సాయి చరితము
సాయి చరితము పల్లవి నీవే మా దైవమని నీవే మా గురువు అని కొలిచినాము సాయి నిను తలిచినాము సాయి చరణం సాగనంటు జీవితము మొండికేయు వేళ నీ పేరును జపియించిన నీడనిచ్చి అభయమిచ్చు...ఇది నిజము సాయి చరణం సమస్యలే చుట్టుముట్టి సమభావము సమసిపోవ నీ నామము వెంట ఉండి దారి చూపు సాయి...ఇది నిజము సాయి చరణం కష్టాల హోరులో బతుకు నావ కదలకుంటే ఏ ధైర్యము లేని మాకు నీనామము అండగా..ఇది నిజము సాయి చరణం విడలేని బంధమయ్య నీ భక్తులతోటి నీ లీలల తోటలో పెరిగేటి మొక్కలం..ఇది నిజము సాయి - సి.యస్.రాంబాబు