aksharalipi family storys

నవతరం

నవతరం

నవతరం   గబుక్కున మెలకువ వచ్చింది సుధకు , అమ్మో తెల్లారిపోయిందా అనుకుంటూ అరచేతులు చేసుకుని ,రామా పరంధామ , నువ్వే దిక్కయ్య అంటూ లేచి మంచం సర్దేసి , బయటకు వచ్చింది, పిల్లలు ఇంకా లేవనట్టు ఉన్నారు, కొడుకూ, కొడలూ ఇంకా లేచినట్టు లేదు. హమ్మయ్య సరే ముందు నా పనులు చేసుకుంటాను అనుకుంటూ తానూ కాలకృత్యాలు తీర్చుకుని, ఇల్లు సర్దేసి, తుడిచేసింది సుధ. ఒక కాఫీ పెట్టుకుని తాగుతున్నప్పుడు మెల్లిగా పిల్లలూ, కొడుకు, కోడలు లేచారు. అందరూ తమ ఫోన్లు పట్టుకుని సోఫాల్లో కూర్చున్నారు. ఈ లోపు సుధ పూజగది సిద్దం చేసుకుంది. కాసేపు అలా చూస్తూ కూర్చుంది. పిల్లలు గాని, కొడుకు, కోడలు కాని ఏమైనా అంటారు ఏమో అని, కాని వాళ్ళు ఎంతకు కదలడం లేదు,అసలు మొహాలు, స్నానాలు ఏవి చేయడం లేదు. ఇక ఓపిక పట్టలేని సుధ ఏరా పిల్లలు లెండి, లెండి లేచి…
Read More
తేడా పెళ్లి

తేడా పెళ్లి

తేడా పెళ్లి ఆనాడు                                                ఈనాడు =====                                             ======                          పెళ్లి చూపులు 1 రోజు                                                 1 రోజు                  …
Read More
బరువు

బరువు

బరువు “అటక మీద ఆ మూడుచక్రాల సైకిల్ ఎందుకు. మొన్న అమెరికా నుండి వచ్చిన మనవడు కూడా ఆడుకోవడానికి ఇష్టపడలేదు కదా?” అంటాడు భార్యతో పరంజ్యోతి. “అదేమైనా అడ్డమా ఏంటి? ఉండనివ్వండి అబ్బాయి గుర్తుగా ఉంటుంది” అంటుందామె. “మన గృహప్రవేశానికి ఫలానావాళ్ళు పెట్టారు. వాళ్ళేమైనా అనుకోరూ” అంటుంది. వాళ్ళకింక ఏ పనీ లేనట్టు. “అబ్బాయి పెళ్ళికి చిన్ని కూతురు ఇచ్చింది కాదూ. ఉంచండి దేనికైనా పనికొస్తుంది” అయితే ఆ చిన్ని ఎవరో పరంజ్యోతికి తన్నుకున్నా గుర్తు రాదు. ఇలా ఉంటాయి. కొన్నిటికి అయిష్టంగా ఒప్పుకుంటుంది. ఒకసారి ‘ఇంట్లో వస్తువేదైనా బయటకి వెళ్ళడం ఆడవాళ్ళకి ఇష్టం ఉండదండి’ అనేసింది. అదే ఆఖరు. తన చేతుల్లో లేనిదేదైనా పరంజ్యోతి పట్టించుకోడు. ఆలోచన అయితే తుంచేస్తాడు. పని అయితే మొదలుపెట్టడు. వాదన అయితే పొడిగించడు. జీవితం కూడా అంతే కదా. పరంజ్యోతి వెళ్ళిపోయాడు. ఆవిడకి బయటకి పంపించక తప్పలేదు. పరంజ్యోతి మినిమలిస్టు. అవసరం లేనిది ఏదీ…
Read More
సమీర

