aksharaipi story

ఈరోజు అంశం:- నీతి

ఈరోజు అంశం:- నీతి ఈరోజుల్లో నీతి అనే మాట ఎక్కడా వినిపించడం కనిపించడం లేదు. నీతిగా ఎవరూ బతకడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతున్నది. నీతి గా ఒక్కరూ లేరు. నీతి అనేది మన జీవితాలలో భార్య భర్తల దగ్గర లేదు, తండ్రి కొడుకుల మధ్య లేదు ప్రేమికుల మధ్య లేదు, తల్లి కుతుర్ల దగ్గర లేదు. ఇలా ఎక్కడ అయినా ఏ బంధంలో అయినా నీతి అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇక పోతే ఉద్యోగుల్లో, రాజకీయ నాయకులలో నీతి అనేది అసలు కనిపించదు. అందరూ అవినీతి పరులేనా అంటే అందరూ కాదు. కొందరు ఉండడం వల్ల అందరికీ పేరు వస్తుంది. అయితే అసలు నీతి అంటే ఏమిటి? నీతిగా ఎలా బతకాలి అనేది మీరు మీ రచన కథ, లేదా కవిత రూపంలో రాయండి. మీ అభిప్రాయం తెలుపండి. 
Read More

ఈరోజు అంశం:- సంతృప్తి

ఈరోజు అంశం:- సంతృప్తి మనిషి సంతృప్తి గా ఎప్పుడు ఉంటాడు? అసలు మనిషికి సంతృప్తి అనేది ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చదువులో పక్కవాడి లాగా బాగా చదవాలి అని ఉంటుంది. అయ్యో వాడికి సీట్ వచ్చింది నాకు రాలేదు అనే బాధ ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో లక్ష రూపాయలు జీతం ఉన్నా ఇంకా కావాలనే అసంతృప్తి ఉంటుంది. పెళ్లిలో ఇంకా ఎక్కువ కట్నం వస్తే బాగుండు అనే బాధ ఉంటుంది. పిల్లల విషయంలో అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టలేదని అసంతృప్తి ఉంటుంది. వారి చదువుల విషయం లో ఇతరులతో పోల్చడం ఒక అసంతృప్తి గా ఉంటుంది. ఇల్లు విషయం లో సొంత ఇల్లు లేదనే సంతృప్తి, ముసలి వయసులో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో ఇతరులతో పోల్చుకుంటూ సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి మీరు కూడా అలాంటి జీవితాన్ని…
Read More

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద

ఈరోజు అంశం:- అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడు అమ్మ చేతి ముద్దను తినేవాళ్ళం. ఆ తర్వాత కూడా బడికో కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నప్పుడు అమ్మ మన హడావుడి చూసి అన్నం కలిపి ముద్దలుగా తినిపించేది. అమ్మ ఏం చేసినా ఎంతో బాగుండేది. అమ్మ చేతిలో ఏదో మాయ ఉండేది. అమ్మ అలా ఎంత పెట్టినా కూడా తింటూనే ఉండేవాళ్ళం. అది అమ్మ చేతి ముద్ద గొప్పతనం. అమ్మ అన్నం పెడుతూ ఎన్నెన్నో కథలు, కబుర్లు చెప్పేది. బూచాడు వస్తాడని భయపెట్టినా, ఇంకెన్ని కథలు చెప్పినా అదంతా కేవలం బిడ్డ కడుపు నింపడం కోసమే చేసేది. బొజ్జ నిండిన తర్వాత చివరి ముద్దను మన చుట్టూ తిప్పి బయట పారేసేది. దిష్టి కొట్టకుండా.. ఎవరన్నా మీ బాబు, పాప ముద్దుగా ఉన్నారని అంటే వాళ్ళు వెళ్ళాక బాగా తిట్టుకునేది.. అమ్మ చేతి ముద్ద అమృతం. అమ్మ చిరునవ్వు ఒక శక్తిని ఇస్తుంది. ఎంతో…
Read More

Oka Roju

ఒక రోజు కొత్తగా పెళ్ళయిన జంట మధురిమ , కార్తీక్ లు. కార్తీక్ అందరిలానే సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మధురిమ తన తోటి అమ్మాయిలతో  కుస్తీ పడి మరీ  బీ.టెక్  పూర్తి చేసి అమోఘమయిన మార్కులు తెచ్చుకుని ఒక సంవత్సరం జాబ్ చేసి వెంటనే ఇంట్లో వాళ్ళ ప్రార్థన మేరకు పెళ్లి చేసుకున్న సగటు తెలుగింటి ఆడపడుచు అని చెప్పొచ్చు. కార్తీక్ ది  అందరూ ఎటు పోతే మనం  అటు పోవాలి అనుకునే మనస్తత్వం. మధురిమ మాత్రం అలా కాదు. అందరితో పాటే తను అన్నట్టు పైకి కనిపిస్తుంది కానీ, లోపల తన ప్రపంచమే వేరు. వీరు ఇద్దరు ఇంత విరుద్ధమయిన మనస్తత్వం గల  వాళ్ళు కాబట్టే దేవుడు వీళ్ళని జత చేసాడేమో అనిపిస్తుంది. జాబ్ రీత్యా కార్తీక్ కి కలకత్తా కి ట్రాన్స్ ఫర్ అవ్వటంతో మధురిమని తీసుకుని తన ఆఫీసు కి…
Read More