జీవితం వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని - భరద్వాజ్
జీవితం జీవితమంటే జీవిస్తున్నాము అని భ్రమించే మానవ శరీరాల సమూహం "ఓటమిని మించిన జీవితపాఠం మరియొకటి ఉండునా ! గెలుపుని మించిన ఆనందం జీవితం లో మరియొకటి దొరుకునా ! గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది....! పడి లేచే బ్రతుకులే అందరివి! కన్న కలలు వేరేమో.....! చేసే కష్టం మాత్రం ఒక్కటే సాగే దారులు వేరేమో.... చేరే తీరం మాత్రం ఒక్కటే!! ఓటమి గెలుపుల ఆట లో నీ జీవితపరమార్ధం తెలుసుకో మానవా..!!!" - సూర్యాక్షరాలు
జీవితం చిదాకాశం నీడలో చిరునవ్వుల గొడుగుతో అనుభవాల బాటలో పున్నమి చంద్రుడిలా సాగిపోవటమే జీవితం ఎదురుదెబ్బలు ఆటుపోట్లు లోటుపాట్లు పలకరింపుల పన్నీరు అన్నీ చూడాల్సిందే మోదఖేదాలను మోయటమే జీవితం కాలం యవనికపై ఎవరి పాత్రను వారు పోషించాల్సిందే కుప్పలు తెప్పలుగా పొట్టతిప్పలు మనసు దొన్నెలో జ్ఞాపకాలు కలిపితేనే తేనె మాధుర్యమై జీవితం అతిథవోలె అవనికి వచ్చినవారం వారాలు, నెలలు కరిగిపోతుంటే కొట్లాటలను కొట్టేసి మాటల కెరటాలుగ మారమనేదే జీవితం - సి. యస్ .రాంబాబు