.. ఆడపిల్లని గౌరవిద్దాం.. రక్షిద్దాం... కాపాడుకుందాం.. ప్రతిఒక్కరూ ఆడపిల్లని ప్రేమించాలి ఒక తల్లిగా, చెల్లిగా.. అని భావిస్తున్నాం.. - వనీత రెడ్డి
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల నీ ప్రాణం కి విలువ ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల కి నువ్వు విలువ ఇవ్వకపోతే ప్రాణం లేని దేహం నీది నీకు విలువ లేదు గౌరవించు, అభిమానించు, ప్రేమించు, అర్దించు, కాపాడు నీ జీవితానికి అర్ధం ఆడపిల్ల అని గుర్తించు - సూర్యాక్షరాలు  
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల నీ ఒడిలో చేరే ఆడపిల్ల నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల నీ మరణం కోసం మరణశాసనం రాసే ప్రతి మహిళ.. - సూర్యక్షరాలు
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా అనుకున్న వాళ్లు, కుటుంబీకులే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇక ఆ అమ్మాయి తన గోడు ఎవరితో చెప్పుకుంటుంది? పొరపాటున నోరు జారినా తనదే తప్పంటారేమోనన్న భయం! అందుకే ఏళ్ల పాటు ఈ బాధను, మౌనాన్ని తన మనసులోనే దాచుకుందో అమ్మాయి. ఆఖరికి బయటపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేసింది.. తనలా మరే అమ్మాయీ బలికాకూడదని నిర్ణయించుకుంది. అందుకే ప్రస్తుతం లైంగిక హింసపై తనదైన రీతిలో పోరాటం చేస్తోంది. మరోవైపు బాల్యంలో తనకెదురైన చేదు సంఘటనల్ని ఉదహరిస్తూ.. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్లో అప్రమత్తతను పెంచుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తెలుసుకుందాం రండి..! నా పేరు కార్తీక. పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే! అమ్మ, నాన్న, నేను.. హాయిగా,…
Read More