aksharalipi today telugu poems

 పసుపు రంగు

 పసుపు రంగు

 పసుపు రంగు నాకు ఇష్టమైన కలర్ ఎల్లో.. పసుపు రంగు ఇష్టపడేవారు స్నేహపూర్వకంగా, బహిరంగంగా, అవుట్‌గోయింగ్ మరియు ఆనందంతో ముడిపడి ఉంటారు. పసుపు రంగు ఉల్లాసభరితమైన, సంతోషకరమైన, హాస్య మూడ్‌ను ప్రేరేపిస్తుంది. మన ఆలోచనా ప్రక్రియలను సక్రియం చేయడానికి మరియు కొత్త ఆలోచనలను రూపొందించడానికి కొన్నిసార్లు ఉపయోగ పడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళితే పసుపు రంగు ఉన్న ఏ వస్తువు అయిన తీసుకొని వెళ్ళితే విశ్లేషణాత్మకంగా మారడానికి, సృజనాత్మక ప్రక్రియల ద్వారా పరిష్కారాలను కనుగొనడంలో లేదా సమస్యలకు మన స్వంత పరిష్కార వ్యూహాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది మూడ్ స్టెబిలైజర్‌గా పనిచేస్తుంది, దీనిని హ్యాపీ కెమికల్ అని కూడా పిలుస్తారు. పసుపు రంగు మీ మెదడును మేల్కొలిపి ఏకాగ్రతను పెంచుతుంది. పసుపు రంగు ఎడమ మెదడులో కార్యకలాపాలను కూడా పెంచుతుంది, ఇది హేతుబద్ధమైన ఆలోచన మరియు విశ్లేషణాత్మక…
Read More
రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం ఈ ప్రకృతి సుందరమైనది. ప్రకృతిలో గులాబీ, మల్లెపూలు, లిల్లీ, మందారం వంటి రంగురంగుల పూలు ఉన్నాయి. మామిడి,దానిమ్మ,యాపిల్ వంటి మధురమైన రంగురంగుల ఫలాలు కూడా ఉన్నాయి. నెమళ్ళు,చిలకలు వంటి సుందరమైన పక్షులు కూడా ఉన్నాయి. చర్మంపై అందమైన చారలు గల పులులు,లేళ్ళు మొదలైన జంతువులు కూడా ఉన్నాయి. సప్తవర్ణాల ఇంద్రధనుస్సును గురించి ఎవరికయినా వర్ణించ తరమా.మన మువ్వన్నెల జండాలో ఉన్న కషాయం రంగు త్యాగానికి చిహ్నం. అలాగే తెలుపు రంగు శాంతికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ సమృద్ధికి చిహ్నం. జండా మధ్యలో నీలం రంగు గల అశోక చక్రం ఉంది. ఆ త్రివర్ణ పతాకంలో ఉన్న రంగులు మనకు ప్రేరణ ఇస్తాయి. నీలం రంగు ఆకాశం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నదులలో ప్రవహించే నీలం రంగులో ఉన్న స్వచ్ఛమైన నీరు మనసును రంజిపజేస్తుంది. పూర్వం నలుపు,తెలుపు రంగులో సినిమాలు,టెలివిజన్ కార్యక్రమాలు వచ్చేవి. తర్వాత రంగుల చలనచిత్రాలు వచ్చాయి. నాకు…
Read More
భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..! ******* అవును.. భార్యదే నిజమైన చదువు. చిన్నప్పుడు తల్లిదండ్రులను.. చదువుకున్నప్పుడు స్నేహితులను.. కలిసిమెలిసితిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని.. చదువుకుంది.. ..................... పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది. పిల్లలను చదువుతుంది. తన కుటుంబ సభ్యులను చదువుతుంది. పరిసరాలను చదువుతుంది.. అందుకే... భర్తకు.. తన గురించి తనకు తెలియని విషయాలెన్నో భార్యకు తెలుసు! తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు. పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు. అందుకు ... ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ! ..................... సంసారం ఒక గడియారమనుకుంటే... చిన్న ముల్లు భర్త, పెద్ద ముల్లు భార్య గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం! నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం! వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట.. కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట..! పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా…
Read More
మనసు పరిమళం

