aksharalipi poems

నవ్వుల పువ్వులు

నవ్వుల పువ్వులు

నవ్వుల పువ్వులు ఊరు పేరేమో "ఆహా".అక్కడివాడే "మహా". నవ్వేసేవాడు "హాహా". అతనికొక తాత.తాతకి ఇష్టం కోడికోడికి ఇష్టం పకోడి.మహా తెచ్చాడు చకోడి.కోడికి పెట్టాడు చకోడి.కోడికి నచ్చలేదు చకోడి.దానికి కావాలి పకోడి.పారిపోయిందా కోడి. తాత కోడేమో పాయే.తాత తెచ్చాడు బెత్తం"హాహా" నవ్వు పోయే.బెత్తానికే భయం వేసేలాహాహాకి పూజ జరిగింది.తాత తీర్చాఢు తీట.కోడి కోసం పిల్లాడినిచంపేస్తారా అంది అమ్మతాత కోపం తగ్గలేదు."హాహా" వీపు విమానంమోత మోగించాడు. ఇది కల్పిత కవిత.ఇందులో ఏ పక్షిహింసింప బడలేదు."హహా"కి మాత్రమేబడిత పూజ జరిగింది. వెంకట భాను ప్రసాద్
Read More
కాలం పంపిన కారణమది…!!!

కాలం పంపిన కారణమది…!!!

కాలం పంపిన కారణమది…!!! కనుపాపలపై కాచిన అక్షరాలనుమదితడినే సిరాగ చేసుకొని రాస్తున్నా..!!మరణం కాలిపోయినది చితాభస్మంచితిని దహించివేసినది అగ్ని కణం…ఆలోచనెందుకు మిగిలేదుండని శూన్యంబతుకు నడిచే సుఖదుఃఖాల ఆరాటాలతోజీవన్మరణ పోరాటాన్ని ఎన్నాళ్ళని చేస్తావు… సృష్టిని తోచిన విశ్వాసం ప్రళయంవృష్టి ముంచిన బతుకు అయోమయం…నీ శ్వాసల మడతలతో పిలిస్తే చావురాదు..!!అది పనిగట్టుకు కాలం పంపిన కారణమది…అహంకరించకు తిరగలిలా తిరిగే జీవితాన్నిఅనుభవాల జ్ఞాపకాలతో తీరం దాటించుకో… వ్యామోహాల చిట్టాలతో విడిపోకుఉన్మాదాల ఊపిరితో గొడుగులిప్పకు..!!చీకటి వెలుగులు ఒక కంటిలో పొడవనీకురెప్పల చాటున స్వర్గసుఖాలను తలువకునడిచే ఈ నేలపైనే పాపపుణ్యాల భేరీజులు…అమలయ్యేదిక్కడే అనుభవించేది ఇక్కడే…మొహమాటమెందుకు కారునిజం ఖచ్చితంతప్పని భాగ్యానికి అందరు దాసోహం… జననంతో చుట్టుముట్టినవి వలయాలుమరణంతో నిన్నొదలినవి మమకారాలు..!!తూగని తక్కెడలో జారేదే జననమరణాలువిసరిన సవాళ్ళతో నేలనిడిచి సాముచేసినాపిడికెడన్నము కొరకే మోసేది ఆ నలుగురే…తెలిసిన వాస్తవానికి తెరచాటువై పోయి…భౌతిక వ్యాపకమై లోకం కంటికి శుక్లమైనా…మరణం తానైవచ్చే యాదృచ్ఛిక వరమది… దేరంగుల భైరవ
Read More
అదే జీవితం కాదు…!!!

అదే జీవితం కాదు…!!!

