సోషల్ మీడియా లో వార్తలు
సోషల్ మీడియా లో వార్తలు సోషల్ మీడియా లో వార్తలు ఎంతవరకు నిజం ఆకట్టుకునే అర్థాలు ఆదాయం కోసం వ్యూహాలు అర్దం తెలియని సమాధానాలు అంతుచిక్కని ప్రశ్నలు చతికిలబడ్డ విలువలు సందేహం తీర్చని వార్తలు సరిదిద్దని సమస్యలు సంకోచాల సంక్లిష్టం నమ్మలేని నిజాలు నమ్మేవారికి మోసాలు భయపెట్టే భాష్యాలు ఆశపెట్టే అవకాశం మెరుపు తీగ ముచ్చట్లు రంగులు మార్చిన రాతలు రాజకీయాల కోణాలు సరికొత్త సన్నివేశాలు మెదడుకు మేత పెట్టని విషయాలు వ్యతిరేక ప్రచారాలు వాస్తవానికి దూరంగా చికిత్స చేయలేని రోగంలా సాక్షం లేని సంగతులు సమర్దించ లేని లోపాలు సాయం కాని సలహాలు అస్త్ర శస్త్రాలు అనుకుని ప్రస్తుత సమాజాన్ని పాలించి పీడిస్తున్నాయి నిజా నిజాలు తెలుసుకోలేని సమయం లేని రోజులు కాబట్టి ఎవరికి వారుగా నిర్ణయించు కుంటున్నారు దిశా నేర్దేశాలను ఇది సమాజానికి హానికరం......? - జి జయ