సమీర

సమీర "నాన్నా మీకెందుకు అర్ధం కావడంలేదో నాకు తెలీడంలేదు. ఆ అమ్మాయి మనసు మంచిది, మనిషి మంచిది తనతో జీవితం బావుంటుంది. పైగా మేమిద్దరం ఈ దేశంలోనే వుండము, మీకు ఇబ్బంది అనుకుంటే మళ్ళీ ఈ ఊర్లో కనిపించం. ప్లీజ్! మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి." అప్పటికి నాలుగు గంటల నుంచీ నడుస్తుంది నాన్నతో వాగ్వాదం. కష్టాల్లో వుంటే రాళ్ళేసే వాళ్ళే కానీ సాయం చేసే ఒక్కడూ లేని బంధువుల గురించి అమ్మా నాన్నా ఎందుకు ఇంత వర్రీ అవుతున్నారో నాకు ఎంత చించుకున్నా అర్ధం కావడం లేదు. కనీసం అమ్మైనా సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే అదీ లేదు. ఎన్ని చేసినా వెనకేసుకొని వచ్చే అమ్మ కూడా ఎదురు తిరిగే సరికి ఏం చేయాలో తెలీని అయోమయం. ఒప్పుకుంటే సరేసరి లేదంటే కామ్ గా మన పని మనం చేసుకోవడమే. కొన్నేళ్ల తరువాత వాళ్ళే మెత్త బడతారు అన్న రాజీవ్ గాడి…
Read More
తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం ఈ సీరియల్ మొదటి భాగం తారా చరణియం పరిచయం చదవండి తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అమ్మాయ్ జ్యోతి నువ్వు బడికెళ్ళే ముందు నాన్నగారికి కొట్టులో టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళమ్మా పొద్దుననగా వెళ్ళారు ఏమీ తినలేదు. పాపం ఎంత ఆకలిగా ఉన్నారో.... అసలే అంతంత మాత్రం ఆరోగ్యం అంటూ బాక్స్ పట్టుకుని అద్దం ముందు తయారవుతున్న కూతురి దగ్గరికి వచ్చింది జయమ్మ. అబ్బా అమ్మా నేను వెళ్లనే నాకు అక్కడికి వెళ్లాలి అంటే అదోలా అనిపిస్తుంది. అందరూ పిచ్చి చూపులు చూస్తారు అంది జ్యోతి కొంచం నీరసంగా.... అయ్యో అలా అనుకుంటే ఎలా తల్లి... నువ్వు వెళ్ళేది మీ నాన్న కోసం కదా, అవ్వన్నీ పట్టించుకుంటే మనం వ్యాపారం చేయలేం చూసి చూడనట్టు వదిలేయాలి. అక్కడే ఉండవు కదా బాక్స్ ఇచ్చి తొందరగా వెళ్ళిపో.... మనం బతికేది అదే వ్యాపారంతో కదమ్మా…
Read More
ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2 వాళ్లిద్దరూ జగన్ గదికి వెళ్ళారు. ఏదో కావాలనే కోరికతో కాలిపొతున్న అద్వైత అతని వెంట బలికాబోతున్న మేకలా వెళ్ళింది. జగన్ తన గదిలో ఎవరితోనో చెప్పి ఏర్పాట్లు చేయించాడు. అవేవీ తెలియని అద్వైత అతనితో జరగబోయే సంగమం గురించి ఆలోచనలతో వెళ్ళింది. ఇద్దరూ గది దగ్గరకు వెళ్ళగానే జగన్ తనకు అనుమానం రాకుండా తాళం తీశాడు. అంతకు ముందే జగన్ దగ్గర పనిచేసే కుర్రాడు చెప్పుల కింద పెట్టిన తాళం చెవిని తీసుకుంటూ చుట్టూ ప్రక్కల ఎవరు లేని ఆ ఏకాంత ప్రదేశంలో ఉన్న తన గదిలోకి అద్వైతము ఆహ్వానించాడు. చుట్టూ ఎవరున్నారో, అసలు ఆ గది ఎక్కడ ఉందో, తనకేం జరుగుతుంది కూడా గమనించే స్థితిలో లేదు అద్వైత. ఏదో కావాలని మాత్రం చాలా బలంగా అనిపించసాగింది. వయసు వేడి ఏమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా చేసింది. చిన్న గదిలో ఒక సింగిల్ బెడ్…
Read More
జంట శ్వాస

జంట శ్వాస

జంట శ్వాస హరి, సుజలది గొప్ప జీవితం. వీరిది ఆదర్శ జంట. మేనరిక వివాహం అవ్వడంతో ఇరుపక్షాల లోని ఉన్నత గుణాలని అచ్చు పోస్తే తయారైన అందమైన విగ్రహాలు ఈ రెండు. వీరిద్దరూ పెద్ద కుటుంబాల్లో జన్మించినప్పటికీ జీవిత ప్రవాహంలో ఈదుకుంటూ అందరికీ దూరంగా వేరే ఒడ్డుకు చేరుకుని స్థిర పడాల్సి వచ్చింది. సుజది ఇతరులకు చేతనైనంత సహాయం చేసే గుణం. ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించి, మంచి భోజనం పెట్టేది. ఇక ఆవిడ భర్త హరి గారి గురించి చెప్పక్కర్లేదు. భార్య నోట్లోంచి మాట వచ్చినది తడవుగా ఓ సంచీ చేతపట్టుకుని భార్య చెప్పినట్లు బంధువులకు ఇష్టమైన కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరు తల్లిదండ్రులుగా ప్రత్యేకించి పిల్లలకు జీవితం నైపుణ్యాలను ఏమి నేర్పలేదు. వీరు కూడా, ' యథా రాజా: తథా ప్రజా ' అన్న చందంగా అచ్చుపోసిన విగ్రహాలే. నిరాడంబరతకు నిలువుటద్దం…
Read More
ఓ చిన్న తప్పు పార్ట్ 2

