aksharalipi stories

జగమే మాయ!!

జగమే మాయ!! నిరంతరం లోతు పరిధి పెరుగుతూ, మనిషి జీవితంలో లోతైన తన పాత్ర వహించేదే ఈ మాయ. మాయ లో మొదటి అక్షరం 'మా' అంటే మానవుడు అండి. రెండవ అక్షరం 'య' అంటే యత్నాలు. కాబట్టి మానవుడి ప్రయత్నాలు మాయలో భాగమే. తల్లి గర్భం నుంచి శిశువు ను మాయ నుంచి వేరు చేస్తారు.. అంటే మానవ జీవితం మాయ నుంచే ప్రారంభం. మరి మనతో ఇంత గట్టి బంధం ఉన్న మాయని వ్యతిరేక పదం అనగలమా? అనుకూల అర్థాన్ని ఇచ్చే పదం అనగలమా? తల్లి పనిలో ఉన్నప్పుడు పసిబిడ్డ గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఇంట్లో పెద్దావిడ ఆ పాప నోట్లో తిత్తి పెట్టేస్తుంది. బిడ్డ వెంటనే ఏడుపు ఆపేస్తుంది. ఇలా తిత్తి తో పాప ని మనం మాయ చేస్తాం. చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామను పిలుస్తూ పాపకు అన్నం తినిపిస్తాము. ఆ పాప…
Read More

చివరి చూపు

చివరి చూపు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది నందిని కి మంచి సంబంధం, బాగా ఉన్నవారు, సంస్కారవంతులు అని తెలిసి నందిని తల్లిదండ్రులు నందిని కి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నందిని భర్గ వాసు తో చాలా సంతోషంగా ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి అనేది ఎలా ఉంటుందో కానీ పెళ్లి తర్వాత ప్రేమ అనేది చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని, అతని కుటుంబాన్ని ప్రేమించడం కొత్తగా ఉంటుంది. నందిని కూడా అలాగే అనుకుంది. భర్తను, అత్తా మామలని తన వాళ్లనుకుని వారిని బాగా చూసుకుంటుంది. వాళ్ళు కూడా నందినికి చాలా గౌరవంగా, ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఉన్నారు. ఈ నాలుగేళ్ల లో నందిని లేకుండా వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చారు. నందు బాక్స్ రెడీ నా అంటూ వచ్చాడు వాసు హా వస్తున్నా అంటూ ఒక చేత్తో బాక్స్…
Read More

నీ కౌగిలి లో…

నీ కౌగిలి లో... తను నన్ను చూస్తున్నాడని  నాకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నా, అసలు గమనించనట్టు ఉన్నా, కానీ అదేంటో మనల్ని ఎవరైనా చూస్తే ఆ చూపులు వీపు కు గుచ్చుకుంటాయి. మనసైన వారు ఎక్కడ ఉన్నా అలా తెలిసిపోతుంది. అందుకే తనను తప్పించుకుంటూ తిరుగుతున్నా లేదంటే ఊరుకుంటాడా అసలే చిలిపి. ఆపై అతని ఆశలకు, కోరికలకు హద్దే లేదు. ఇంతలో ఫోన్ లో మెసేజ్ టోన్ ఏంటా అని చూస్తే ఇంకెవరు తానే ఎంటా అని చదివి, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదా నీ పని చెప్తా, అందరి ముందు నిన్ను కౌగిలించుకోకపోతే నా పేరు వేరే గా పెట్టేసుకుంటా అని. అమ్మో ఏంటి అంత ధైర్యం అనుకున్నా, ఛా నిజమా అన్నాను. హా నిజమే అంటూ రిప్లై సర్లే చూద్దాం అన్నాను. హా మరి నన్ను పట్టించుకోకుండా వెళ్తవా అన్నాడు. ఏంటి నాకదే పని అనుకున్నావా అన్నాను.…
Read More

గుంభన

గుంభన కుడి చేత్తో ఇచ్చినది ఎడమ చేతి కి కూడా తెలియకూడదు అనే గొప్ప నైతిక సూత్రాన్ని మనం నిత్యం నెమరు వేస్తూ ఉంటాం. అయితే మనం ఏది దానం చేస్తే దాన్ని అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని చెప్పుతూ తృప్తిని పొందుతాము. చదువు అయితే అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది అని, భోజనం అయితే అన్నదానం గొప్పదని, నీరైతే ఉదకదానం గొప్పదని చెప్పేస్తాము. కారణం ఆ సమయంలో మనము ఇచ్చేదానికి గొప్ప రంగును పులిమెస్తాము. అవి ప్రపంచాన్ని వణికిస్తున్న రోజులు.ఆ రోజుల్లో మీడియా ప్రచారం లేకపోయినా చీమ సైతం తల దాచుకునేది.. ఈ అలజడికి కారణం స్కైలాబ్.అది ఏ క్షణనం లో అయినా భూమండలం మీద పడవచ్చు. జనావాసాల పై పడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే జన నష్టం తప్పదు. ఇలా జనాలు చిగురుటాకులా వణికి పోతున్నారు. ఆయన మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. సాయంత్రం 6…
Read More

