aksharalipi new year

31st రాత్రి

31st రాత్రి 31st కి మీరేం చేస్తారు? బీరు, బిర్యానీ, కేకు, క్యాండిల్స్ అన్ని తెచ్చేసుకుని, తింటూ తాగుతూ, ఊగుతూ, పబ్బుల్లో చిందులు వేస్తూ, తిన్నంత తిని, పారేసినంత పారేసి, తాగినంత తాగి, ఊగినంత ఊగేసేసి, బండి పై జూమ్ అని వెళ్తూ ఫైన్ లు కట్టేసి వాళ్లకు నజరానా ఇచ్చమ్రోయా అంటూ నవ్వుకుంటూ వెళ్తారా? అవును రోయి నిజమే ఇవ్వన్నీ చేసేస్తాం.. హా అంతేగా మరి అయ్య కొనిచ్చిన బైక్ ఉంది. అవ్వ దగ్గర నుండి లాక్కున్న డబ్బుంది. తల్లిదండ్రులను పిక్కొని తినే దమ్ముంది. ఏదన్నా అంటే చస్తాం అనే బెదిరింపులు ఉండనే ఉన్నాయి. ఇంకేం కావాలిరా ఎంజాయ్ కి ఇగ తాగుడే ఊగుడే... అరెరే అక్కడెంటి రా ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు అదిగో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఏ కాలం అయినా పిడికెడు మెతుకులు కోసం రోజంతా కష్టపడే జీవులురా... కప్పుకోవడానికి…
Read More

నూతనం

నూతనం నూతన వత్సరం లో వినూత్న నిర్ణయాలతో గడిచిన విషాద రోజులను మరిచిపోతూ, రాబోయే రోజులైనా సుఖ సంతోషాలను కలిగించాలని, గత జ్ఞ్యాపకాల తిరిగి రానివ్వకుండా, గత చరిత్ర పునరావృతం కాకుండా, అంతా సంతోషంగా ఉండాలని, ఆనందంగా గడపాలని, నూతనంలో నూతనంగా  అందరి జీవితాలలో ఆనందాలు వెల్లి విరియాలని, ప్రజలంతా పచ్చగా కళకళ లాడుతూ ఉండాలని, అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం
Read More

నిర్ణయం 

నిర్ణయం  కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నేను అయితే చాలా నిర్ణయాలు తీసుకుంటాను. అవేంటంటే  బట్టలు ఎక్కువ కొనొద్దు అని, డబ్బులు ఖర్చు చేయొద్దు అని, బాగా నిద్ర పోవాలని, బాగా తినాలి అని, ఇలా చిన్న చిన్నవే . మీకు అనిపించవచ్చు ఇవేం నిర్ణయాలు అని వాటికి ఒక లెక్క ఉంది (చిన్నవే కాని అనుభవం లోకి వస్తే అవెంత పెద్దవో తెలుస్తుంది) చెప్తాను వినండి.. బట్టల విషయానికి వస్తే బయట షాప్ లో కాస్త మంచిగా అనిపించిన డ్రెస్ ఏదన్నా ఉంటే వెంటనే నా కాళ్ళు, కళ్ళు అటే వెళ్తాయి. అప్పు చేసైనా సరే దాన్ని కొంటాను. ఇది తెలిసి మా అమ్మ మొత్తుకుంటుంది. వద్దే వద్దే ఉన్నవి వేసుకోవే అని కానీ మనం వింటామా వినము కదా పోనీ  అలా కొన్న డ్రెస్ వేసుకుంటానా అంటే అది లేదు. ఒక్కసారి వేసుకుని పక్కన పెట్టెస్తా, అంతే మళ్లీ…
Read More

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, కొత్త బట్టలు కొనడం, కేక్ తేవడం, మందు, విందు గురించి ఆలోచించడం, లేదా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కొత్తగా గడపడం లాంటివి ఉంటాయి. కొత్త సంవత్సరం అనగానే కొందరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మందు మానెయ్యాలి అని, సిగరెట్ మానేయాలి అని, కుటుంబంతో గడపాలి అని, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అన్ని సార్లు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండలేక పోవచ్చు. మందు మానేయాలి అనుకున్న రోజే ఆఫీస్ లో పార్టీ జరగొచ్చు. లేదా ఇంకేదో అవ్వచ్చు. అప్పుడు తాగకుండా ఉండలేరు. ఇక సిగరెట్ కూడా అంతే ఏవో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఇంకా కుటుంబంతో గడపాలి అనుకున్నప్పుడు ఏదో టూర్ కి వెళ్లాల్సి వస్తోంది. ఇలా అనుకున్న వాటిని మనం కొత్త సంవత్సరంలో చేయలేక బాధ పడిపోతూ…
Read More