సాయి చరితం-179
సాయి చరితం-179 పల్లవి సాయమిచ్చే సాయి వెలుగేమో చల్లుతాడు అండగా ఉంటూనే మార్గమే చూపుతాడు చరణం కొండంత కోరికలను మన్నించి తీర్చువాడు మారాము చేయు మమ్ము దయతోటి మార్చువాడు చరణం చిరునవ్వుతోటి తాను కష్టాలు తీర్చుతాడు చలించు చిత్తమునకు పగ్గాలు వేయువాడు చరణం తన నామమొక్కటే మము నడిపించునుగా తన చరితమొక్కటే నీడగా నిలుచునుగా చరణం సాయేమో శాశ్వతము మనమేమో గాలిపటం తన బంధమొక్కటే మన జీవన సూత్రం -సి.యస్.రాంబాబు