మనసు పరిమళం

మనసు పరిమళం అసహ్యించుకుంటావేందుకు కుళ్ళిపోయిన దేహన్నే కావచ్చు నేను నలిగిపోయిన పుష్పాన్నే కావచ్చు చితికి పోయిన చితి మంటనే కావచ్చు మగతనపు నిరూపణ కోసం పెళ్ళి పేరుతో ఒకడు స్వార్థపు తెరలను కప్పి పుచ్చుకుని ప్రేమ పేరుతో శరీరాన్నీ కామించిందొకడు యుక్త వయసు రాగానే ఒకింటికి పంపించేయాలి గుండెలపై బరువు దించేసుకోవాలని భావించిందొకడు నాకు దక్కని అందం మరోకడికి దక్కిందని కుట్రలకు పాల్పడింది ఒకడు నేను నా మనసేంటని నాకేమి కావాలో చెప్పుకోలేని దౌర్బాగ్యపు స్థితుల్లో పెట్టింది ఒకడు ఆ ఒక్కడు అనే వాడు తండ్రి రూపంలో అన్న రూపంలో మొగుడి రూపంలో స్నేహితుడి రూపంలో ప్రియుడి రూపంలో చేసిన గాయాలకు కుళ్ళిన దేహమే ఇది అసహయపు పడతి ఆవేదనే ఇది కుళ్ళిన దేహపు మనసు పరిమళం చూడు ఆడతనం అమ్మతనం కనిపిస్తాయేమో అర్హత లేని అసహయురాలినేనేమో కానీ ఆశయం ఉన్న అతివ కనిపిస్తుందేమో బాహ్య సౌందర్యపు మది చాటు అంతరం…
Read More
ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. చింత నిప్పుల వంటి కళ్ళు ప్రసన్నమైన ముఖారవిందం రోషము కోసమే మొలచిన మీసాలు ఆ రూపమే శత్రుభయంకరం.. మరో నరసింహావతారం జననం దుష్ట సంహారం చేసేందుకు అవతరించే తెల్ల రాక్షసులను తుద ముట్టించేందుకు నరరూపము దాల్చిన నరసింహం.... అహోబిలేసుడే ఆత్మ దైవమై రేనాటి గడ్డలో గాండ్రించెను శత్రువుపై ఆ నామము స్మరించిన సీమలో గడ్డి పూస గర్జించును పగవాడిపైన.. తిరుగుబాటు బావుటాయే కలిగి నిప్పులు కళ్ళల్లో పిడుగులై కురిసే సీమ పౌరుష ప్రతాపాగ్నికి చిహ్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఖ్యాతి గడించే.. రేనాటి నేలలు బంగారం పండిస్తుంటే కుందునదీనీళ్లు దాహాన్ని తీరుస్తుంటే అన్నదమ్ముల వలె హాయిగా జీవిస్తుంటే కళ్ళు కుట్టి నొస్సుపై దండెత్తాడు తెల్లోడు.. ఆంగ్లేయుల దాష్టీకం లో ప్రజలకు ఇబ్బందులు అధికార మతోన్మాద వైఖరి అవలంబిస్తే పీడించి పన్నులు వసూలు చేస్తుంటే నిప్పుల కొలమిలా నరసింహారెడ్డి అగ్ని జ్వాలయై ఎగిసే.. రాయల…
Read More
దేశం కోసం

దేశం కోసం

దేశం కోసం   మన దేశం కోసం.. ఎంతో మంది విప్లవ కారులు.. విప్లవం రేకెత్తించి తెల్ల దొరల.. బారి నుండి మనల్ని రక్షించారు.. భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది వీరుల పోరాటమే మన స్వతంత్రం.. మన దేశం మనకు వచ్చింది.. మన భారత దేశం మనదని గర్వంగా చెప్పుకుంటున్నాం! ఇవ్వాల్ల.. ఎంతో మంది ప్రాణాలనర్పించి మనకీ దేశాన్నిచ్చారు.. అలాంటి దేశంలో కుళ్లు,కుతంత్రాలు ఎక్కువై పోతున్నాయి.. స్వాతంత్రం వచ్చిన సంతోషాన్ని మిగల నీయకుండా నేడు దర్మార్గులు ఎక్కువవుతున్నారు.. భరత మాత భరించ లేనంటుంది.. భారతావని మూగబోతుంది.. భారతమ్మను కాపాడుకుందాం! కలిసి మెలిసి ఉండి భారతమ్మను.. సంతోష పెడదాం!!   -ఉమాదేవి ఎర్రం  
Read More
పోరాటం

పోరాటం

పోరాటం చేయాలి చేయాలి విప్లవం చేయాలి ఉన్న వాటిలో తృప్తి చెందకుండా లేని వాటికోసం ఆరాటపడుతూ అత్యాశకు పోతూ గాలి మేడలు కడుతూ డబ్బు కోసం అయిన వారిని దూరం పెడుతూ డబ్బుని చూసి బంధుత్వం కలుపుకునే వాళ్లని నమ్ముకొని మంచి అని ముసుగు వేసుకొని అందర్నీ నమ్మిస్తూ ఉన్నంత స్థాయిలకు ఎదగాలని కుట్ర పడుతూ అహంకారమే ఆభరణంగా భావిస్తూ లేని వాళ్ళని చులకనగా చూస్తూ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు చూసి పోగరుగా భావిస్తూ అన్నిచోట్ల పోరాటం చేస్తూ తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది.. తన జీవితంలో ప్రతిరోజు నెత్తురుతో పోరాటం చేస్తూనే ఉంటుంది.. తనకు సహనం ఉన్నంతవరకే అన్ని సహిస్తుంది ఒక్కసారి ఆ గోడలన్నీ తెంచుకొని విప్లవం సృష్టిస్తుంది.. చేయాలి చేయాలి పోరాటం చేయాలి తన గమ్యం కోసం పోరాటం చేయాలి తన ఒంటరితనానికి తోడు అవసరం లేదు అని పోరాటం చేయాలి తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకోవాలి మండే…
Read More
విప్లవం

