aksharalipitoday story

పున్నామ నరకం

పున్నామ నరకం

పున్నామ నరకం   "ఏమిటండీ ఇది ...ఈ చోద్యం ఎక్కడైనా ఉందా? తరతరాలుగా వస్తున్న మన ఆచారాలు, సాంప్రదాయ పట్టింపులు  గాలికి వదిలేస్తే ఎలా? మన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి మనమేమైనా ఆటవిక సమాజంలో ఉన్నామా... మనకంటూ మన పెద్దలు పెట్టిన  పద్ధతులంటూ కొన్ని ఏడ్చాయి.. వాటిని కాదని ఒక ఆడపిల్ల తండ్రికి తలకొరివి పెట్టడమా? మీరంతా మాట్లాడరేమిటండీ..." అవధానిగారి పార్థివదేహం ముందు కూర్చుని ఉన్న ఊరి పెద్దలు, బంధుగణం వైపు చూస్తూ బుగ్గలు నొక్కుకుంటూ అడిగారు శివయ్య గారు. "అవునవును..ఇలా అయితే మన సాంప్రదాయాలు మంట కలిసి పోవూ...వత్తాసు పలుకుతూ అన్నారు కైలాసం పంతులుగారు. "పుత్రుడు ఉన్నదే పున్నామ నరకం నుంచి తప్పించడానికి.. అతగాడు ఎక్కడున్నా రావాల్సిందే.. తండ్రికి దహన సంస్కారాలు చేయవలసిందే... ఆడపిల్ల ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ఊరికే అరిష్టం.." నొక్కి వక్కాణించారు కామేశం గారు. ఒక్కసారిగా అక్కడ కలకలం బయలుదేరింది. ఎక్కడో దూర దేశాలలో ఉన్న కొడుకు తండ్రి అంతిమ…
Read More
మా ఊరి జ్ఞాపకాలు

మా ఊరి జ్ఞాపకాలు

మా ఊరి జ్ఞాపకాలు   అది ఓ చిన్న ఊరు. ఊరిలో ఎప్పుడు పొలం పనులతో ఖాళీ లేకుండా ఉండే ప్రజలు. అక్కడక్కడా కిరాణా కొట్లు, ఓ వైపు దుర్గమ్మ గుడి మరో వైపు గాయత్రీ అమ్మవారు, అంజినేయ స్వామి గుడులు. ఊరి మధ్యలు ఓ చర్చి. ఆ అందులో ఉందండి మా ఊరి బడి. దగ్గర దగ్గర 70.80 ఏళ్ళండి ఆ బడికి. మా ఊరి డాక్టర్ నుండి బడి పంతులు, గుడి పంతులు వరకు అందరు అక్కడే చదివేరండి. ఈ ఊరిలో నాలుగు తరాల వారు ఇక్కడే చదివేరు. అందుకే టీచర్లకు పిల్లల మీద అంత అభిమానం. ఏ విద్యార్థిని ని చుసిన వాళ్ల అమ్మ, నాన్న వీళ్ల దగ్గరే చదువుకున్న వారైనా వుంటారు అందువలన ఆ బడిలో బేత్తానికి అవకాశమే లేదండి అంతా ఓ కుటుంబం లా వుంటారు. ఆ బడిలో లెక్కలు మాస్టారంటే అందరికి దడ.…
Read More