aksahralipi

నేలవిడిచి సాము

నేలవిడిచి సాము ఆశ సహజం అత్యాశ అసహజం. అందని దానికై అర్రులు చాచుటెందుకు బోర్లపడుటెందుకు. నక్క అందని ద్రాక్ష పండ్లకై ఎగిరి ఎగిరి అందక పులుపు అనుకొన్న చందమున నేలవిడిచి సాము చేయు టెందుకు ఉన్నదానితో తృప్తి పడక పొట్టకూటికై తాడుమీద నేలవిడిచి కర్రపట్టుకు సాము చేయువారితో పోల్చుకొను టెందుకు. - రమణ బొమ్మకంటి
Read More

చిగురాశ…

చిగురాశ... "ఒకరోజు".. పొద్దున్న లేవగానే.... నీకు ఫోన్ చేయను, మెసేజ్ చేయను... ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఏం జరిగింది అనేది కూడా చెప్పను... ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను. అనేది కూడా చెప్పను... ఎందుకో తెలుసా ఆరోజు... పొద్దున్న లేవగానే నువ్వు నా పక్కన ఉంటావని.... ఆరోజు మొత్తం నువ్వు నాతోనే ఉంటావని... ఎన్నో మైళ్ళ దూరాన్ని... నువ్వు చెరిపేసి.. నాతోనే ఉంటావు అని... నా ప్రతి కదలికలో నాకు తోడుగా నిలుస్తావని... ఆరోజు నుండి నా ప్రయాణం నీతోనే మొదలు అని.... చిగురించేను నాలో ఒక చిన్న ఆశ - మేఘమాల
Read More