అదే జీవితం కాదు…!!! మనిషి సృజనకు పరాకాష్టగారంగులద్దు కొన్న కరెన్సీ రాజ్యాలేలుతోంది…మరణంలేనిది మనిషితో సంబంధమై..!!కదలిన సమయం కారణాలకు రూపమని…మర్మం తెలుసుకోన్న కర్మజీవుడు త్యాగమైఆజన్మాంతాన్ని డబ్బుకై పరుగెత్తిస్తున్నాడుదక్కించుకోవాలనో దాహం తీర్చుకోవాలనో…అదే జీవితం కాదు అదొక భాగం మాత్రమే వయస్సుతో నిమిత్తం లేక శరవేగమైఆశకు పుడుతు కోరికలను తడుతూ…డబ్బుతో ముడేసుకొన్న అనుబంధమై…బోధపడని పరిస్థితులను మెలిదిప్పుతూ..!!వెంబడించినా తీరానికి దొరకని ఎండమావనిదొరికినా దాహార్తిని తీర్చలేని సముద్రపు నీరనితెలుసుకునే లోపలే తెలవారి పోతున్నావు… మనిషి మనుగడకు అవసరమైనాప్రగతి చక్రాన్ని నడిపించే ఇంధనమైనా…అవసరం కొద్ది వాడుకతో దారి నడుపాలి..!!అదే లోకమని నీవు శ్వాసలను సలుపుతే…కొనలేని ఆత్మగౌరవాలు వెర్రి ప్రదర్శనలే…విరుచుకొన్న వర్తమానం పిచ్చి పోకడలే…డబ్బు తొడిగిన మాయా పాషాన్ని విరిచేసినిజానికి నిలువుటద్దమై రేపటిని చూపించు… డబ్బు కట్టిన కోటలపై విహారమైఅంతు చిక్కని ఆనందం సుడిగుండమై…పంచభూతాలతో సత్సంబంధాలు లోపమై..!!సాక్ష్యం చెప్పని శాసనం డబ్బుకు దాసోహమైఉడిగిన శక్తులతో ఉట్టికి స్వర్గానికి ఎగరలేక…నమ్మకాన్ని కళ్ళెదుటే ముంచుకొంటున్నావు…కనువిప్పైన వేకువలతో ప్రలోభాలకు లొంగకకొనేవి కొన్నైనా కొనలేనివి ఎన్నోనని తెల్సుకోపెద్దల…
Read More
బాక్సింగ్ బ్రూస్ లీ

బాక్సింగ్ బ్రూస్ లీ

బాక్సింగ్ బ్రూస్ లీ ఒకరోజు బ్రూస్ లీ బాక్సింగ్ శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు స్నేహితులు ఇలా నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు. "ఏమండీ! ఇంత నవ్వు ఎందుకు?" అని బ్రూస్ లీ అడిగాడు.వాళ్లలో ఒకడు ,"సార్! మేము కూడా మీలా ఫైటర్లు అవుదామని బాక్సింగ్ క్లాస్‌లో చేరాం" అన్నాడు."అయితే బాగానే ఉంది కదా!" అన్నాడు బ్రూస్ లీ.మరొకడు నవ్వుతూ,"మొదటి రోజే కోచ్ పంచ్ కొట్టండి" అన్నాడు. మేము ముగ్గురం కలిసి పంచ్ కొట్టాం. కానీ , బాక్సింగ్ బ్యాగ్ కదలలేదు. మా చేతులే నొప్పితో కదల్లేదు!"అంతలో మూడోవాడు ,"అప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకోవడం మానేశాం సార్" అన్నాడు.బ్రూస్ లీ చిరునవ్వుతో…"అంటే ఇప్పుడు ఏమి చేస్తున్నారు?" అని అడిగాడు.వాళ్లు ముగ్గురూ ఒకేసారి,"బాక్సింగ్ చేయలేకపోయాం. కానీ , నవ్వడం మాత్రం ఛాంపియన్లలా చేస్తున్నాం!" అన్నారు.అది విని బ్రూస్ లీ కూడా పెద్దగా నవ్వేశాడు.ఆ రోజు బాక్సింగ్ క్లాస్ కంటే నవ్వుల క్లాస్‌నే ఎక్కువ…
Read More

