aksharalipi new year wishes

31st రాత్రి

31st రాత్రి 31st కి మీరేం చేస్తారు? బీరు, బిర్యానీ, కేకు, క్యాండిల్స్ అన్ని తెచ్చేసుకుని, తింటూ తాగుతూ, ఊగుతూ, పబ్బుల్లో చిందులు వేస్తూ, తిన్నంత తిని, పారేసినంత పారేసి, తాగినంత తాగి, ఊగినంత ఊగేసేసి, బండి పై జూమ్ అని వెళ్తూ ఫైన్ లు కట్టేసి వాళ్లకు నజరానా ఇచ్చమ్రోయా అంటూ నవ్వుకుంటూ వెళ్తారా? అవును రోయి నిజమే ఇవ్వన్నీ చేసేస్తాం.. హా అంతేగా మరి అయ్య కొనిచ్చిన బైక్ ఉంది. అవ్వ దగ్గర నుండి లాక్కున్న డబ్బుంది. తల్లిదండ్రులను పిక్కొని తినే దమ్ముంది. ఏదన్నా అంటే చస్తాం అనే బెదిరింపులు ఉండనే ఉన్నాయి. ఇంకేం కావాలిరా ఎంజాయ్ కి ఇగ తాగుడే ఊగుడే... అరెరే అక్కడెంటి రా ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు అదిగో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఏ కాలం అయినా పిడికెడు మెతుకులు కోసం రోజంతా కష్టపడే జీవులురా... కప్పుకోవడానికి…
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More

నూతనం

నూతనం నూతన వత్సరం లో వినూత్న నిర్ణయాలతో గడిచిన విషాద రోజులను మరిచిపోతూ, రాబోయే రోజులైనా సుఖ సంతోషాలను కలిగించాలని, గత జ్ఞ్యాపకాల తిరిగి రానివ్వకుండా, గత చరిత్ర పునరావృతం కాకుండా, అంతా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని, నూతనంలో నూతనంగా  అందరి జీవితాలలో ఆనందాలు వెల్లి విరియాలని, ప్రజలంతా పచ్చగా కళకళ లాడుతూ ఉండాలని, అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం
Read More