alalu

అలలు

అలలు ఆ.వె. సంద్రమందు అలలు సంతోష పరచును యెల్ల దాట చేయు వల్లకాడు కన్న కలలు చెదరి కలతలు రేపును హద్దు దాటకుంటె ముద్దు గుండు - కోట
Read More

అలలు

అలలు కడలి కెరటాల తరంగాలు అలలై తీరం చేరాలని ఎగసి పడుతుంటాయి పున్నమి వెన్నెల రాత్రుల్లో ఓలలాడు వొడిగిపోయి సంద్రంలో అమావాస్య అలజడిని గాలి గర్షణలా బెదురు చూపుతుంది సుడిగాలి సుడిగుండాలు కనుచూపుమేర గర్జించి నా ఎదురుచూసిన తీరాలు ఎక్కడ అని చేరుకుంటాయి జాలరికి జీవనాధారమై జలం జలచరాల లో సముద్రం అందిస్తుంటే అలలలో తేలియాడే నావతో నిత్యం సహజీవనం ఆటుపోట్ల అంతుని చూసి భయం లేక వేట సాగును అదే మనిషి ధైర్యం మరి సముద్రపు అలల తాకిడి వచ్చి నీ పాదాలు తాకితే అల శోభించును మనసు ఉప్పొంగును ఒడ్డు చేరిన అల కుదుపు ఆపి మళ్ళీ మొదలు పెడుతుంది మరి ఆలస్యం కాకుండా.......... - జి జయ
Read More

అలలు…

అలలు... అలలు కలలై మిగిలే జీవితంలో కలలు అలలై పొంగే జీవితంలో ఎగసే ఆలోచనల తీరం సాగేను మనసున ఉప్పొంగే కెరటం జీవితంలో ఎదురయ్యే అలల దాటికీ కొన్ని జీవితాలు నిలబడితే మరికొన్ని జీవితాలు అలలలో కొట్టుకుపోయే అలల తాకిడికి వేయాలి అడ్డుకట్ట లేదంటే ఆ అలల ప్రవాహంలో కొట్టుకుపోవడమే ఉంటుంది కొన్ని ఊహల అలలు నిన్ను భ్రమింపజేస్తే మరికొన్ని ఊహల అలలు నీకు వాస్తవాన్ని చూపిస్తాయి అలలు కలలుగా మిగలకుండా కలలు అలలుగా సాగాలి నిన్ను నిలబెట్టాలి నువ్వు జీవితంలో ఎదురయ్యే అలల తాకిడిని తట్టుకొని నిలబడాలి... - గోగుల నారాయణ
Read More