భట్లపెనుమర్రు గ్రామం
భట్లపెనుమర్రు గ్రామం నాకు నచ్చిన ప్రదేశం నా స్వగ్రామం. నా స్వగ్రామంపేరు భట్లపెనుమర్రు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికృష్ణా జిల్లాలో ఉన్న మొవ్వ మండలంలోని ఒక గ్రామం. భట్లపెనుమర్రు గ్రామంమన జాతీయ పతాక రూపకర్తశ్రీ పింగళి వెంకయ్య గారిజన్మస్థలం. శ్రీ పింగళి వెంకయ్యగారి గౌరవార్థంగ్రామంలోని ప్రధాన వీధికి ఆయన పేరు పెట్టారు. అలాగేగ్రామ నడిబొడ్డున ఆయన విగ్రహం నెలకొల్పారు. అంతే కాకుండా శ్రీ పింగళి వెంకయ్యగారి పేరు మీద గ్రామంలో ఒకపెద్ద కళ్యాణ మండపాన్నిగ్రామస్తులు అంతా కలిపికట్టించుకున్నారు. కళ్యాణమండపం కట్టాలనే ఆలోచన శ్రీ చలసాని శాయోజీరావుగారిది. దానికి గ్రామంలో ఉన్నప్రజలు సహకరించారు.అది చాలా గొప్ప విషయం.ఈ మధ్యనే శ్రీ పింగళి వెంకయ్య గారి విగ్రహం పక్కనే 110అడుగుల ఎత్తులో జాతీయజండా నెలకొల్పారు. మా గ్రామం నుండి అనేక మందిభారత స్వతంత్ర సంగ్రామంలోపాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలు చాలా శాంతి ప్రియులు.రైతులంతా కష్ట జీవులు. మాగ్రామం పచ్చదనంతో నిండిఉంటుంది. గ్రామంలో ఎక్కడచూసినా పచ్చని చెట్లు మనకుకనపడతాయి.…