అసలు కవిత అంటే…?
అసలు కవిత అంటే...? అక్షరాలనే అమ్మా-నాన్నలకు, పదాలవంటి పిల్లలు పుట్టి, వాక్యాలు వారసులుగా నిలబడి, భావాల బాధ్యతలను నెరవేరుస్తూ.... కలలో కనిపించిన కమ్మని నిజాన్ని, ఖచ్చితమైన నిజంచేసి, "కవితాఖనిజం" గా వెలుగొందుతూవుంటుంది! కవిత అంటే ఈ విధంగా ఉండాలి క.....కలలో కనిపించే కధలావుండాలి. వి....విపులంగా విశదీకరించే వివరణవుండాలి త....తనువంతా తన్మయత్వంతో తరింపజేయాలి.... - గురువర్ధన్ రెడ్డి