పిసినారి రంగయ్య

పిసినారి రంగయ్య ఒక ఊర్లో రంగయ్య అనే యువకుడు ఉండేవాడు.వాడికి పన్నెండేళ్లు ఉన్నప్పుడే తల్లితండ్రులు ఒకయాక్సిడెంటులో చనిపోయారు..అప్పుడు వీడు బడికెళ్లడం వలన బ్రతికిపోయాడు..ఒక్కడే సంతానం కావడంతో తోబుట్టువులెవరూ లేరు..దగ్గరి బంధువులు కూడ ఎవరూ లేరు దాంతో ఒక్కడేఒంటరి జీవనం సాగిస్తున్నాడు.. పల్లెటూరు కావడంతో ఆ ఊరి వాల్లె వానికి అండగానిలిచారు.చదువు మానేసి అన్ని పనులు చేసుకుంటు వచ్చినడబ్బులతో కాలం గడుపుతున్నాడు….ఊరి వారందరితో కలిసి మెలిసి ఉండడంతో అందరూవాడిని ఆప్యాయంగానె చూసేవారు….రంగడు అలా పెరుగుతూ యుక్తవయసుకి వచ్చాడు..చాలా కష్టపడి సంపాదిస్తుండడంతో వాడు కొంచంపిసినారిలా తయారయ్యాడు…. వయసుకు వచ్చిన రంగయ్యకు పెళ్లి చేయాలని ఆ ఊరిపెద్దమనిషి పక్క ఊరి నుండి సంబంధం తెచ్చాడు..ఆ పిల్ల మనవాడికి నచ్చడంతో ఆ ఊరి వాల్లు కలిసిఘణంగా పెళ్లి చేసారు….రంగయ్యకు కొత్త పెళ్లాంతో కొత్త జీవితం ప్రారంభమయింది…. రంగయ్య పెళ్లాం పేరు లక్ష్మి ఆమె ఇంట్లో అడుగు పెడుతూనె…ఇళ్లంతా బాగా చూసింది ఎక్కడా ఒక్క దేవుడి ఫోటోకూడ లేదు..ఏమండీ…
Read More
కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి (1852 - జూన్ 6, 1897) ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు.ఈయన గోపాలకృష్ణ శాస్త్రి, వీరమ్మ దంపతులకు 1852వ సంవత్సరంలో గుంటూరు లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి తెలంగాణలోని విప్పుల మడక అగ్రహారంలో కొంతకాలం ఉన్నాడు.తరువాత ఈయన గుంటూరు జిల్లా కారుమూరు గ్రామంలో స్థిరపడడంతో సుబ్రహ్మణ్య శాస్త్రి మెట్రిక్యులేషన్ వరకు ఇక్కడే చదివారు. గుంటూరులోని అమెరికన్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో 1884 వరకు, గవర్నమెంట్ హైస్కూల్లో 1889 వరకు తెలుగు పండితుడిగా పనిచేశాడు. ఆ తరువాత మదరాసు పచ్చయ్యప్ప కళాశాలలో ప్రధానాధ్రోపాధ్యాయుడిగా పనిచేశారు. 1881లో గుంటూరులో తెలుగు పండితులుగా పనిచేస్తున్నకాలంలో ధార్వాడ వారి నాటకాలు చూసి తను కూడా వచనంలోనే నాటకాలు రచించి ప్రదర్శింపజేశారు. ఆత్మానందంకోసం గుంటూరు హిందూ నాటక సమాజం స్థాపించారు. ఈ సమాజం ఆంధ్రదేశంలో స్థాపించబడ్డ సమాజాలలో రెండవది అని పరిశోధకుల అభిప్రాయం. నాటకాలలో నటించడం అగౌరవంగా ఉన్న…
Read More
ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్

ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్

ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ (జూన్ 6, 1877 - జూన్ 15, 1949) మలయాళ కవి, సాహిత్యకారుడు. మలయాళ సాహిత్యరంగంలో ఆధునిక యుగారంభంలోని ముగ్గురు మహాకవుల్లో ఒకరుగా ఆయన ప్రశస్తి పొందారు. (మిగిలిన ఇద్దరు - కుమారన్ ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్). ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ మధ్య తిరువాన్కూర్ రాజ్యం (ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని ఆలెప్పీ జిల్లా) లో చంగనాచేరి సమీపంలోని పెరున్న గ్రామంలో 1877 జూన్ 6న జన్మించారు. 19వ శతాబ్ది నాటికే వందల సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి ఉత్తర కేరళకు చెందిన కణ్ణూర్ జిల్లాలో వారి వంశంలో పూర్వీకులు స్థిరపడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కోలత్తిరి రాజవంశాన్ని సేవిస్తూ రాజధాని చిరక్కల్లో జీవించేవారు. ఆపైన ఆ వంశస్థుల్లో ఒకరు తిరువన్కూరుకు వలసవచ్చి, తిరువనంతపురం నగరానికి 4 మైళ్ళ దూరంలోని ఉళ్ళూర్ గ్రామంలో స్థిరపడ్డారు. తిరువాన్కూరు మహారాజులను సేవిస్తూ పలుమార్లు ఈ వంశస్థులు…
Read More
ఫార్వర్డ్ మెసేజ్