ఓ చిన్న తప్పు పార్ట్ 2

ఓ చిన్న తప్పు పార్ట్ 2 భార్య తల దగ్గర దీపం చూసి కుప్ప కూలి పోతాడు రంగనాథ్. "మొన్న విసుక్కోకుండా ఉన్నా బావుండేది, పాపాత్ముని నేను", అంటూ విలపిస్తాడు. ఏం లాభం...........? రంగనాథ్ గారు మైక్ చేతిలోకి తీసుకుంటాడు. అప్పటికే రెండు సార్లు ధారగా కారుతున్న కన్నీటిని దస్తీ తోటి తుడుచుకుంటాడు. కానీ ఆ కన్నీటి ధార మాత్రం ఆగలేదు. "ఆహుతులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు". అంటూ మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఉద్వేగభరితంగా ఉన్న ఆయన శరీరం వణుకుతున్నట్టు తెలుస్తోంది. అలానే వణుకుతున్న చెయ్యి ని జేబులో పెట్టి, ఒక మడిచి ఉన్న ఉత్తరాన్ని తీశాడు రంగనాథ్ గారు. అందరికీ నమస్కారము! ఈరోజు నా భార్య లక్ష్మి జన్మదినము. మిమ్మల్ని ఇలా ఆహ్వానించినందుకు మన్నించండి. నాలో బడబాగ్ని తో మండిపోతున్న నా తప్పు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ముందుగా నా తప్పు సరిదిద్దుకోవాలి అంటే నా…
Read More
మౌఖిక పరీక్ష

మౌఖిక పరీక్ష

మౌఖిక పరీక్ష (ఒక ప్రముఖ ప్రజాదరణ పొందిన దిన పత్రిక విలేఖరి జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతడు ఏమి అడిగాడు? ఆమె ఎలా స్పందించింది) విలేఖరి:- నమస్కారం, జానకమ్మ గారు. మీ ఈ 65 ఏళ్ళ జీవితం ఎలా సాగింది అనుకుంటున్నారు? మీకు తృప్తి కరంగానే అనిపిస్తోందా? జానకమ్మ:- నమస్కారం, బాబు. తృప్తికరంగా ఎవరి జీవితాలు సాగవు. ఒడిదుడుకులు అందరమూ ఎదురుకోవాల్సిందే ....! నాకూ, అవి తప్ప లేదు. విలేఖరి:- బాగా చెప్పారు. మీ ముఖంపై ఆ చిరునవ్వు చూస్తుంటే ముచ్చటగా ఉంది, అమ్మ. మీరు అందరిలా కష్టాలు పడినట్టు అనిపించట్లేదు. జానకమ్మ:- బహుశా నువ్వు నన్ను క్రితం లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం నేను తృప్తిగా నవ్వుతున్నాను. ఇకపై కూడా ఈ మందహాసము ఇలానే చెరిగిపోకుండా ఉంటుంది. విలేఖరి:- చాలా సంతోషం, అమ్మ. అంటే మీరు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏం అంటారు మీరు?…
Read More
చివరి చూపు చివరి భాగం మాయ

చివరి చూపు చివరి భాగం మాయ

చివరి చూపు చివరి భాగం మాయ వాసు కి కనిపించిన ఫైల్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ బైక్ పై ఉండేసరికి చూడలేక ఇంటికి వెళ్ళి చూడాలని అనుకున్నాడు. వాసు ఇంటికి వెళ్లేసరికి తలుపులన్నీ తీసి ఉన్నాయి. అలా యెప్పుడూ ఉండదు. తల్లి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచుతుంది. అమ్మకు ఏమైంది అనుకుంటూ అమ్మా, అమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు వాసు. కానీ లోపలి నుండి ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఎవరు పలకడం లేదు. అరే ఎవరూ లేరెంటి ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ నాన్న, నాన్న అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. లోపల బెడ్ రూం లో బెడ్ పైన తండ్రిని పట్టుకుని తల్లి ఓదారుస్తూ ఉంది. అది చూసి ఎంతో ఆశ్చర్య పోయాడు వాసు. ఇన్నేళ్లుగా తండ్రి ఏడవడం అసలు చూడలేని వాసు ఎంతో విభ్రాంతిగా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని. వాసు ని గమనించిన తల్లి…
Read More