aksharalipi stores

అమ్మకి వందనం

అమ్మకి వందనం

అమ్మకి వందనం అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందాను ఈ రూపంఈ భూవిపై కన్నులు తెరిచి తొలినే చూశాను దేవత రూపం. అమ్మ అనే పదంలో అమృతం ఉంది. అమ్మ చేతి స్పర్శలో స్వర్గం ఉంది. అమ్మ ప్రేమ అనురాగాల ఒడి ఆదేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి. అమ్మ అనే మాట మనం పలికే తొలిమాటఅమ్మ. అమ్మ పాడిన జోల పాట మనం వినే తొలి పాట. ప్రతి గృహం దేవాలయం అయితే అందులో కనిపించే దైవం అమ్మ .ప్రతి మనిషి పూజించే తల్లి దైవం అమ్మ. పూరిగుడిసెలోని అమ్మయినా అద్దాల మెడలోన అమ్మయినా తన బిడ్డపై చూపి ప్రేమానురాగాలు ఒకే లాగా ఉంటాయి. బాహ్యంగా అలంకరణలో ఆస్తులలో అంతస్తులలోతేడా కనపడవచ్చునేమోగాని ,ప్రతి అమ్మ తన బిడ్డపై చూపి ప్రేమలో తేడా ఉండదు. అమ్మ చూపే ప్రేమను ఆస్తుల అంతస్థలంతో తీర్చేది తూచేది కాదు చేసేది కాదు. అమ్మను…
Read More
జీవితం

జీవితం

జీవితం "రేయ్ నానా నీ కోసం అని చింత చిగురు పప్పు చేసి వడియాలు మజ్జిగ మిరపకాయలు వేయించా.కాస్త తిని పో నానా" అంటూ కొడుకు అవినాష్ ను బ్రతిమాలుతోంది అన్నపూర్ణ. "తింటాను. అయితే ఒక కండీషన్. నాన్నతో నేను బెంగుళూరుకు పోవడానికి ఒప్పిస్తేనే తింటాను . లేకపోతే ముద్ద ముట్టేది లేదంతే" అన్నాడు అవినాష్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న శంకర్రావు" ఏంటో తల్లీ కొడుకులు ఇద్దరూ తెగ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు .ఈ మధ్య నా కొడుక్కి నాన్న కంటే అమ్మ మీదే ప్రేమ ఎక్కువైంది అన్నాడు శంకర్రావు. "లేదు నాన్న . నువ్వంటేనే ఇష్టం. నేనెప్పుడూ నాన్న బిడ్డనే అంటూ తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు అవినాష్. " నువ్వంటే నా ధైర్యం రా. మా ఇద్దరి ప్రాణం నీలోనే ఉంది. ఎదిగిన కొడుకు తండ్రికి భరోసా. అందరూ ఏమంటున్నారో తెలుసా పాతికేళ్ళ వయసులో నేనెలా ఉన్నానో అచ్చం…
Read More
మా నాన్నే నా హీరో

మా నాన్నే నా హీరో

మా నాన్నే నా హీరో చాలా మంది సినిమా హీరోలను ఆరాధిస్తారు. వారినే హీరోలుగా భావిస్తారు. నాకు మాత్రం నాన్నే హీరో. మా నాన్న పేరు చలసాని వెంకట రామకృష్ణ గారు. ఆయనప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగాపని చేసి రిటైర్ అయ్యారు.అందరికీ అమ్మ తొలి గురువుఅయితే నాకు మాత్రం నాన్నేతొలిగురువు. విద్యాబుద్ధులుచెప్పటంతో పాటు సమాజంలోఎలా మసలాలో నేర్పించిన మహా మనిషి ఆయనే. ఆయనతన స్వంత డబ్బుతో ఎందరికోచదువు చెప్పించారు. తన జీతం మొత్తం డబ్బు అవసరం ఉన్న వారికి ఇచ్చేవారు. మాఅమ్మగారు కూడా ఉద్యోగంచేస్తుండటం వలన ఆమెజీతం మా కుటుంబానికివాడేవారు. కష్టాలను ఎలాఎదుర్కోవాలి, సమస్యలుఎలా తీర్చుకోవాలి అనేవి ఆయన జీవితం చూసి మాకు తెలిసింది. టీచర్స్ గిల్డ్ లోకూడా ఆయన పనిచేసేవారు.ఆయన నిస్వార్థంగా ఏ పనైనాచేసేవారు. రిటైర్ అయ్యాక కూడా ప్రైవేటు స్కూలులోపనిచేసారు. చివరకు ఆయనగుండెపోటుతో మరణించారు.ఆయన చనిపోయేనాటికి ఆయన బ్యాంకు ఎంకౌంట్లోకరెక్టుగా వంద రూపాయలుమాత్రమే ఉన్నాయి. ఏదిఏమైనా నా హీరో నాన్నే.వారి…
Read More
మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు ఇది నిజంగా జరిగిన సంఘటన. కాకపోతే నాక్కాదు, మా ఇంట్లో వారికి,  అప్పట్లో మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళం. అందరం ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నాం. అయితే సుచిత్ర లో మా చిన్న పిన్నివాళ్ళు ఉండేవాళ్ళు. రాకపోకలు ఉండేవి అప్పట్లో .ఇప్పుడు ఎవరు రావడం లేదు. అది వేరే విషయం లెండి. అలా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇష్టం ఉంటే అప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. కానీ మేమే వెళ్ళేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నగా ఉండేది. కాబట్టి వాళ్లే ఇక్కడికి వచ్చి రోజులకు రోజులు ఉండేవారు. మా పిన్ని కొడుకు కాలేజీకి వెళ్ళబుద్ది కానప్పుడు మా ఇంటికి వచ్చి తిని బాగా పడుకునేవాడు. అమ్మకు చెప్పకండి అని బతిలాడే వాడు. అలాంటిది ఒక ఆదివారం రోజు మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. అప్పుడే తినడానికి కూర్చున్నాం. రోజు అందరం ఉండము కాబట్టి, ప్రతి…
Read More
ఆడవారి ఆరోగ్యం

