aksharalipi storys

అపరిమితమైన సంతోషం

అపరిమితమైన సంతోషం

అపరిమితమైన సంతోషం కొత్త ఇల్లు కొనాలని మోహన్ ప్లాన్ వేసాడు. పెళ్ళైన మొదటి సంవత్సరమే బ్యాంకు లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొనాలి అని అతని ఉద్దేశ్యం. భార్య కూడా అందుకు ఒప్పుకుంది. మొత్తానికి పేపర్ వర్క్ పూర్తి అయ్యింది. మంచి జీతం వచ్చే ఉద్యోగం అవటం వల్ల అతనికి తొందరగా హౌసింగ్ లోన్ సాంక్షన్ చేసారు బ్యాంకు వారు. భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఆమె కూడా పెళ్ళికి ముందే కొంత డబ్బు వెనకేసింది. ఆ డబ్బు కూడా తన భర్తకు ఇచ్చి ఇంటికి వాడమని చెప్పింది. తనను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మోహన్ కు ఆపలేని సంతోషం కలిగింది. జీవితంలో పెళ్ళి చేసుకోకూడదు అని అనుకున్న మోహన్ పెద్దల బలవంతం మీద పెళ్ళి చేసుకున్నాడు. అతను పెళ్ళంటే చాలా భయపడ్డాడు. అతను భయపడినట్లుగా ఏమీ జరగలేదు. అంతా మంచే జరిగింది. అనుకూలవతి అయిన భార్యా దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాలకే…
Read More
సరస్వతీ కటాక్షం మూడో భాగం

సరస్వతీ కటాక్షం మూడో భాగం

సరస్వతీ కటాక్షం మూడో భాగం ఆనందమైన జీవితములో అపశృతులు తన జీవితము ఆనందంగా మనసుకు ప్రశాంతముగా సాగుతున్న వేళ, అపశృతులు ఎదురయ్యాయి. చిన్నపుడు ఆకతాయు తనంగా మిత్రులతో ఆడుతున్నప్పుడు బెంచు మీద నించి కాలు జారి క్రిందపడ్డాడు. దాంతో తలబద్ధలై నెత్తురు కారుతూండగా,ఆ నెత్తురుని చూసి మురిసిపోయాడు, తాను అంత బాగా ఆడాడు అని అనుకుని. కానీ కొన్ని క్షణాల తరువాత కళ్లు తిరిగి నేల మీద పడ్డాడు. అదే ఒక అపశృతి .బడి మాట అటు పక్కన పెడితే ప్రాణాలు ఉంటాయా అనే సందేహం ప్రప్రథమమైనది.ఆ దేవుణ్ణి దైవ వళ్ల బ్రతికి బయట పడ్డాడు. అప్పటి నించి ఆటకి దూరంగా బ్రతికాడు. మంచిగా దృష్టి మెత్తం చదువు మీద పెట్టాడు. పెద్దయ్యాక పెద్ద డాన్ లేదా, రుబాబు మనిషి గా అవ్వాల్సిన అతను గన్ను బదులు పెన్ను చేత పట్టి, జీవితము మనిషి విలువ తెలుసుకుని, గణాంకాలలో అత్యున్నతమైన గౌరవం,…
Read More
కుటుంబ విలువలు

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ ల కోసం తల్లులని కంగారు పెట్టటం. ఇలా ఇల్లు హడావిడి హడావిడిగా వుంది... నలుగురు అన్నదమ్ములు అయిన ఆ ఇంటి పెద్ద లోగిలిలో కూర్చొని అందరి విశేషాలు తెలుసుకొంటూ వారు చెప్తున్నారు... అ ఇంటి పెద్ద కొడుకు విజయ్ చదువు ముగించుకొని సిటీలో ఉద్యోగానికి ప్రయాణం అయ్యే రోజు కూడా ఉగాది రోజే.. ఇంట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి తీసుకురావటానికి విజయ్ మిగిలిన కుర్రాళ్లు, ఆడపిల్లలు అందరూ కలిసి బయటకి వచ్చారు. అన్నీ ఇంటికి తీసుకువెళ్లారు. విజయ్ వాళ్ళ అమ్మ ఉగాది పచ్చడి చేసి అందరికి పెడుతుంది.. విజయ్ వాళ్ళ నాన్న తో కూర్చొని బాబాయిలు చెప్తున్నది…
Read More
అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్.. అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన ‌పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ... ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం... చాలా రోజుల తర్వాత తన ఊరికి…
Read More
మా ఊరి జ్ఞాపకాలు

