b radhika

దేవుడు

దేవుడు ఆది మానవుడు నుంచి నేటి  నవ మానవుడి వరకూ ఆకలి తోడుగానే వుంది. ఆకలి వల్లే వేట మొదలుపెట్టాడు. బాట కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టాడు. నీడ కోరుకున్నాడు. ఆకలి పేదోడి ఇంట అనాధ. పెద్దోళ్ళ ఇంట రాజు. ఆకలి లేని మనిషి అభివృద్ధి చెందలేడు. ఆకలి విలువ తెలియనివాడు మనిషి విలువ అసలే తెలుసుకోలేడు. ఆకలి కొందరికి ఆత్మబంధువు. ఎన్నో జీవిత పాఠాలు నేర్పించే గురువు. దయాహృదయాలను కలిచి వేసేది  ఆకలితో అలమటించే జీవితాలు.  ఆకలి అనుభవం మనిషిగా లేకపోయినా, మనసున్న మనుషులకు ఎదుటవారి ఆకలిని తెలుసుకుంటారు. ఒకరి ఆకలి తీర్చిన వాడే దేవుడు. - రాధికా. బడేటి
Read More

అర్ధరాత్రి

అర్ధరాత్రి అర్ధరాత్రి, కొందరికి అంతరంగం మేలుకునే సమయాలు. భావాలను, భావోద్వేగాలను పూర్తిగా నిద్ర లేపే క్షణాలు. అందని వాటిని ఎన్నో అందించుకునే ఊహల ప్రపంచంలోకి తీసుకుపోయే ఘడియలు. కొందరికి ఆనంద ప్రపంచాన్ని అందిస్తుంది. కొందరికి అవేదన పరిచయం అవుతుంది. ఒంటరితనానికి అర్ధరాత్రి  ఒక నరకం. ఏకాంతానికి ఒక  తియ్యని అనుభవం. అర్ధరాత్రి నడక భయం. ఆలోచనలు అపడం కష్టం. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను సరైన రీతిలో నడిపిస్తే, జీవితం విజయాల మయం.  అన్నీ సమయాలు ఏదో ఒక పరిస్థితితో పోరాడే మనిషి, అర్ధరాత్రి తన అంతరంగ స్థితితో పోరాడాలి. అప్పుడు, అక్కడ ఆ స్థితిని అధిగమిస్తేనే, ఉదయపు సూర్యుని కిరణాల వెలుగును గర్వంగా చూడగలుగుతాడు మనిషి. - రాధిక.బడేటి
Read More

సంపాదన – ఖర్చు

సంపాదన - ఖర్చు కొందరు డబ్బులు సంపాదిస్తారు, ఆనందం కోసం ఖర్చు పెడతారు. కొందరు ఆనందాన్ని సంపాదిస్తారు. డబ్బులు అవసరానికి ఖర్చు పెడతారు. - బి.రాధిక
Read More

దైవం

దైవం కడుపున పడినప్పటి నుంచి, తన కట్టె కాలేవరకూ  కన్నపిల్లలను కంటికి రెప్పలా, కష్టం లేకుండా కాపాడుకోవాలనుకుంటుంది. నీతి, నిజాయితీతో జీవించాలని, క్రమశిక్షణ, కర్తవ్యాలను బోధిస్తుంది. ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు తెలియజేస్తూ పిన్న వయసు నుంచి పెద్ద వాళ్ళుగా పెంచే క్రమంలో తను ఎంత కష్ట పడినా, ఎన్ని అడ్డంకులు అధిగమించైనా, ఒంటరిగానైనా, ఇంటి భారాన్ని, బాధ్యతను నిర్వహిస్తుంది కట్టుకున్న వాడిని సైతం కన్న పిల్లలకోసం ఎదురిస్తుంది. ఎవ్వరూ నమ్మకపోయినా, కన్నతల్లి మాత్రం పిల్లల మీద నమ్మకం ఉంచుతుంది. వారి అలోచనలకు, అభిప్రాయాలకు గౌరవిస్తుంది. తన పిల్లల్ని ఉక్కు మనుషుల్లా, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగే మనసున్న మనిషిగా పెంచుతుంది సహనంలో ధరిత్రి , భువిలోని దేవతామూర్తి కన్నతల్లే. తల్లిని మించిన దైవం లేదు. - బి. రాధిక
Read More

నిరీక్షణ

నిరీక్షణ నా మనసుకు పరిచయమేలేని భావన, "నిరీక్షణ".  నీవు పరిచయమైన క్షణంలో నువ్వు పరిచయం చేసిన భావన. ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన నీకోసమేనని తెలుపుతుంది. కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు తెరపడుతుంది.  వీడ్కోలు చెప్పిన క్షణం నుంచి మొదలవుతుంది. ఎక్కడవున్నా, యదలో తలచుకున్నా, నా నిరీక్షణ సాగుతూనే వుంటుంది. నీ లోనే వున్నాను, వుంటున్నాను అనుకున్న క్షణంలో నిరీక్షణ ఫలిస్తుంది. లేననుకున్న క్షణం నా జీవనానికి నిరీక్షణ ముగుస్తుంది. - బి రాధిక
Read More

ఆశా ప్రపంచం

ఆశా ప్రపంచం ఒకరి ఆశతో, ప్రపంచాన్ని చూశావు. కొందరి ఆశలతో, ప్రపంచంలో పెరిగావు. నీ ఆశతో, ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నీ ఆశలతో, ఒకరి ప్రపంచానికి వెలుగు నివ్వాలి. అందరి ఆశలతో ప్రపంచం నడుస్తుంది. నీ ఆశ నిన్ను నడిపించాలి. ఆశతో బతకాలి. ఆకాశంలో కాదు. ఆశ లేనిదే జీవనం లేదు. అత్యాశ పడితే జీవితమే లేదు. - బి రాధిక
Read More