మొగ్గని ప్రేమ ఓ, మొగ్గా.......! మొగ్గ వు కదే నీవు ఆ వరకు నీ పంతం నెగ్గ! తగ్గ శీలమే నీది, ఔననుటకు నాకు సిగ్గా! బుగ్గ మాటున ఉంచితివి, పూరేకుల అందాలను విచ్చుకుంటివే చివరకు భానుడు నీకు తల ఒగ్గ. ఇప్పుడు రాజ్యాలేలే నమస్కారము నీవు నేర్పినదే నే ఆ సంస్కారము! మేము నడిమంత్రాన నేర్చినది....... నీకు అబ్బెను కదనే జన్మతః. నా చెలి వై రావే....... నీ లక్షణాలు లక్షల విలువే. నా దరికి చేర్చవే నీ వారసత్వాన్ని! నమస్కారము నీకు... నేను తగ్గను, ఒగ్గను అప్పటిదాకా. రాయి ని నేను, రవి ని కాను. -వాసు
దేవుడు ఆది మానవుడు నుంచి నేటి నవ మానవుడి వరకూ ఆకలి తోడుగానే వుంది. ఆకలి వల్లే వేట మొదలుపెట్టాడు. బాట కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టాడు. నీడ కోరుకున్నాడు. ఆకలి పేదోడి ఇంట అనాధ. పెద్దోళ్ళ ఇంట రాజు. ఆకలి లేని మనిషి అభివృద్ధి చెందలేడు. ఆకలి విలువ తెలియనివాడు మనిషి విలువ అసలే తెలుసుకోలేడు. ఆకలి కొందరికి ఆత్మబంధువు. ఎన్నో జీవిత పాఠాలు నేర్పించే గురువు. దయాహృదయాలను కలిచి వేసేది ఆకలితో అలమటించే జీవితాలు. ఆకలి అనుభవం మనిషిగా లేకపోయినా, మనసున్న మనుషులకు ఎదుటవారి ఆకలిని తెలుసుకుంటారు. ఒకరి ఆకలి తీర్చిన వాడే దేవుడు. - రాధికా. బడేటి
ఆకలి మధ్యతరగతి వారికి గౌరవం... దిగువ మధ్యతరగతి వారికి పేదరికం... మనిషికి విలువను నేర్పించే గొప్ప ఆయుధం... మనిషి తిరుగుబాటును సూచించే సంకేతం... వ్యయప్రయాసాల మధ్య సామాన్యుని జీవనం... అల్లరిమూకల సమూహంలో యువతి రక్షణ... మనిషిని మనిషిగా గుర్తించేది... మనిషిని సమూహానికి దగ్గర చేసేది మరియు దూరంగా విసిరేసేది... మనిషి మరో మెట్టుకీ దిగజార్చేది... మనిషిని మరో మెట్టు ఎక్కించేది... - గోగుల నారాయణ
అర్ధరాత్రి సుడులు తిరుగుతుంది.. మనసు.. సహకారం అందించే చేతులకోసం.. సమయం చిక్కక అందుకునేందుకు.. నేను లేని నా అనే వాడి జాడతో.. ఓ చేయూతకై చేస్తుంది సమరం, సర్వ ప్రయత్నాలకూ తీసుకుపోతూ.. యుద్ధభూమిగా ఆ క్షేత్రం.. అర్థం చెప్పే రాత్రి తానుగా ఏదో కథ చెప్పడం విశేషం..!! - భాను శ్రీమేఘన
తల్లి కన్నతల్లిని వున్న ఊరిని మరచినవాడు మరుజన్మలో రాక్షసుడిగా పుడతారు అని పెద్దల మాట. బ్రతుకును ఇచ్చేది కన్నతల్లి. సుందర రూపం అని భావించేది కన్నతల్లి. తొలిపలుకు పలికించేది, తొలి అడుగు నడిపించేది కరుణ నిండుగ నింపేది కమ్మని మాటల మూటలు చెప్పేది. అంతరంగాల అక్షరాలు నీతిని క్యాతిని తెలిపేది కన్నతల్లి. తరగని ఆస్తులైన వదలని భారమైన సమతూకంలో తూచేది కన్నతల్లి. కాలం మారినా కారణం ఏదైనా నీ కోసమై దిగివచ్చిన దేవత కన్నతల్లి. - జి.జయ
స్నేహం స్నేహమనేది ఓ మధురభావన... స్నేహానికి అవధులు ఉండవు... లింగ బేధాలు అసలే ఉండవు... వెలకట్టలేని బంధం స్నేహం... సృష్టిలో స్వచ్ఛమైనది... భావనల పరంపరకీ ఓ నిధి వంటిది... దేవుడు సృష్టించిన గొప్ప బంధాల్లో స్నేహం ఒకటి... స్నేహం అనిర్వచనీయమైనది... నమ్మిన వ్యక్తికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే గొప్ప బంధం స్నేహం... ఓ వ్యక్తి స్నేహం దొరకడం ఓ గొప్ప వరంలాంటిది... అనుభవిస్తేగానీ తెలియదు స్నేహం యొక్క విలువ... నమ్మకానికి స్నేహం అమ్మవంటిది... ౼ గోగుల నారాయణ