ఫార్వర్డ్ మెసేజ్

ఫార్వర్డ్ మెసేజ్ రాము ఒక రోజు ఫోన్‌లో వాట్సాప్ చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు తన తెలిసిన వాళ్ళు రీల్స్ పంపిస్తూ ఉంటే రోజంతా చూడ్డానికి సమయం సరిపోవట్లేదు వీళ్ళు ఎలాగైనా నాతో మాట్లాడకుండా చేయాలి అనుకొని , అప్పుడే తనకి అకస్మాత్తుగా ఒక మెసేజ్ వచ్చింది. "ఈ మెసేజ్‌ను 10 మందికి పంపితే… రేపటికి మీకు అదృష్టం వస్తుంది!" అని ఉంది.రాము వెంటనే నవ్వుకుంటూ,"అదృష్టం వస్తే బాగుంటుంది కదా!" అనుకుని 10 మందికి పంపేశాడు.కొద్దిసేపటి తర్వాత అతని స్నేహితుడు ఫోన్ చేసి,"అయ్యా! నువ్వు పంపిన మెసేజ్ చూసి మా నాన్న కూడా 10 మందికి పంపాడు. ఇప్పుడు మా ఇంట్లో అందరూ అదృష్టం కోసం ఎదురుచూస్తున్నారు!" అన్నాడు.అంతలో మరో స్నేహితుడు,"రేయ్! నీ మెసేజ్ వల్ల మా అమ్మ ఫోన్ కూడా ఫుల్ అయిపోయింది!" అని చెప్పాడు.అది విని రాము మరింత గట్టిగా నవ్వాడు. మరుసటి రోజు నిజంగానే ఒక అదృష్టం వచ్చింది!ఏంటంటే…ఆ…
Read More
మధురమైన సరిహద్దు

మధురమైన సరిహద్దు

మధురమైన సరిహద్దు నీ చిన్ని చిరునవ్వే అది నాకు వెలుగనీ సొట్ట బుగ్గల్లో తేలిపోనా చుక్కలన్నీనీ నడక చూడగానే నేల మీద పూలై పడి పోవునానీ మాటల తేనెలో నా కలలు తడిసెనేనీ ఒక్క చూపుతోనే ఈ మనసు మురిసెనేనీ ముందు నిలిచిన క్షణం నా శ్వాసే మౌనమైనీ లోకమంతా వెనుకబడే నీవే ముందుకెదురైనీ సొట్ట బుగ్గలు నా గుండె మేల్కొలుపునీ సొట్ట బుగ్గలు నా ఊహల వెలుగునీ సొట్ట బుగ్గలు చాలే నాకు చాలునీ సొట్ట బుగ్గలు నా ప్రాణాల పూలునేలంతా నీలమై ఆకాశం ఒరిగినట్టునీ ముందు నా హృదయం ముగ్దమై నిలిచిందినీ పూలన్నీ నిన్ను చూసి వణికే మౌనమవుతాయినీ దారి పక్కన చందమామ కూడా ఆగిపోతాడునీ నవ్వు తాకగానే చలిలోనూ వెచ్చగనీ లోకం మారిపోయే ఒక మధురమైన సరిహద్దుగానీ సొట్ట బుగ్గల మీదసూర్యుడే ఒదిగిపోతాడునీ మెరుపు పక్కన రాత్రి కూడా నమిలిపోతాడు… బర్రె సత్యనారాయణ
Read More
తెలివి తక్కువ దొంగలు

తెలివి తక్కువ దొంగలు

తెలివి తక్కువ దొంగలు**    **    *** సుదా!ఇలా రావే! ఎప్పుడు నీ పని నీదే కాని నన్నసలుపట్టించుకోవూ? పిలిచాడు సుద భర్త సురేష్ పిలిచాడుఅనేకంటె అరిచాడనె చెప్పాలి. ఆఁ….వస్తున్నానండి నాకు పిల్లలకు స్కూల్ కి టైమవుతుందని తెలుసు కదా! అయినా అరుస్తారు అనుకుంటూ వచ్చింది సుద. నేనుషాప్ ఓపెన్ చేయాలి కదా దేవుడి పూజ చేయాలి ఈరోజు వాకిలి ఊడ్చే అవ్వ రాలేదు కాస్త ఊడ్చి పెట్టు నేనుపూజ చేస్తా అన్నాడు సురేష్. అలాగె అలాగె అనుకుంటూ వచ్చినంత వేగంగా వెనకకు పరిగెత్తింది స్టౌ మీద కూర మాడుతుందని. సుదకు ముగ్గురు పిల్లలు వాల్లను బడికిపంపి తనూబడికి వెల్లాలి మరి అందుకే ఉదయాన్నె ఈ హడావిడి సుద భర్త పెద్ద బిజ్నెస్ మాన్  ఇంటి ముందు పెద్ద గదిలోషాప్ గిన్నెలు, బోల్ల  బిజినెస్ స్టీలు,ఇత్తడి, రాగి వాటితో తయారయిన అన్ని రకాల పాత్రలు అమ్మడం, పాతవి కొనడం  లాంటివి నడిపించె వాడుపెళ్లిల్ల సీజన్…
Read More