ఆడవారి ఆరోగ్యం

ఆడవారి ఆరోగ్యం చాలామంది ఆడవాళ్లు తమకు ఏ అనారోగ్యం వచ్చినా బయటకి చెప్పుకోరు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయనే  భయం కావచ్చు, లేదా తమ ఇంటి పరిస్థితి బాగాలేదు అని కావచ్చు. అందువల్ల చాలా మంది తమ గురించి తాము సరిగా పట్టించుకోరు. చిన్నచిన్న వాటికి డాక్టర్ దగ్గరికి ఎందుకులే అని అనుకుంటూ గృహ వైద్యం పాటిస్తూ ఉంటారు. అంటే పసుపు నీళ్లు కానీ, లేదా మరొకటి కానీ చేస్తూ ఉంటారు .తప్ప , ఇంట్లో  వాళ్లకు విషయం చెప్పరు.  మరికొందరు చెప్పినా కూడా ఆ ఏముందిలే ఇంత పసుపు పూసుకోపోతుంది అని అంటూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ చిన్న, చిన్న వ్యాధులు మామూలుగా తగ్గిపోయినా,  కొన్ని మాత్రం పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటాయి. దాన్ని చివరి వరకు ఎవరు గుర్తించరు. ఇప్పుడు అసలు సమస్యకు వద్దాం.. పూర్వకాలంలో బయట అంటే పీరియడ్స్ సమయంలో ప్రత్యేకంగా బయట కూర్చో పెట్టేవారు.…
Read More
హీరో

హీరో

హీరో హీరోల్లో నాకు నచ్చిన హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మంచి నటుడు.ఎలాంటి సన్నివేశం లో అయినా ఒదిగిపోయే నటుడు అతను. అతని కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు దాదాపు చూస్తాను.కామెడీ సినిమాలు అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి కాసేపు అయినా నవ్వుకోవచ్చు కదా అందుకే నాకు కామెడీ అంటే ఇష్టం. వారి సినిమాల్లో మంచి కామెడీ ఉండేది.ఇప్పుడు వస్తున్న కామెడీ అంతగా నచ్చడం లేదు. ఆరోగ్య పరమైన ,ఆలోచించే విధమైన కామెడీ ఇప్పుడు రావడం లేదు. అసలు కామెడీ చేస్తుంటే ఇధి కామెడీ నా అనే ఆశ్చర్యం వేస్తుంది. అలా ఏడిపిస్తుంది ఇప్పటి కామెడీ. అసలు నవ్వించడం అంటే ఎంతో కష్టం , అయ్యో హీరో గురించి చెప్పకుండా కామెడీ గురించి చెప్తున్నా... సరే ఇక హీరో గురించి మాట్లాడుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారు పాత సినిమాలలో సైడ్…
Read More
తిట్టిన నాన్న

