అమ్మకి వందనం
అమ్మకి వందనం అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందాను ఈ రూపంఈ భూవిపై కన్నులు తెరిచి తొలినే చూశాను దేవత రూపం. అమ్మ అనే పదంలో అమృతం ఉంది. అమ్మ చేతి స్పర్శలో స్వర్గం ఉంది. అమ్మ ప్రేమ అనురాగాల ఒడి ఆదేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి. అమ్మ అనే మాట మనం పలికే తొలిమాటఅమ్మ. అమ్మ పాడిన జోల పాట మనం వినే తొలి పాట. ప్రతి గృహం దేవాలయం అయితే అందులో కనిపించే దైవం అమ్మ .ప్రతి మనిషి పూజించే తల్లి దైవం అమ్మ. పూరిగుడిసెలోని అమ్మయినా అద్దాల మెడలోన అమ్మయినా తన బిడ్డపై చూపి ప్రేమానురాగాలు ఒకే లాగా ఉంటాయి. బాహ్యంగా అలంకరణలో ఆస్తులలో అంతస్తులలోతేడా కనపడవచ్చునేమోగాని ,ప్రతి అమ్మ తన బిడ్డపై చూపి ప్రేమలో తేడా ఉండదు. అమ్మ చూపే ప్రేమను ఆస్తుల అంతస్థలంతో తీర్చేది తూచేది కాదు చేసేది కాదు. అమ్మను…