అవని
అవని భూమి, నేల, వసుమతి, పుడమి, ధరణి ఏవైనా నీకు పేర్లు అనేకం ఉండుగాక.... నీవు పకృతి సృష్టివై ముక్క గా విడి ,చల్లార్చబడి, అనంతకోటి జీవరాసులకు నిలయమై ఖండాలుగా విభజితమై ఉన్నావని..... నీవు మేము విశ్వసించే మత గ్రంధాలప్రకారం దైవం చే విశ్వంలో సృష్టించడి ఖండాలుగా విభజితమై జీవకోటి సంరక్షణిగా ఉన్నావని.... మనుషులు గా మేము నీ పై భిన్న అభిప్రాయాలు కలిగి నివశిస్తున్నది వాస్తవమని ఎరిగి,నీవు ఈ విశ్వంలో ఒక గ్రహమని వేల ఏళ్ల క్రితమే తెలుసుకుని , మాతోపాటు అనంతమైన జీవరాసులు కు నీవే ఆధారమని గ్రహించి జీవనం కొనసాగిస్తున్న తెలివైన జీవులం.... నీపై గలప్రకృతి ఒక జీవనగతి అందు విద్య, వైద్యం మేమందుకొని మనోవికాసులమై ,ఆరోగ్య వంతులమై, అందు అందచందాల అనుభూతి పొందుచూ, అందు అన్నిటి పై ఆదిపత్యం సాధించి,శోధించి ,ప్రకృతి సంపద కొల్లగొట్ట నారంభించి,దుష్ట ఆలోచనా పరులమై నీవందించి ప్రకృతి నాశనం చేయ, మేమే…