aksharalipi poems

జీవితం

జీవితం

జీవితం జీవితమంటే జీవిస్తున్నాము అని భ్రమించే మానవ శరీరాల సమూహం "ఓటమిని మించిన జీవితపాఠం మరియొకటి ఉండునా ! గెలుపుని మించిన ఆనందం జీవితం లో మరియొకటి దొరుకునా ! గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది....! పడి లేచే బ్రతుకులే అందరివి! కన్న కలలు వేరేమో.....! చేసే కష్టం మాత్రం ఒక్కటే సాగే దారులు వేరేమో.... చేరే తీరం మాత్రం ఒక్కటే!! ఓటమి గెలుపుల ఆట లో నీ జీవితపరమార్ధం తెలుసుకో మానవా..!!!" - సూర్యాక్షరాలు
Read More
జీవితమంటే

జీవితమంటే

జీవితమంటే జీవితమంటే మనం బతకడమే కాదు ఇతరుల కోసమే బతకడం గొప్ప... ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం చేస్తూ ఉంటాము సమస్యలు లేని జీవితం అసలు ఉండదు.. ఎంతటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది జీవితంలో సమయం ఎంతో విలువైనది ప్రతి నిమిషాన్ని వృధాగా ఖర్చు చేయకండి... సంతోషానికి పొంగుపోకు , దుఃఖానికి క్రుంగిపోకు , కష్టానికి వంగపోకు , కన్నీళ్లుకు కరిగపోకు , బంధాలను మరవపోకు , భయానికి బెదరిపోకు , అందరిని నమ్మపోకు , ఎవరికి లోంగిపోకు , మనుషులను ప్రేమించు వస్తువులను వాడుకో మనం అజ్ఞానంలో ఉంటూ మనుషులను వాడుకుంటున్నాము... జీవితమంటే కళ్ళకి నచ్చితే చేతికి రాదు మనసుకు నచ్చితే మన జీవితంలో ఉండదు... మనుషులకు దూరమైన కొందరు మనసుకు దూరమైన మరికొందరు.. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎప్పుడు మిస్ అవకండి.. మన జీవితంలో రేపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి... జీవితమంటే ఎప్పుడు చదవాల్సిన…
Read More
 తలవంచకు ఎవ్వరికి

 తలవంచకు ఎవ్వరికి

 తలవంచకు ఎవ్వరికి   సమాజం లో తలవంచకు ఎవ్వరికి నీ తలరాత మార్చునా ఎవరైనా తలవంచకు ఎవరికి నీ తప్పుకానప్పుడు తలవంచకు ఎవరికి నీ బలహీనత వారుకానప్పుడు తలవంచకు ఎవరికి నీ మనస్సు వారిది కానప్పుడు తలవంచకు ఎవరికి నీ కంటకన్నీరు తెప్పించువారికి తలవంచకు ఎవరికి నీ ప్రాణం విలువ వారికీ తెలియనప్పుడు.. -సూర్యాక్షరాలు  
Read More
నేటి సమాజం

నేటి సమాజం

 నేటిసమాజం     సమాజం తనను అర్థం చేసుకోవాలి అనే వాడికన్నా సమాజాన్ని అర్థం చేసుకున్న వాడే ఈ సమాజంలో బ్రతకగలడు తన తప్పు లేనప్పుడు ఎవరికి తల వంచడు ఎవరికి తన లక్ష్యం వైపుగా అడుగులు వేస్తూ ఈ సమాజంలో తిరుగుతూ ఉంటాడు ఈ మనిషి తనని వెనక్కి లాగాలని చూసే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపటి యువతకి సమాజం యొక్క గొప్పతనం చాటి చెప్తాడు ఈ సమాజం మన అందరిది తల వంచాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళడమే మన లక్ష్యం .   -భరద్వాజ్
Read More
రసగుళిక

రసగుళిక

రసగుళిక   లోక సమస్తం సాగిలపడే వర్ణరంజితమైన రసగుళిక నీ జీవితం.. క్షణమాత్రమైనా విలక్షణంగా తీర్చిదిద్దుకో..! మృత్యుగానాలు వెంటాడుతున్నా.. విషాదగీతాలు శృతిమించుతున్నా.. తావలం కాకు ఉదాసీనతకు.. తాపడం చేసుకో మనిషి అనే అస్తిత్వం నుంచి మనీషిగా నిన్ను నువ్వు..! ఆటంకాలనే అనగొండలను పెకిలించి అహంకార, మమకారాలను జయించి నచ్చినట్టుగా ఉండు..! ఇచ్చి పడేసెయ్ ముందు..! - మామిడాల శైలజ.
Read More
ధ్యాస

ధ్యాస

ధ్యాస     పదాల మీద సాధించు పట్టు పద ప్రయోగాలను తట్టు ప్రాస మీద పెట్టు ధ్యాస కవిత్వమవుతుంది శ్వాస   - పోలవరపు శ్రీ రామచంద్ర పవన్ కుమార్
Read More
ప్రేమ

ప్రేమ

ప్రేమ ఎదురు చూసాను నీ ప్రేమ కోసం నేను ప్రేమించినటే నువ్వు నన్ను ప్రేమిస్తావని కానీ అర్ధం కాలేదు నా మనసుకి నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని ఇంకా ఎంత ఎదురు చూసిన నువ్వు నా కోసం రావని - యువరాజ్
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శ్రీనివాసుని చూసెదమండీ కష్టాలన్నీ తీరునులెండి పదమే పాడుతు కదలాలండీ ఏడుకొండలు ఎక్కెదమండీ చరణం కలియుగమున వెలసినవాడు నిత్యపూజలను గైకొనువాడు భక్తసులభుడూ శ్రీనివాసుడు అభయమునిచ్చి కాపాడేవాడు చరణం కలతలు నలతలు తనవంటాడు తనువు మనసు తనదందాము కలియుగమందున వెలసినవాడు వేదనలన్నీ తెలిసినవాడు చరణం చిరునవ్వేగా తన ఆభరణము తన కరుణేగా మనసాధనము అండగ నిలిచి ధైర్యమునిచ్చి వేడుక చేయును మన జీవితమును - సి.యస్.రాంబాబు
Read More
లేఖ (కనిపించని ప్రేమ)

లేఖ (కనిపించని ప్రేమ)

లేఖ (కనిపించని ప్రేమ) ప్రియా...!! నయనాలనుంచి జాలువారుచుండె అశ్రువులు.. మదిలోతులనుంచి ఉబ్బికివచ్చుచుండె ఆక్రోసవ్యధలు.. జీవితగమనం అదుపుతప్పే దూరమవుచుండగా. ప్రాణంవున్న జీవచ్ఛవమాయెను నా దేహం - సూర్యక్షరాలు
Read More
ప్రేమ లేఖ

ప్రేమ లేఖ

ప్రేమ లేఖ నీ కన్నీళ్లు చూడగా విలవిలలాడెను నా హృదయం గజగజలాడెను నా నయనం కారణం తెలుసుకోమని అండగా ఉండమని అదేసించేను నా మనసు ఒక్కసారి నువ్వు నా కళ్ళలోకి చూడు నా గుండె లోతుల్లోకి చూడు తెలుస్తుంది నీకు విలవిలలాడే కన్నుల వ్యధ నీపై నేను చూపించే అనురాగ ప్రేమ సుధా - భరద్వాజ్
Read More