తిట్టిన నాన్న

తిట్టిన నాన్న మా నాన్న ఇంటికి పెద్దవాడు అంటే మగపిల్లలు లో మా నాన్నగారు పెద్దవారు. ఆడపిల్లల్లో మా మేనత్త పెద్దది. అంటే మీకు అర్దం అవుతుంది కదా ,మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ముగ్గురు బాబాయిలు , నలుగురు అత్తలు అన్నమాట. అంటే చాలా పెద్ద కుటుంబం. వీరిలో అంటే అత్త ,నాన్న తర్వాత బాబాయి నీ నేను చూడనే లేదు.అప్పటికి ఆయనకు ఏదో వ్యాధి వచ్చి ,నేను చిన్నగా ఉండగానే చనిపోయారు అంట. అంటే ఇప్పుడు నాన్నతో పాటు ముగ్గురు, అత్తలు నలుగురు, నాన్నమ్మ ,తాతయ్య, అమ్మ ,నేను , నా ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం పదమూడు మందిమి కాదు మళ్లీ బాబాయి కి పెళ్లయ్యింది కాబట్టి పద్నాలుగు అన్నమాట . తర్వాత వాళ్లకు ముగ్గురు పిల్లలు ఇప్పుడు సంఖ్య పదిహేడు అన్నమాట.. వేసవి సెలవులు ఇవ్వగానే నాన్న మమల్ని బిస్తరు కట్టమని చెప్పేవారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులు…
Read More
నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు   నందమూరి తారక రామారావు గురించి రాసే అంత అర్హత నాకు ఉందని నేను అనుకోను అయినా కూడా నాకు తెలిసింది రాస్తాను. నాకు తెలిసిన శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే రామారావు గారు. శ్రీరాముడు ఎలా ఉంటాడని నన్ను అడిగితే ఎన్టీ రామారావు గారి లాగా ఉంటాడు అని చెబుతాను. జస్టిస్ చౌదరి ఎవరు..? కోర్టులో జడ్జ్ కైనా వాదించే లాయర్ అయినా నా దృష్టిలో ఎన్టీ రామారావు లాగా ఉంటాడని చెబుతాను. ఇలా ఎన్టీ రామారావు రకరకాలుగా వేషాలు వేసిన ఆ వేషాలు అన్నింటిలో ఉన్న క్యారెక్టర్లు నిజంగా అలాగే ఉంటాయని అనుకుంటాను నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇక ముగిస్తున్నాను.   -భేతి మాధవిలత
Read More
చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి నాకైతే చిరంజీవి గారి నటన చాలా ఇష్టం ఎందుకంటె అతని ఫేస్ ఎక్స్ ప్రెషన్లు బాగుంటాయి నటనలో ప్రావీణ్యం బాగుంటుంది.. తరువాత వెంకటేష్ గారు అతని నటన కూడా చాలా బాగుంటుంది చిరంజీవి మెుదటి సినిమా పునాది రాళ్లు అయినప్పటికి చట్టానికి కళ్లు లేవు అనే సినిమా చూసిన తరువాత అతని సినిమా లంటె నచ్చేవి.. ఇప్పుడింకా చాలా మంచి హీరోలే వచ్చారు..అందరూ కూడా నటన లో శిక్షణ తీసుకుని చాలా బాగా నటిస్తున్నారు.. ఇక నాకింకా నా మనవడైతే పెద్ద హీరో! వాళ్ల అమ్మ వాడికి తినిపించే టపుడు వాడు చేసే నటన చాలమ్మా! అంటూ కడుపు పట్టుకుని నొప్పి అంటూ చేసే అధ్బుత యాక్షన్ సూపర్.. ఇంక ఫోన్ చూడ వద్దని కోప్పడు తుంటె ప్లీజ్!ప్లీజ్! ఫైవ్ మినిట్స్ మా ( అమ్మను మా అంటాడు ) వాడు పెట్టే బుంగమూతి కమల్ హాసన్ నటనే ఇగ..వాడే…
Read More
 మెగాస్టార్ చిరంజీవి

 మెగాస్టార్ చిరంజీవి

 మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పుడు స్కూల్ లో నాకు నా ఫ్రెండ్స్ కి చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం ఉండేది. ఆయన నటించిన సినిమాలు గురించి ప్రతి రోజు మాట్లాడుకొనే వాళ్ళం. ఆయన మమల్ని కలిసినట్టు కలలు కనే వాళ్ళం.. కొన్ని రోజులు తరువాత ఒక మాగజైన్ లో ఆయన గురించి చదివాను. అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా పేరు పొందారు. ఆయన ప్రతి పుట్టిన రోజు నాడు అభిమానాలు రక్త దానం చేసేవారు. చిరంజీవి గారు "చారిటబుల్ ట్రస్ట్" స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం…
Read More