మా ఊరి జ్ఞాపకాలు

మా ఊరి జ్ఞాపకాలు   అది ఓ చిన్న ఊరు. ఊరిలో ఎప్పుడు పొలం పనులతో ఖాళీ లేకుండా ఉండే ప్రజలు. అక్కడక్కడా కిరాణా కొట్లు, ఓ వైపు దుర్గమ్మ గుడి మరో వైపు గాయత్రీ అమ్మవారు, అంజినేయ స్వామి గుడులు. ఊరి మధ్యలు ఓ చర్చి. ఆ అందులో ఉందండి మా ఊరి బడి. దగ్గర దగ్గర 70.80 ఏళ్ళండి ఆ బడికి. మా ఊరి డాక్టర్ నుండి బడి పంతులు, గుడి పంతులు వరకు అందరు అక్కడే చదివేరండి. ఈ ఊరిలో నాలుగు తరాల వారు ఇక్కడే చదివేరు. అందుకే టీచర్లకు పిల్లల మీద అంత అభిమానం. ఏ విద్యార్థిని ని చుసిన వాళ్ల అమ్మ, నాన్న వీళ్ల దగ్గరే చదువుకున్న వారైనా వుంటారు అందువలన ఆ బడిలో బేత్తానికి అవకాశమే లేదండి అంతా ఓ కుటుంబం లా వుంటారు. ఆ బడిలో లెక్కలు మాస్టారంటే అందరికి దడ.…
Read More
యోధ ఎపిసోడ్ 1

యోధ ఎపిసోడ్ 1

యోధ ఎపిసోడ్ 1 నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలు.. ఇంకా మిస్టరీ వీడని మర్డర్ కేసులు.. ఆరు నెలలుగా తెలియని ఆ అన్నా చెల్లెళ్ళ ఆచూకీ.. ఇది పోలీసుల మరియు ప్రభుత్వ వైఫల్యమేనా?" న్యూస్ ఛానల్ లో వస్తున్న ఆ న్యూస్ ని, హాల్లో కూర్చొని పెద్ద వాల్యూంతో తీరిగ్గా వింటున్నాడు శ్రీనివాసరావు పొద్దు పొద్దునే.. "అబ్బబ్బా.. పొద్దునే ఆ న్యూస్ లు కాకుండా ఏదైనా మనసుకు కొంచెం ప్రశాంతత కలిగిన భక్తి గీతాలు ఏమైనా పెట్టరాదూ" అంటూ వంటింట్లో వంట చేసుకుంటూ అదంతా వింటూన్న అతని భార్య సులోచన విసుక్కుంది. సరిగ్గా తను అలా అందో లేదో ఈ లోపే పవర్ పోయింది. "అదిగో నీ మొర ఆ భగవంతుడు కూడా ఆలకించినట్టున్నాడోయ్!" అంటూ ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అది చదవడానికి. ఈ లోపే "ఇదిగోండి కాఫీ..!" అంటూ తన చేతికి…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1 ఆ రోజు ఆదివారం, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్ కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. "హలో..! సార్ ..! సార్..! జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ ఆ అండి ! హా.. అవునయ్య (ఆ రాత్రి డ్యూటీలోనున్న కానిస్టేబుల్ బదులిచ్చాడు) "ఇక్కడ ... ఇక్కడ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్ష్మి విలాస్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 333 (అడ్రస్ కల్పితం) లో ఒకావిడని అతి దారుణంగా చంపేశారు సార్! మీరు త్వరగా ర్ర.. ర్ర.. ర్రండి సార్! (కొంచెం కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో)" అంటూ విషయం చెప్పి సడెన్గా కాల్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారమివ్వడంతో, హుటాహుటిన ఆ అజ్ఞాత చెప్పిన అడ్రెస్స్ కి బయలుదేరి వెళ్ళారు ఆ పోలీసు వారంతా. వాళ్ళు అక్కడికి చేరుకునే…
Read More
ఒక తెలియని బంధం

