జోక్
జోక్ భర్త: ఆ పెనం కింద కాస్త మంట తగ్గించు...! మరీ సిమ్ లో పెట్టకు...! పెసలు మరీ పేస్టల్లే రుబ్బినట్టున్నావ్...! ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నట్టు లేదూ...? ఇంకాస్త సన్నగా తరగాల్సింది..! అల్లం ముక్కలేంటీ, మరీ తురిమేసినట్టు ఇంత సన్నగా ఉన్నాయేంటీ..? కాస్త మందంగా తరగాల్సింది..! ఆ జీలకర్ర సన్న సెగ మీద కాసేపు వేయించావా, లేదా..? లేకపోతే పచ్చివాసనేస్తుంది..! కాస్త నెయ్యీ, కాస్త నూనె కలిపివేస్తేనే అట్టు రుచి బావుంటుంది. మరీ పల్చగా వేయకు, అలా అని మరీ బండగా వేయకు..! మధ్యస్తంగా వేయి...! మంట కాస్త తక్కువ సెగ ఉండేట్టుగా ఎక్కువ సేపు కాలేట్టుగా పెట్టు. ఆ పెద్ద బర్నర్ మీద పెట్టావనుకో, అట్టు అన్నివైపులా సమానంగా కాలుతుంది...! పుట్నాల పప్పు పచ్చడీ, అల్లం పచ్చడీ రెండూ చేశావుగా..? పుట్నాల పప్పు పచ్చడి కాస్త పల్చగా ఉండాలి, కానీ తిరగమోత గాఠిగా పడాలి. ఇహ అల్లం పచ్చట్లో కాసింత కొత్త చింతపండు, పండుమిర్చీ కారం…