aksharalipi

కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷 భగవద్గీతను చదివినచిగురించగ వచ్చు బ్రతుకు చింతనలేకన్భగవద్గీతను మరచినతెగిన పతంగియగు బ్రతుకు తెరువును కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
మొదటి బాధ్యత

మొదటి బాధ్యత

మొదటి బాధ్యత చిన్నారి ఆరాధ్య వయసు కేవలం ఆరు సంవత్సరాలు. బొమ్మలతో ఆడుకోవాల్సిన ఆ చేతులు, తన చిన్న గుండెను ఒడిలో దాచుకున్నట్లుగా ఎర్రటి హృదయాకారపు దిండును హత్తుకుని రోజంతా మౌనంగా కూర్చునేవి. ఒకప్పుడు వారి ఇల్లు నవ్వులతో… కళకళలాడేది. నాన్న కథలు చెప్పేవాడు. అమ్మ లాలిపాటలు పాడేది. కానీ చిన్న చిన్న మాటల తగాదాలు పెద్ద పెద్ద గోడలుగా మారాయి. చివరకు అమ్మా నాన్న విడిపోయారు. ఆ రోజు నుంచి ఆరాధ్య జీవితంలో రంగులు మసకబారిపోయాయి. అమ్మ దగ్గర ఉన్నా నాన్న కోసం ఏడ్చేది. నాన్న దగ్గర ఉన్నా అమ్మ కోసం వెతికేది. ఇద్దరికీ తమ బాధలే కనిపించాయి.కానీ ఆ పసి మనసు ముక్కలైన సంగతి ఎవ్వరూ గమనించలేదు? ఒకరోజు పాఠశాలలో టీచర్ ,"నీకు అత్యంత ఇష్టమైనది ఏది?" అని అడిగింది. పిల్లలంతా బొమ్మలు, చాక్లెట్లు, పక్షులు, పూలు అని చెప్పారు. ఆరాధ్య మాత్రం తన హృదయాన్ని హత్తుకుని,"నాకు మళ్లీ…
Read More
చిత్తరంజన్

చిత్తరంజన్

చిత్తరంజన్ చిత్తరంజన్ (లలిత గీతాలు రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో స్వరకల్పన) మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 - 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు.ఎనిమిదేళ్ల వయసు నుంచి నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్‌ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించాడు. 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్‌ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది. రచనలుఇతడు వెలువరించిన పుస్తకాలు:లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలులలిత సంగీత సౌరభంశ్రీ చిత్తరంజనం: కీర్తనలు, లలిత భక్తి గీతాలు, మంగళహారతులు. ఇతడు స్వరపరచిన లలిత గీతాల జాబితా:నదీసుందరి సుధాస్యందిని దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ 1957లో రచించారు ఈ పాటచూచే కొలదీ సుందరము…
Read More
గిడుగు రాజేశ్వరరావు

గిడుగు రాజేశ్వరరావు

గిడుగు రాజేశ్వరరావు గిడుగు రాజేశ్వరరావు (నవంబరు 7, 1932 - జూలై 21, 2013) తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి మనుమడు. ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు, తెలుగు భాషను మాట్లాడండి. పిల్లలకు నేర్పించండి. అంటూ నిరంతరం సాగించిన ప్రచారం ఆయన భాషా సేవకు నిదర్శనం.నవంబరు 7, 1932లో పర్లాకిమిడిలో జన్మించిన రాజేశ్వరరావు విజయనగరంలో ఎఫ్.ఎ (ఫెలో ఆఫ్ ఆర్ట్స్.. ఇంటర్మీడియట్ సమానార్హత), పర్లాకిమిడిలో బి.ఎ చదివారు. భువనేశ్వర్ లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు. చిన్న వయస్సులోనే రాజేశ్వరరావు రాసిన "టార్చి లైట్" అనే కార్డు కథ 1947, ఆగస్టు 15 నాటి "చిత్రగుప్త" సంచికలో ప్రచురితమైంది. దాదాపు ముప్పై కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. "రాగిరేకు", "విషవలయాలు", "కర్మయోగులు" కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి. పలు నవలలు, కథలు, శతకాలు, పద్యాలు రచించారు. తాత గిడుగు రామమూర్తి గారి…
Read More
పసునూరు శ్రీధర్ బాబు

పసునూరు శ్రీధర్ బాబు

పసునూరు శ్రీధర్ బాబు డా. పసునూరు శ్రీధర్ బాబు ఆధునిక తెలుగు కవి, పాత్రికేయుడు. ఆయన తొలి కవితా సంకలనం అనేక వచనం 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా పాత్రికేయుడు. ప్రస్తుతం బిబిసి తెలుగు న్యూస్ బులిటెన్ కు సారథ్యం వహిస్తున్నాడు. పసునూరు శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో 1969, జూలై 21 న జన్మించాడు. తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు నల్లగొండ జిల్లాలోని ఉత్తటూరు, మోత్కూరు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, మహబూబ్…
Read More
కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷 తరగతిగదిలో గురువులుసరగున పాఠమ్ము చెప్పి చదివించంగన్త్వరగా శిష్యులు నేర్వగమురియుచు దీవించు చుండు ముద్దుగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
ప్రతి ఒక్కరి కర్తవ్యం