ఒక తెలియని బంధం

ఒక తెలియని బంధం "హలో" అంటూ మెసేజ్ టోన్ ఎవరా అంటూ చూశాను ఏదో అన్నోన్ నెంబర్. ఆ నెంబర్ ఎవరిది అనుకుంటూ "హలో, హూ ఈజ్ థిస్" అని మెసేజ్ చేశా. "నా పేరు వినయ్ నేను ఒక నర్సరీ నడుపుతున్నాను మీకు ఏమైనా మొక్కలు కావాలంటే నన్ను సంప్రదించండి ఇలా నేను అందరికీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటాను ఇది నా వ్యాపారం". అంటూ చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. "అవునా నాకు మొక్కలు అంటే ఇష్టమే, సరే అవసరం ఉన్నప్పుడు చెప్తాను" అన్నాను నేను. "అలాగే ఈ మెసేజ్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్" అంటూ రిక్వెస్ట్ గా అడిగాడు. "సరే ఖచ్చితంగా చేస్తాను" అంటూ ఆ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను. మా మధ్య పరిచయం మొదలైంది. హాయ్ గుడ్ మార్నింగ్ నుంచి…
Read More
మౌనం

మౌనం

మౌనం ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. కానీ నాకు కోపం చాలా వచ్చింది. దాంతో నేను మా అమ్మతో మాట మానేశాను. అది కూడా కరోనా సమయంలోనే, ఈ కారణం అనేది చాలామందిని చాలా ప్రస్టేషన్ కి గురిచేసింది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్లనో ఏమో చేసే పని ఎక్కువ అయింది పని ఎంత చేసినా తరగదు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుభవమయ్యే ఉంటుంది. అయితే ఆ ప్రస్టేషన్ లో నేను మా అమ్మ కాస్త గొడవ పడిన మాట నిజం. పాపం మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు నిలబడి వంట చేయలేదు. ఇది తెలిసినా కూడా నేను రోజూ చేయడం విసుగొచ్చి నువ్వు ఒకసారి…
Read More
చేదు

చేదు

చేదు నరేందర్ కథ గుర్తుందా అదే అండి మొన్న షుగర్ అని తెలిసిన నరేందర్. ఇప్పుడు అతను ఎట్లాంటి పాట్లు పడుతున్నాడు చూద్దాం ... ఏమండీ లేవండి అంటూ లత నిద్ర లేపే వరకు మెలకువ రాలేదు నరేందర్ కు. ఆకలితో నకనకలాడుతు యెప్పుడూ నిద్ర పట్టిందో గానీ ఇప్పుడు లేచేసరికి సమయం పది దాటింది. అమ్మో నా ఆఫీసు అంటూ గబుక్కున లేవబోయాను అతన్ని అపుతూ లత, మీ ఆఫీసర్ గారు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రమ్మన్నారు గానీ ముందు బ్రెష్ చేసి రండి అంటూ బాత్రూం లొకి నెట్టింది. సరే సరే వెళ్తున్న అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ ముందు కూర్చున్న నరేందర్ ముందు లత రెండు గ్లాస్ లు పెట్టింది. అవి చూసి అందులో ఉన్న ద్రవాన్ని చూస్తూ ఎంటే ఇది హాయిగా ఏ అట్టో తేకుండా ఇవేంటి అన్నాడు బిత్తర పోయి.…
Read More