ఆత్మ

ఆత్మ అమ్మా రెడీ నా అంటూ వచ్చాడు ప్రణవ్. హా రెఢీ రా అన్నాను, సరే పద పద అసలే నువ్వు మొదటి నుండి సినిమా చూడాలి అంటావు, ఆలస్యం అయితే మళ్లీ నన్నే తిడతావు అన్నాడు. అబ్బో సర్లేరా ఆటో వచ్చిందా అన్నాను. అంత లేదు. బైక్ ఉండగా ఆటో ఎందుకే, అంటూ ముందుకు కదిలాడు. ఇద్దరం కలిసి బైక్ పైన సినిమా హల్ కు వెళ్ళాము. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాం. కాబట్టి అవి ఫోన్ లో చూపించి లోపలికి వెళ్ళాము. సీట్లలో కూర్చున్న తర్వాత నాకు అందులో ఎవరో ఉన్నట్టు అనిపించింది. లేచి చూసాను, కానీ ఎవరు లేరు. మళ్ళీ కూర్చున్నా... ఒకరి పై మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు, మళ్లీ లేచి చూసాను. ఎవరు కనిపించలేదు. నేను అలా రెండు సార్లు లేవడం చూస్తున్న ప్రణవ్, ఏంటమ్మా, ఏమైంది నల్లులా అన్నాడు.…
Read More

హై వే

హై వే ఆకు పచ్చటి పొగ కమ్మేసిందా...... దట్ట మైన అడవుల గుండా ఒక సెలయేరు పారుతోందా అన్నట్టు కనిపిస్తోంది ఆ హై వే. పచ్చని చెట్టుకు పూసిన ఎర్రని పువ్వు లా ఆ ఏర్రని కారు దూసుకు పోతుంటే నా కళ్ళు మురిసి పోయాయి హృదయంతో. అది రాజీవ్ హై వే. పక్కా తెలంగాణ కి సింహ ద్వారం. మరి ఈ ఎర్రని పువ్వు ప్రయాణం ఏటో? ఆ కారు వేగంలో కొంత మార్పు కనిపించింది. హై వే నుంచి ఒక పిల్ల దారి గుండా అడవి లోకి ప్రవేశించింది. అలా, కొంత ప్రయాణం చేశాక ఆ కారు చక్కటి సెలయేరు కు దరిగా దట్టమైన చెట్లు, కొండలు వున్నచోట ఆగింది. డోర్ తీసి అందులోంచి ముందుగా దిగింది నేనే. ఇలా, ఓ ఆరుగురం ప్రకృతి ఒడిలో గడుపుదామని అలా వచ్చేసాం. కొంత కాలిబాటన నడచి గుబురుగా పెరిగిన చెట్లు…
Read More

పశుత్వం – చివరికే తెలుస్తుంది

పశుత్వం - చివరికే తెలుస్తుంది ఉండాల్సిన విధానాల్లో ఉంటూ సత్కర్మలు చేయడమే కదా.... మానవత్మం అంటే. నేడు, అది జరుగుతోందా? నేను, ఏమో, అనే అంటాను. మీరు ఎమన్నా పరవాలేదు. ఇంకా, నాలో మానవత్వం ఉందనే నమ్ముతాను. శాంతారామ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనిది, బలవత్ పదవీ విరమణ. ఆయనను ఎదో తప్పులో ఇరికించేసి ఉద్యోగం లోంచి తీసేశారు. మిగిలిన వారందరూ మానవతావాదులు, పాపం ఈయనోక్కడే వ్యతిరేకావాది అయ్యాడు. బంధువులు, చుట్టుపక్కలవారు ఈయనని ఈసడించుకోవడం మెదలుపెట్టారు. దాదాపు వెలివేశారనే చెప్పవచ్చు. పేరుకి తగినట్టుగా శాంతరూపం ఆయనది. పదవీ విరమణకి పూర్వం, నేను మరియు ఆయన కిరాణా షాపులో, పాన్ షాపులో కలిసినప్పుడు అభిమానాన్ని కళ్ళతో, నవ్వుతో ఇచ్చిబుచుకునే వాళ్ళం. ఈ మానవీయ అడవిలో అతను ఏకాకిలా ఎగురుతూ ఏదో గొణుక్కుంటూ వీధుల వెంట చక్కర్లు కొడుతూ కనిపిస్తాడు. ఆయన మనస్సుకు తగిలిన ఈ గాయం అతనిని మతిభ్రంశుడ్ని చేసింది. ఇది, జనాల…
Read More

