అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ
అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ తెల్లారి వెలుగులు, కల్లాపి రంగవల్లులు, మామిడి తోరణాలు, పిండి వంటలు ఉగాది పచ్చడి తో ఇంటింటా ఉగాది సంబరాలు మొదలైయ్యాయి.... వేకవ జామునే పార్వతమ్మ పూజలు "ఏమయ్యా హారతి తీసుకోండి" అంటూ రామ్ నాన్న గారు శంకరయ్యని పిలిచింది.. ఆఆ వస్తున్న పార్వతి ఏంటి మన రాము ఉదయాన్నే ఇంట్లో హడావుడి పెట్టుకుంచా కట్టి జోరులో ఉన్నాడు పార్వతి .. అంతా ఆ దేవుని దయ ఈ సంవత్సరం అయినా కళ్యాణం జరిగాలి... ఆ అమ్మ అవుతుంది లే నచ్చిన అమ్మాయి వస్తే అంటూ హారతి తీసుకోని... గుడికి వెళ్తున్న అమ్మ అంటూ వెళ్ళగా నేను వస్తాను రా అంటూ ముగ్గురు వెళ్ళారు.. గుడికి చేరుకోగానే అటు ఇటు నలుదిక్కులా తన కళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతునే ఉన్నాయి.. కాళ్ళకు గజ్జెలు అందెలు గళ్ళు గళ్ళు మంటూ సందెడితో తన పక్కన నుండి పూజారి దగ్గరకు…