విప్లవం

విప్లవం   ఈ పదం విని ఎదో అనుకోకు మిత్రమా, విప్లవం అంటే మార్పు కోరడం, విప్లవం అంటే నీకై చేసే పోరాటం, తప్పుని తప్పు అని చెప్పడం విప్లవం, నీ మనుగడకై నువ్వు ఎంచుకున్న దారే విప్లవం, కాలంతో మారడం విప్లవం, నలుగురిని మార్చేది విప్లవం, చెడును ఎదిరించేది, మంచిని నేర్పేది విప్లవం. సమాజం పట్ల ఉండే నైతిక భాధ్యత విప్లవం.     - చైతన్య కుమార్
Read More
విప్లవం

విప్లవం

విప్లవం రైతే ...రాజా..!? విప్లవం ..విప్లవం..పెను విప్లవం.. అనంత మార్పులతో.. విశ్వమంతా వ్యాపించిన.. హరిత విప్లవం..! నైసర్గిక స్వరూపాలే..సహజత్వాన్ని.. కోల్పోయిన వైనం..! హరిత విప్లవం.. హరిత విప్లవం..అంటూ.. హేలీనాదం చేసిన శాస్త్రవేత్తలే .. అనుభవాల సమీకరణ లో.. సేంద్రియ వ్యవసాయమే .... మేలంటున్న ... వైనం..! సన్నకారు , చిన్నకారు రైతులు.. కాయకష్టం చేసే కూలీలుగా.. మారిన... ధైన్యం..! పట్టడన్నం.. పెట్టె అన్నదాతను రుణ సంకెళ్లలో బంధించిన హీనం..! ప్రకృతే.. స్పందించి వర్షిస్తే.. అతివృష్టి.. అనావృష్టి..ఆనక.. అప్పు చేసి పుడమి పై పెడితే. గుప్పెడు గింజలను .... గింజుకొని ఇచ్చే ప్రకృత్రి..! అన్నీ ఒడ్డుకొని పండిస్తే.. గిట్టుకొని గిట్టుబాటు ధరలు...! శాస్త్రం..పరిజ్ఞానం.. పరికరాలు..పరిశీలనలు..అన్నీ నేటి రైతు స్థితిని ... కాపాడుకోలేని ..నిర్ధేశం..! మట్టిలో పుట్టి .మట్టిలో పెరిగి.. తుదకు మట్టిలోనే కలిసిపోయే.. బలవన్మరణాలు..! రైతన్న నిత్య జీవనం.. చావు , బ్రతకుల... మధ్య సంఘర్షణల కన్నీటి సుడిగుండం లో.. కొట్టుకుపోతున్న..శోకం..! అన్నం…
Read More
చేనేత కార్మికులు

చేనేత కార్మికులు

చేనేత కార్మికులు ఓ చేనేత అన్నా...... వస్త్రములను అస్త్రముల వలే. అందంగా అల్లిననూ అన్నము దొరకపాయెనే.. ధర దరిచేరక ,వస్త్రము వదిలి వెళ్ళక .. కూలిబాటు లేకపోతే కుమిలిపోతుంది ముగ్గము.. చేయుత లేకపోతే చెదిరిపోతుంది చేనేత జీవితం. ఆకలిని బందించి ,కండరాలను కదిలించి చెమటను చిందించిన , చేనేత వస్త్రాము చెంత చేరదు , కడుపు నిండదు.. జీవనం సాగదు అలనాటి కుటీర పరిశ్రమల కళా నైపుణ్యం ఈనాటి మర పరిశ్రమల ముందు కళాహీనమౌతూ కనుమరుగౌతున్నను కనికరం లేకపాయెనే... మర మగ్గముల ముందు చేనేత మగ్గముల పగ్గములు మూగబోయెనే... రారాజులను మురిపించిన వస్త్రములు విదేశీయుల మన్ననలను పొందిన వస్త్రములు వాడిపోయిన పూవులై వెలవెల పోతూ.. నీరు పోసేవారికై ఎదురుచూస్తున్నవి. చేనేత మగ్గములు. మల్లె మొగ్గలై... చేనేతకు పూర్వ వైభవం పల్లవించాలంటే.. పత్తి పంట పండాలి అధికంగా... అందమైన కళకు ఆదరణ చూపి., అన్ని విధాలా చేనేత అన్నను ఆదుకుంటే ‌. అందమైన…
Read More