aksharalipi kougili

కౌగిలి

కౌగిలి మిద్దెలు మేడలు లేకున్నా  నీ నులి వెచ్చని కౌగిలి చాలు  అన్నది ఒక నెచ్చెలి  హృదయపు వాకిలిలో పరచుకున్న  పచ్చని పైరు లాంటి ఒక  అనుభూతి   హృదయ స్పందనల  అందమైన అల కౌగిలి  నీ బాధను ఓదార్చే ఇంకొక  హృదయమే ఓదార్పు కౌగిలి  నిన్నుచూసి పులకించే ఆ ఎదయే ఆత్మీయ కౌగిలి  నే ప్రయాణపు క్షేమం కోరేది  ఆశీస్సుల కౌగిలి   నువ్వే ప్రాణమని నమ్మేదిఅనుబందపు  కౌగిలి  నా కళ్ళని నేనే నమ్మలేని  సందర్భం ఆశర్యపు కౌగిలి  నీవే గొప్ప అని అన్నది ఒక మమత అభినందన కౌగిలి  నే కొరకై వేచి చూసి ఎదురైంది ఆహ్వనపు కౌగిలి  నిన్ను  నిన్నులా మైమరిపించే ఒకే ఒక్కటి  నీ హృదయపు కౌగిలి స్పందన . - జి.జయ
Read More