అప్పడం కథ
అప్పడం కథ పూర్వకాలం లో ఒకానొక పల్లెలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అయితే ఆ కుటుంబ యజమాని కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇంతలో కాలాలు మారుతుండడం వల్ల వర్షాకాలం వచ్చింది. వచ్చింది వర్షాకాలం కాబట్టి కట్టెలు అన్ని పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆ పేదవాడు కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు కాదు. కాని జీవనం గడవాలి కాబట్టి ఊర్లో ఎదో ఒక పని చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అయితే వర్షం లో తడవడం వల్ల ఆ పేదవాడికి పడిశం పట్టుకుంది. దాంతో పనికి వెళ్ళలేక పోయాడు. ఆ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉన్న వాటి తో తన ఇద్దరు పిల్లలకు వండి పెట్టేది. అలా రెండు రోజులు గడవగానే ఇంట్లో ఉన్న సరుకులు అయిపోవడం మొదలవుతూ ఉంటాయి. మరో వైపు ఇంటి యజమానికి జ్వరం వచ్చి మంచం పై నుండి లేవలేక పోతున్నాడు. దాంతో ఆ…