aksharalipi prema lekhala poti

ధరణి కో లేఖ

ధరణి కో లేఖ అమ్మ మమ్మల్ని భరిస్తూ ,మా బరువంతా మోస్తూ, మేము నిన్ను ఎంత బాధ పెట్టినా సహనం గా ఉంటూ ,మా తప్పులన్నీ కాస్తూ, మేము చేసే పిచ్చి పిచ్చి పనులను చిరునవ్వుతో చూస్తూ ,కర్రలతో బాధిస్తున్నా, మేకులతో నీ తలను చిధ్రం చేస్తున్నా , నీ పై బరువు నుంచి నిన్ను అణగ ద్రొక్కుతున్నా, పాపాలు చేస్తూ నీలో కలుపుతున్నా , హత్యలు మానభంగాలు నీ ముందే చేస్తూ, ఆ వికృత చేష్టలు గమనిస్తున్నా , చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తూ చంపుతున్నా , రూపాయికి, వందకు మర్డర్లు జరుగుతున్నా,  ఈ పాప భారాన్ని నీ తలపై మోస్తూ, ఓపికతో, సహనముతో, మంచితనంతో, ఎవరినీ నొప్పించకుండా భరిస్తున్న నిన్ను ఏమనాలి తల్లి. తల్లిగా పిల్లల్ని క్షమిస్తూ, క్షమయా ధరిత్రి  అన్న పేరును సార్థకం చేసుకుంటూ , ఇన్ని కోట్ల మంది పాపాలను చూస్తూ కూడా ఎంత సహనంగా…
Read More

సామ్రాజ్యం ప్రేమలేఖ

సామ్రాజ్యం ప్రేమలేఖ ప్రేమలేఖ రాయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. పాత కాలంలో ప్రేయసీ, ప్రియులు తమ మనసు మరొకరికి తెలియచేసేందుకు ఇదొక్కటే సాధనం. అన్ని ప్రేమలేఖలు సినిమాల్లో చూపించినట్లు సాహిత్యంతో ఉంటాయని చెప్పలేం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించి రాసే లేఖలు కొన్ని రాసే వారి అమాయకత్వాన్ని తెలియచేస్తే, కొన్ని లేఖలు హాస్యాన్ని పండిస్తాయి. అలాంటిదే మా సామ్రాజ్యం ప్రేమలేఖ. దాదాపు పాతికేళ్లకు ముందు నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటిది ఈ సంఘటన. మేమంతా మా పల్లెటూరినుంచి పక్కనే ఉండే పట్టణానికి వెళ్లి చదువుకునే వాళ్లం. పొద్దున్నే అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక ఇరవైమంది మా ఊరి నుంచి వెళ్లే ఒకే ఒక బస్సులో వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళం. మా గుంపులో సామ్రాజ్యం మాకన్నా ఒకటి రెండేళ్లు పెద్దది. తను పదో తరగతిలో ఉండేది. తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ల అమ్మ పొలం పనులు…
Read More

ప్రేమతో నీకు

ప్రేమతో నీకు నిన్ను నా చిన్నతనం నుంచి చూస్తున్నా.. నువ్వు నాతో ఎంతో సరదాగా ఉంటావు.. నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకుంటావు.. నేను నీతో వుంటే నీ ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోవు.. ఆఖరికి ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయవు... ఒక రోజు కాలేజీలో నన్ను ఎవరో  ఏడిపించారు.. నన్ను ఏడిపించారని తెలిసి వాళ్ళని కొట్టావు.. నీ చేతికి దెబ్బ తగిలింది అని కూడా మర్చిపోయి నన్ను ఒదార్చావు... నీ చేతి నుంచి రక్తం రావడం చూసి నేను చాలా కంగారు పడ్డాను... నువ్వు పండగకి ఊరు వెళ్తే ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు.. ఎక్కడ చూసిన నీ అల్లరే కనిపిస్తుంది... అప్పుడు నాకు అర్దం అయింది నువ్వు నన్ను వదిలి ఊరు వెళ్ళడం మొదటి సారి... అందుకే నేను ఒంటరి దానిని అయిపోయాను.. నువ్వు నాతో తప్ప మరొకరుతో చనువుగా ఉంటె నేను తట్టుకలేను... నువ్వు  నీ మరదలితో…
Read More

