aksharalipi yagnavatikala mounamai

యజ్ఞవాటికలో మౌనమై

యజ్ఞవాటికలో మౌనమై

యజ్ఞవాటికలో మౌనమై పాత మడుగున కోనేటి పాచిని కొండా కోనలపై నుంచి దిగిన కొత్తనీరు తోసినట్లుగా... పాతరోజుల పండగలను నేటి కొత్త రోజులు మతాల మారణహోమాలతో సినిమా తంతున చూపిస్తున్నాయి... వెలుగెంట నడిచిన మూగ ప్రయానమై నిజాలను నిరూపించుకోలేక క్షణాల ముందర నీళ్ళు నములుతు జీవితం నటనలతో నడిచేటి ఒక ఆశేనని నిర్ధారణకు వచ్చావు... ముక్కంటి దేవుడు ముల్లోకాలకు ఆరాధ్యుడు దేవదానవుల కష్టం కంఠాన గరళంగా దాగుందని తెలిసినా బతుకు వక్కలవుతుందని నీళ్ళు నమలని నోటితో చెప్పలేక...భస్మించిన యజ్ఞవాటికలో మౌనమై పార్వతితో పరిణయం ఆగిపోరాదని... శీగ్రమున తెరచిన కంటితో శిరస్సున గంగను జలనిధిగా బంధించెను జఠాధారియై పరమోత్తమాల కొరకు... ఆస్తులు అంతస్థులు కొనలేవు అంతిమాన మూడడుగుల చోటును... జానెడు పొట్టకొరకు ప్రతిని బతిమిలాడుతు జ్ఞాన సూత్రంతో పుట్టింది ఏడుపుతో మొదలు...చచ్చేవరకు అందరి ఏడుపుల శోకమయమై పదవుల కొరకు పాకులాడుతు అందలమెక్కాక బురద నీటి పాదమై... మోపిన బరువు క్రింద పేదవాడైతే శూన్యం…
Read More