ప్రతి ఒక్కరి కర్తవ్యం

ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రపంచాన్ని ఒకప్పుడు రాక్షసులు భయపెట్టారని పురాణాలు చెబుతాయి. కానీ నేటి సమాజంలో కొత్త రాక్షసులు పుట్టుకొచ్చారు. వారే కబ్జాసురులు. వీరికి కొమ్ములు ఉండవు, కోరలు ఉండవు. కానీ ఇతరుల హక్కులను, ప్రభుత్వ భూములను, చెరువులను, అడవులను, బలహీనుల ఆస్తులను ఆక్రమించే దురాశే వారి అసలు రూపం. కబ్జాసురులు తమ స్వార్థం కోసం చట్టాలను లెక్కచేయరు. అధికారాన్ని, డబ్బును, పలుకుబడిని ఆయుధాలుగా మార్చుకొని ప్రజల ఆస్తులపై కన్నేస్తారు. చెరువులను పూడ్చి భవనాలు కడతారు. అడవులను నరికేసి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిస్తారు. పేదల భూములను బలవంతంగా లాక్కొని వారి జీవితాలను అంధకారంలోకి నెడతారు.వారి కబంధ హస్తాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. చెరువులు కనుమరుగైతే… భూగర్భ జలాలు తగ్గిపోతాయి. అడవులు నశిస్తే వాతావరణ మార్పులు తీవ్రతరమవుతాయి. ప్రజా స్థలాలు ఆక్రమించబడితే… భవిష్యత్ తరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విధంగా కబ్జాసురులు సమాజానికే కాదు, ప్రకృతికీ శత్రువులుగా మారుతున్నారు.కబ్జాసురులను అరికట్టడం…
Read More
నేటి సమాజ స్థితి

నేటి సమాజ స్థితి

నేటి సమాజ స్థితి నేటి సమాజం లో దుష్టులుదుర్మాప్గులు ఎక్కువయ్యారువెనుకట రాక్షసులంటే కొమ్ములుపెట్టుకుని భయంకరంగా ఉండేవారని చదువుకున్నాం! అలానేఊహించుకున్నాం!కానీ ఇప్పుడు మామూలు మనుషులుగానే ఉంటున్నారు! కానీ మనసులనిండా విషమే! భూములను కబ్జాలుచేస్తున్నారు! మనుషులను దోచుకుంటున్నారుసాటి మనిషే కాదాని నమ్మితే సర్వం ముంచడమే!వెనుకటికి శరీరాలు చూసి వీల్లు రాక్షసులనిగుర్తించే వాల్లం! దూరం ఉండే వాల్లం! ఇప్పుడుగుర్తించడం చాత కావడం లేదు!దుష్టులని తెలియకుండా మంచి ముసుగు వేసుకునిమెాసం చేస్తున్నారు! కబ్జాసురుల నుండి జర జాగ్రత్తండి! ఉమాదేవి ఎర్రం
Read More
ఎస్.జె.సూర్య

ఎస్.జె.సూర్య

ఎస్.జె.సూర్య ఎస్.జె.సూర్య (తమిళ, తెలుగు, చిత్రాల నటుడు,దర్శకుడు , రచయిత, సంగీత దర్శకుడు,గాయకుడు) సెల్వరాజ్ జస్టిన్ పాండియన్(జననం 20 జూలై 1968), తన రంగస్థల నామం ఎస్.జె. సూర్యతో ప్రసిద్ధి చెందారు, ఈయన ప్రధానంగా తమిళ చిత్రసీమలో పనిచేసే ఒక భారతీయ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, రచయిత మరియు పరోపకారి . ఆయన నటుడు కావాలని కోరుకున్నప్పటికీ, వసంత్ మరియు సభాపతి వద్ద సహాయకుడిగా దర్శకత్వ వృత్తిని ప్రారంభించారు. సూర్య 1999లో 'వాలీ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు, ఆ చిత్రం విజయంతో ఆయన స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ఆయన నటించిన ఇతర ముఖ్యమైన చిత్రాలలో ' ఖుషి' (2000), 'న్యూ' (2004), 'అన్బే ఆరుయిరే' (2005) మరియు 'ఇసై' (2015) ఉన్నాయి. ఆయన 'న్యూ' చిత్రంతో నటుడిగా పరిచయమై , ఆ తర్వాత 'కల్వనిన్ కధాలి' (2006), 'తిరుమగన్ ' (2007), 'వ్యబరి' (2007) వంటి చిత్రాలలో నటించారు.…
Read More
కంఅం!!💐🪷

కంఅం!!💐🪷

కంఅం!!💐🪷 వేకువ జామున పేపరుటీకప్పును చేతబూని టెక్కును జూపన్మేకప్పును వేసుకొనియుకాకుల వలె పొడిచి చంపు క్యాన్సరు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More