ప్రేమలేఖ

ప్రేమలేఖ అమ్మకి అంకితం. అమ్మప్రేమ అపురూప మైనది అనురాగపు విరుల గుత్తి. అష్టైశ్వర్యాలు కూడా సరిరాని అమ్మ ప్రేమ జీవిత ప్రయాణములో ప్రసవ వేదన నుండి మొదలై మధుర పాశంలా సాగుతుంది అమ్మ ప్రేమ. అనుభూతికి అక్షరంలా, స్నేహానికి చిరునామలా, శ్రుతి మించిన అభిమానంలా, నమ్మకమే నాణ్యతగా నిలిచిపోతుంది అమ్మ ప్రేమ... నిను కోరిన ఒకేఒక్క జీవి జగతిలో అమ్మ ప్రేమ నిను తాకిననాడే పొరలిన ఆనందం. మంచి మనసుకు మార్కు లాంటిది అమ్మ ప్రేమ చీకటి వెలుగుల సయ్యాటలో చిరు దీపమై వెలిగేది ఒకే ఒక్కటి అదే అమ్మ ప్రేమ ప్రేమే ప్రాణం ప్రాణమే ప్రేమ గా నిర్వచనం అమ్మ ప్రేమ అది పొందగలిగిన రోజులు అమృతమయం లేనిచో హృదయ గోష అమ్మ ప్రేమ కోసం తపించే ప్రతి జీవి అజరామరం - జి.జయ
Read More

ప్రియా

ప్రియా ప్రియా, మామూలు పాదాచారుడిగా వెళ్తున్న నాకు, ఏ తపస్సు చేయక పోయినా ఎదురుగా ఒక నడిచొచ్చే దేవత కన్పించింది. నా శరీరంలోని సిరలు, ధమనులు రక్త వేగానికి రాగాలు మీట ప్రారంభించాయి. ఈ అలజడేంటి అని ప్రశ్నించుకున్న నాకు, నా అంతరంగంలో మారు మ్రోగుతున్న రాగాలు, "ఇదే ప్రేమరా, ఓ పిపాసి" అని శ్రావ్యంగా చెప్పాయి. ఆకలి వద్దన్నది భోజనము, నిద్దుర వద్దన్నది పడుక, అలా తెరచిన కళ్ళు రాత్రంతా వీక్షించే ప్రయత్నం చేసాయి. తీపిగాయము పెద్దదాయెను ఒక్క రాత్రిలో...... "ఓ భగవంతుడా మందులేని ఈ గాయానికి ఆమె నిత్యదర్శనము సంప్రాప్తించు." అని వేడుకుంటిని. అదేమి, అందము నీది, దేవీ...! నా కళ్ళు నీ మూర్తిని నిలువరించకున్నాయి. నీవు ఉవ్వెత్తున లేచిన అలలా కనిపించి మాయమౌతావు. అసూయతో గాలి రివ్వున నా కళ్ళకి గంతలు కట్టేస్తోంది. నీ పరోక్షంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఈ జీవికి శ్వాసను వరంగా ప్రసాదించు.…
Read More

నా బంగారం

నా బంగారం నా బంగారానికి ప్రేమ లేఖ,  ప్రియాతీ ప్రియమైన నా బంగారం కీ మనస్ఫూర్తిగా ప్రేమతో వ్రాయు ప్రేమ లేఖ, బంగారం నువ్వు నా జీవితంలోకీ రావడం ఆలస్యం అయినా ఇన్నిరోజులు నా జీవితంలో లేని లోటును, నువ్వు వచ్చిన కొన్నిరోజులకే నీ ప్రేమతో మరిపించేసావు. భవిష్యత్తు లో నువ్వు నాతో మాట్లాడని రోజు వచ్చిన తట్టుకోగలను కానీ, నీ నుంచి చిన్న మెస్సేజ్ రాకపోయినా తట్టుకోలేను. ఎందుకో తెలియదు కానీ నీ దగ్గర నేను చిన్నపిల్లగా ఉండాలనుకుంటా, నువ్వు చూపించే ప్రేమకు ఎప్పుడు చిన్నపిల్లగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం దూరం ఉండచ్చు కానీ, మన మనసులు మాత్రం ఎప్పటికి కలిసే ఉంటాయి, నీకోసం నేను, నాకోసం నువ్వు ప్రతిక్షణం ఒకరి ఆలోచనల్లో ఒకరు ఉంటూనే ఉంటాము. నాతోనే నువ్వు, నీతోనే నేను.నాలో నే నువ్వు, నీలోనే నేను.నా శ్వాస లో నీ ఊపిరి, నీ శ్వాస లో…
Read More

కొంచం నేను

కొంచం నేను కొంచం నేను నేనూ కవినంటూ ఈసారెవడేనా నాకంట పడనీ చంద్రుడూ వెన్నెలా తారలూ ఇసుకతిన్నెలూ తుంగభద్ర కాలందెల సవ్వడీ, అంటూ కోతలు ఏంటో ఇవన్నీ చూద్దామని వెళ్ళానా నువ్వే లేని చోట ఇవన్నీ వుండీ ఏం చేస్కోనూ నువ్వే తోడైన క్షణాన అవన్నీ వున్నయని ఏం గమనించనూ... -కొండుభొట్ల.చంద్రశేఖర్
Read More