నాన్నగారి కథలు

నాన్నగారి కథలు మా నాన్నగారి గురించి చాలా చెప్పాలి అని ఉంది. అందుకే ఒక్కొక్క కథ మీకు చెప్తాను. ఈ శీర్షిక ద్వారా మీరు కూడా మీ నాన్నగారి గురించి నాకు చెప్పండీ.. మరి మనం మా నాన్నగారి కథ లోకి వెళ్దామా... అవి మా నాన్న గారి చిన్నప్పటి రోజులు అన్నమాట. ఒక రోజు మా నాన్నగారు వాళ్ళ అక్కగారింటికి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా బయలు దేరారు. మా నాన్నగారు వెళ్తున్నారని తెలిసి మా నానమ్మ గారు తన కూతురి కోసం దసరా పండగకు చేసిన అప్పాలు, మురుకులు లాంటివి ఒక మూట గా కట్టి ఇచ్చారు. మరి ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది కదా అందుకని పిండి వంటలు కట్టి ఇచ్చారు. ఆ మూటను మా నాన్నగారు అద్దె సైకిల్ పైన కట్టుకున్నారు. మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ అయితే ఎడ్ల బండి…
Read More

సగం కూలీనే..

సగం కూలీనే.. అరే మల్లిగా పనికి వేళ అయ్యింది రా.. తొందరగా రా పోదాము.. అందరూ పోయినారు మనదే లేట్... బయట రోడ్ మీద నుంచి అరుపు మా చిన్నాన్న (తిరుపతి బాబు) నాకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు.. ఇంతకీ ఎక్కడికి పోతున్నాము చెప్పనే లేదు కదా... సెలవుల కోసం ఇంటికి వచ్చిన నేను అమ్మ కి కాస్త సాయం గా ఉంటుంది.  నా టూషన్ కి డబ్బులు, పరీక్ష ఫీజు లు కట్టాలి అంటే కావాలి గదా.. అందుకే మా ఊరి అడవిలో సర్కారు వాళ్ళు వేసిన జామ ఆయిల్ చెట్లు కొట్టడానికి ఊరిలో అందరూ పోతూ ఉంటే నాకు పోవాలి అని అనిపించింది.. వాళ్ళతో పాటు నేను కూడా కత్తి చేత బట్టి నెత్తికి కండువా చుట్టి ఇంకో చేతిలో చద్ది అన్నం టిఫిన్ లో పెట్టుకొని వాళ్ల అడుగుల్లో అడుగులు వేయడం మొదలు పెట్టాను...  దాదాపు రెండు…
Read More

పరాకాష్ట

పరాకాష్ట మంచితనం" ఒక వినసొంపైన పదం దీనికి ఒక ఏకవరుస నిర్వచనం ఇద్దాం. "మంచి అంటే చెడును దహించునది." నాతో ఏకీభవిస్తావా పాఠకా? ఇలా ఎన్ని నిర్వచనాలిచ్చినా, వాటి మూల సారాంశం మంచిదే పైచేయి. నేను దీన్ని ఒక కొత్త కోణంలో చూడట్లేదు. కానీ ఒక వింత కోణం నుంచి చూస్తున్నాను "అగోచరమైనవి లెక్కింపబడజాలవు" అనే ఒక సూత్రం ఉంది మన శాస్త్రాల్లో... మరీ మంచితనం కూడా అగోచరమైనదే...! ఐతే మన మేధాశక్తి దీన్ని బహువచనం చేసేసింది. ఎలా అంటారా? ఈ చెడును దహించే మంచికి మూడు కాష్టలున్నాయండి. వరుసగా ఆది కాష్టము, మధ్యే కాష్టము, మరియు పరాకాష్టము. అంటే మనం మంచిని బేరీజు వెస్తున్నాము. నేను ఇక్కడ యింకో కాష్టాన్ని పరిచయం చేస్తున్నాను. అది కాంట  కాష్టాము. కొలిచేది కాంట అండి, నిఘంటువు అవసరము లేకుండానే చెప్పేస్తున్నాను. మన ప్రపంచ జనాభాలో సుమారుగా 40% మందిలో ఈ మంచితనం ఉంది…
Read More