బంగారం

బంగారం ప్రేమను చూపించటం తెలిసిన నాకు, నీకోసం ప్రేమను, లేఖలో చూపించాలనివుంది. లేఖంతా ప్రేమనే రాయాలని వుంది. ఎంత రాసినా, ఎన్ని రాసినా, నాప్రేమను అణువంత రాయగలను. నిన్ను చూసిన ప్రతిసారీ " హాయ్" అనే పలకరింపుతో మొదలై, అదే మొత్తం సంభాషణగా మారి, ఆ ఒక్కపదంతో ముగించినా, ఎంతో అనుభూతిని పంచిన, నీ పలకరింపు చేసిన అలజడి గురించి ఎంతని చెప్పను? పెదవులు మౌనంలో, కళ్ళు ఊసులు చెప్తుంటే, నా మనసు విన్న నీ మౌనభాషలోని భావాలు ఎలా చెప్పను? ఎన్నో మాటలు పంచుకోవాలని, నా మనసు చేస్తున్న అల్లరిని ఎలా ఆపగలుగుతున్నానో! నాకే తెలియట్లేదు. అయినా, నిన్ను చూస్తూ, నీ పలకరింపు కోసం ఎదురుచూస్తూ, నీ తలపులతో నా మనసు నింపుతూ నా శ్వాస, ధ్యాస నీవేనని , నువ్వు తెలుసుకోవాలని రాస్తున్నా. నువ్వు ఒప్పుకున్నా,లేకున్నా! ఈ జన్మకు నా ప్రేమను నీకు తప్ప ఎవ్వరికీ పంచలేను. నీ జవాబు కోసం…
Read More

నీ తపస్వి

నీ తపస్వి తేది: సజీవము ఊరు : ప్రేమ దేవతకి, ఈ తపస్వి ఊపిరులతో ప్రాణం పోసిన జీవాక్షరాలతో నిన్ను అభిషేకిస్తూ....... నీ సమ్మతి ఎందుకు నాకు ఓ ప్రాణమా! నాది ప్రేమ, నీది జోడైతే ప్రేమలవునా ? నిన్ను చూసిన నిన్న నన్ను చేసెను ఓ తపస్వి. ఈ కఠోర దీక్షలో నీవు ప్రత్యక్షమౌడము ఎందుకే ? నేనే నీకు నిత్య పూజారిని, నీకు తెలియనిది నా ప్రేమ, అది చిన్నారిదే, సఖీ....! రెక్కలొచ్చె నిన్న, ఎగురుతుండెను నేడు. నా లేతనైన రెక్కల సవ్వడి చేర్చదేప్పుడే నీకు నా ప్రేమ సంగతి. ఇంకా రెక్కలు తొడగనిది నీ ప్రేమ వేచి ఉంటాను, దేవీ, నా ప్రేమ సజీవము. ఎగిరొచ్చి, తప్పక దర్శనమిస్తావు, తుదకు నీది అనుగ్రహమే, ఓ, నా చెలి ! ఇట్లు నీ తపస్వి - వాసు
Read More

అమ్మా…

అమ్మా... అమ్మా...! నీ మీద ప్రేమ చెప్పటానికి కూడా అవకాశం వస్తుందనుకోలేదు. అమ్మా...! చిన్నతనంలో, నీమీద ఇష్టాన్ని చూపించడమంటే, నీకు దగ్గరగా వచ్చేవారిని  వారించటంలో చూపించాను. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమగా చూసినా, వారిని ద్వేషించడంలో, నీమీద ఇష్టాన్ని చూపించాను. నాకు పుట్టినరోజు అయినా, పండగ అయినా నీతో చేసుకుంటే చాలు అనుకుంటానమ్మా, నాకు నీకు లోకంగా వుండాలని, ఒక్కదాన్నే వుండాలి అనుకున్నాను. ఎవ్వరి మీద ద్వేషం లేదమ్మా నీమీద ఇష్టం మాత్రమే, అందరి మీద కన్నా ఎక్కువ వుంది. నచ్చని పని అయినా, చెయ్యనంటూ చేస్తూ ఉండటంలోనే, నాప్రేమను చూపించానమ్మా. పట్టుమని పదిరోజులు కూడా నీకు దూరంగా వుండలేక ఏడ్చినప్పుడు,ఆఏడుపులో నా ప్రేమను కనిపించలేదా అమ్మా!   పెళ్ళి చేసుకుంటే, నువ్వు ఆనందపడతావని నీకు దూరంగా వుండాలని తెలిసికూడా,నీకు నచ్చినట్టు,నీఆనందం కోసం పెళ్ళికి ఒప్పుకుని అందులో నా ప్రేమను చూపించానమ్మా. అడగందే అమ్మ కూడా పెట్టదంటారు. కానీ,మా అమ్మను  అడగక్కర్లేదు.నాకు అవసరమైనవి తనే…
Read More